Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
సంభోగ సమయంలో మ్యూజిక్ వింటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు..వెరసి ఒత్తిడి అనే రాక్షసుడు పడకగదిలోకి కూడా చొరబడుతున్నాడు. ఫలితంగా భాగస్వామల మధ్య ఉండాల్సిన ఆ అద్భుతమైన రంగుల క్షణాలు వెలసిపోతున్నాయి.
మానసిక ఆందోళన లైంగిక ఆనందాన్ని ఆవిరి చేస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఖచ్చితంగా ఉంది.. అదే సంగీతం. మీ ఏకాంత సమయాల్లో వినిపించే చిన్నపాటి మెలోడీ, ఆ రాత్రిని మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చగలదని నిపుణులు చెబుతున్నారు.

శాస్త్రీయంగా నిరూపితం
ఇది కేవలం కవిత్వం కాదు, సైన్స్ చెబుతున్న నిజం. కొందరు నిపుణులు చెప్పిన ప్రకారం సంగీతం మానవ మెదడుపై, లైంగిక సంతృప్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
సంగీతం వింటున్నప్పుడు మెదడులో విడుదలయ్యే రసాయనాలు, భాగస్వామల మధ్య బంధాన్ని మరింత గట్టిపరుస్తాయి. శృంగారం అనేది కేవలం శరీరాల కలయిక కాదు, మనసుల సంగమం అని సంగీతం గుర్తుచేస్తుంది.
సంగీతం ఎలా సహాయపడుతుంది?
మనసును స్వేచ్ఛగా మార్చుతుంది
శృంగారంలో పాల్గొనే ముందు చాలామందిలో తెలియని జడత్వం లేదా బిడియం ఉంటుంది. సంగీతం ఆ జడత్వాన్ని కరిగించి, మనసును స్వేచ్ఛగా విహరించేలా చేస్తుంది. స్వేచ్ఛగా ఉన్న మనసే అందమైన శృంగారానికి తొలి మెట్టు. ఇది నిరాశను, ఆందోళనను పారద్రోలి, మూడ్ ని రీఫ్రెష్ చేస్తుంది.
భయాన్ని పోగొట్టి, ఏకాగ్రతను పెంచుతుంది
కొంతమందిలో పనితీరు పట్ల భయం ఉంటుంది. మ్యూజిక్ వినడం వల్ల ఆ భయం తగ్గి, మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. మీ దృష్టంతా మీ భాగస్వామిపైనే ఉండేలా చేసి, ఆ క్షణాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేలా చేస్తుంది.
వాతావరణంలో రొమాన్స్
మీకు, మీ భాగస్వామికి ఇష్టమైన పాట వెనుక ప్లే అవుతుంటే కలిగే ఆనందమే వేరు. ఆ సంగీతంలోని లయ, మీ మధ్య సాన్నిహిత్యాన్ని మరింత ఆకర్షణీయంగా, తీవ్రంగా మారుస్తుంది. ఇది సహజంగానే కోరికలను రేకెత్తించి, బంధాన్ని బలపరుస్తుంది.
ఆత్మవిశ్వాసం రెట్టింపు
రోజంతా పడిన శ్రమ వల్ల రాత్రికి అలసిపోయి, మంచం మీద నిరుత్సాహంగా అనిపించడం సహజం. కానీ మంచి మ్యూజిక్ ఒక మెడిసన్ లా పనిచేస్తుంది. అది మీలో నూతనోత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపి, మీ భాగస్వామిని సంతృప్తి పరిచే శక్తిని ఇస్తుంది.
కాబట్టి ఈసారి మీ ఏకాంత క్షణాలను నిశబ్దంగా గడపకండి. వాతావరణానికి తగ్గట్టుగా, మనసుకు హాయినిచ్చే శ్రావ్యమైన సంగీతాన్ని జోడించండి. ఆ సంగీతం మీ శృంగార జీవితానికి ఒక అద్భుతమైన సహచరుడిగా మారి, మీ పడకగదిని స్వర్గధామంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. సంగీతంతో జతకట్టిన శృంగారం మాటల్లో చెప్పలేని ఒక దివ్య అనుభూతి అని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications