Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రామ్ చరణ్ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన.. అందుకే వారు అలా ఉంటారట!
మన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జంటల్లో రామ్ చరణ్, ఉపాసన జంట కూడా ఒకటి. వీరు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేకమైన వైబ్ తీసుకెళ్తుంటారు. ఈ జంట షేర్ చేసే ఫోటోలు, వీడియోలు అప్పటికప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. వీరు పేరుకే హీరో హీరోయిన్‌గా నటించలేదు కానీ.. వారికి కూడా లేని సొంతం ఈ జంటకు ఉంటుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీళ్ళ జంట ఉండే విధానం అలా ఉంటుంది మరి.
ఇంట్లోనైనా, బయటైనా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ జంటను చూసి మురిసిపోని వ్యక్తులు ఎవరో ఉండరు. అయితే తమకు సంబంధించిన సీక్రెట్ ఏంటి? తామెలా అంత అన్యోన్యంగా ఉంటారు? తమ రిలేషన్‌షిప్ సీక్రెట్ ఏంటి అనేది ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దానికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. రామ్ చరణ్, ఉపాసన దంపతుల అన్యోన్యత్వానికి గల రహస్యం ఏంటో వివరించుకుందాం.

రామ్ చరణ్, ఉపాసన రిలేషన్ సీక్రెట్ ఉపాసన మాటల్లో
"వైవాహిక జీవితం ఒక పయనం లాంటిది. ఒకరోజులో ముగిసేది కాదు. ప్రతి రోజూ దాన్ని నూతనంగా నిలబెట్టుకోవడం అనేది అత్యంత అవసరం. మనం మన కెరీర్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు రోజూ కృషి చేస్తాం కదా, అలా ప్రేమ, అనుబంధం అనే వాటికీ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. దంపతులిద్దరూ పని గంటల్లోనూ, ఒత్తిడిలోనూ కొంత సమయాన్ని కలిసి గడపడానికి కేటాయించాలి.
నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలిద్దరూ ప్రతివారం డేట్ నైట్‌కి వెళ్లేవారు. అప్పుడు ఆ అలవాటు గురించి మా అమ్మ చెప్పే ప్రాముఖ్యత నాకెంతగానో గుర్తుండిపోయింది. అయితే నిజమైన విలువ పెళ్లైన తర్వాతనే అర్థమైంది. ఇప్పుడు నేను, రామ్ ఇద్దరం వీలైనప్పుడల్లా కొంత సమయం కలిసి గడిపేందుకు కృషి చేస్తాం. కొన్ని సార్లు అది ఒక సింపుల్ డ్రైవ్ కావొచ్చు, లేదా ఇంట్లో స్నాక్స్‌తో చిన్న పార్టీ కావొచ్చు. కానీ ఈ క్షణాలే మమ్మల్ని బలంగా కలిపే వారధులవుతాయి.
ఈ తరహా క్షణాల్లో ఒకరి మనసులోని మాటలను మరొకరికి చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. సమస్యలు వచ్చినా, ఆనందాలు వచ్చినా వాటిని కలిసి పంచుకోవడమనే నైపుణ్యం అలా బలపడుతుంది. బహుశా ఇదే నిజమైన సంబంధాన్ని గాఢంగా ఉంచే మూలం కావొచ్చు. అలాగే మా బలమైన బంధానికి కారణం అని చెప్పుకోవచ్చు.
రామ్ గురించి చెప్పాలంటే..
రామ్ నిజంగా స్థిరమైన వ్యక్తిత్వం కలవాడు. ఆత్మవిశ్వాసంతో పాటు, నా అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రతి విషయంలోనూ నన్ను ప్రోత్సహిస్తుంటాడు. మా బంధం 'భార్యాభర్త' అనే పరిమితుల్లో ఉండకుండానే, నిజమైన స్నేహితుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి విషయాన్ని కలిసి చర్చించి, నిర్ణయాలు తీసుకుంటాం. ఎవరి మాట ఎక్కువా కాదు, తక్కువా కాదు. బలమైన భాగస్వామ్యమే మా బంధానికి బలం. ఇలా కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు జీవిత భాగస్వామి ప్రోత్సాహం కూడా ఉన్నప్పుడు, ఒక మహిళ ఎంతటి విషయంలోనైనా సమర్థంగా నిలబడగలుగుతుంది.
కుక్కర్ మా ట్రావెల్ పార్ట్‌నర్!
మేము ప్రయాణాలకి వెళ్లేప్పుడు ఒక ఆసక్తికరమైన స్నేహితుడు మాతో తప్పనిసరిగా ఉంటాడు. అదే ఒక చిన్న కుక్కర్. కారణం ఏంటంటే, రామ్‌కి రోజూ భోజనంలో ఎలాగైనా దక్షిణాది లేదా భారతీయ టచ్ ఉండాల్సిందే! కొత్త ప్రదేశాలు చూసే ఆనందంతో పాటు, తన ఇష్టమైన వంటకాన్ని ఇంటి స్టైల్లో తయారుచేసి తినగలగడం అతనికి ప్రత్యేక ఆనందం కలిగిస్తుంది. కాబట్టి, ఆ కుక్కర్ మాతో అన్ని ప్రయాణాల్లో భాగమవుతోంది. సుఖదుఃఖాలను పంచుకోవడం, మానసికంగా కలిసుండటం, చిన్న చిన్న క్షణాల్ని ముఖ్యంగా భావించడం.. ఇవే ఒక బలమైన, ఆరోగ్యకరమైన వైవాహిక బంధానికి మూలాధారాలు. సంబంధాన్ని పుష్కలంగా కొనసాగించాలంటే ప్రేమ, గౌరవం, సమయాన్ని ఒకరికి ఒకరు ఇవ్వడమే మంత్రం!



Click it and Unblock the Notifications