Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
భాగస్వామిని బాగా సుఖపెట్టలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే శృంగారంలో దబిడి దిబిడే!
ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్, ఆహారం, పనిఒత్తిడి ఇలా రకరకాల కారణాల కారణంగా చాలామంది శృంగార జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. మన పూర్వీకులు వృద్దాప్యంలో కూడా లైంగిక జీవితాన్ని ఆస్వాదించారని మనం తరచుగా వింటుంటాం. అయితే ఈ రోజుల్లో 35 ఏళ్లు వచ్చే సరికే చాలామందికి లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో భాగస్వామిని సంతోషపెట్టలేకపోతున్నారు. వివాహేతర సంబంధాలు పెరగడానికి ఇదొక కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వాస్తవానికి శృంగారం అనేద రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు, ఇది ఇరువురికి మానసికంగా,శారీరకంగా ఎంతో మేలు చేస్తుంది.
శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు, భయ పడకూడదు. కోరికలు అనేవి మగ, ఆడ ఇద్దరిలో సమానమే. ఆరోగ్యకరమైన సంబంధానికి శృంగారం కూడా ఒక ముఖ్యమైన అంశమే. అది లేనప్పుడు సంవత్సరాల తరబడి ఉన్న సంబంధాలు తెగిపోవడమే కాకుండా..ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. జంటలు తమ లైంగిక జీవితాన్ని లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ చూడండి.

తగినంత నిద్ర
సరిపడినంత నిద్ర లేకపోవడం లైంగిక కోరికలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మెరుగైన లైంగిక జీవితాన్ని గడపడానికి ఓ వ్యక్తికి 8 గంటల నిద్ర అవసరం. అనేక అధ్యయనాల ద్వారా ఇది నిరూపించబడింది.
వ్యాయామం
శారీరీక ఫిటెనెస్ లైంగిక జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.సంభోగం సమయంలో శరీరానికి చాలా బలం అవసరం కాబట్టి వ్యాయమం చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. డ్యాన్స్, యోగా, హైకింగ్, కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల మీ గుండె ఉత్తేజితమవుతుంది. దీని వల్ల జననేంద్రియాలలో,మొత్తం శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది సంభోగంలో మీ పనితీరును మెరుగుపరుస్తుంది, భావప్రాప్తిని కూడా మెరుగుపరుస్తుంది.
శుభ్రత
మెరుగైన లైంగిక జీవితం కోసం మీ జననాంగాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. యోని పొడిగా ఉండటం, దురదగా ఉండటం లేదా దుర్వాసన రావడం వల్ల మీ ఇద్దరి లైంగిక అనుభవం దెబ్బతింటుంది. అందుకే పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. దీంతో పాటు లూబ్రికేషన్ కూడా చాలా ముఖ్యం.
ఫాంటసీ
ప్రతి ఒక్కరికి సంభోగంకి సంబంధించిన అనేక అంచనాలు, ఊహలు ఉంటాయి. దీని గురించి మీ భాగస్వామికి బహిరంగంగా చెప్పండి. ఇద్దరూ అంగీకరిస్తే ఏదీ సరైనది లేదా తప్పు కాదు. మీవి, మీ భాగస్వామి ఊహలను హృదయపూర్వకంగా ఆస్వాదించండి. ఇది మీకు కొత్తదనాన్ని ఇస్తుంది, మీ లైంగిక సంబంధాన్ని అద్భుతమైన అనుభవంగా మారుస్తుంది.
విశ్వాసం, అవగాహన
సాన్నిహిత్యం కోసం దంపతులకు వారి శరీరాల పట్ల పూర్తి నమ్మకం ఉండాలి. దీంతో పాటు శరీరంలోని ఉత్సాహాన్ని పెంచే ఆ భాగాల ప్రేరేపకాల గురించి కూడా తెలుసుకోవాలి.
ప్రేమను వ్యక్తపరచండి
అలసట,ఒత్తిడి పెరగడం వల్ల సెక్స్ కోరిక తగ్గుతుంది. అలాంటి సమయాల్లో భావోద్వేగ సాన్నిహిత్యం ఉపయోగపడుతుంది. ప్రేమపూర్వక సంభాషణ, కౌగిలించుకోవడం వంటివి చేయడం మంచిది.



Click it and Unblock the Notifications