Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
Valentine’s Day Gift Ideas: ప్రేమికుల రోజు మీ లవర్‌కు ఈ గిఫ్ట్స్ ఇస్తే అదిరిపోద్ది.. జన్మలో మిమ్మల్ని మర్చిపోల
వాలెంటైన్స్ డే వచ్చేసింది. ప్రేమికులంతా రేపే దీనిని ఘనంగా సెలెబ్రేట్ చేసుకోనున్నారు. తాము ప్రేమించే వ్యక్తులతో ఈ రోజును అందంగా, ప్రేమగా గడపనున్నారు. ఇందుకోసం ఈరోజు నుంచే ప్రణాళికలు వేసుకోవడం మొదలెట్టేశారు. తాము ప్రేమిస్తున్న వ్యక్తితో టూర్‌కు వెళ్లడం, వారితో సమయం గడపడం వంటివి చేస్తారు. అలాగే వారికి కొన్ని ప్రత్యేకమైన బహుమతులను ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఎలాంటి బహుమతులు ఇవ్వాలో వారికి అర్ధం కాదు. అలాంటి వారికోసమే.. వాలెంటైన్స్ డే రోజు ఏ విధమైన గిఫ్ట్ ఇవ్వాలో ఈ స్టోరీలో తెలిపాము. చదివి మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఏ ఏవిధమైన బహుమతి ఇచ్చేందుకు ట్రై చేయండి.
వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాస్
పువ్వులు
పువ్వులు ప్రేమకు, శృంగారానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఎరుపు గులాబీలు వాలెంటైన్స్ డేకి అత్యంత ప్రజాదరణ పొందిన పువ్వులు. వాలెంటైన్స్ డే రోజు ఎర్ర గులాబీని బహుమతిగా ఇవ్వొచ్చు. అలాగే మీ ప్రియమైన వారికి ఇష్టమైన పువ్వులను కూడా ఎంచుకోవచ్చు.

చాక్లెట్లు
చాక్లెట్లు కూడా వాలెంటైన్స్ డేకి ఒక ప్రసిద్ధ బహుమతి. మీరు మీ ప్రియమైన వారికి ఇష్టమైన చాక్లెట్లను బహుమతిగా ఇవ్వొచ్చు. లేదా వారికి ప్రత్యేకమైన చాక్లెట్ బాక్స్‌ను ప్రజెంట్ చేయొచ్చు.
ఆభరణాలు
ఆభరణాలు మీ ప్రేమను మరియు నిబద్ధతను వ్యక్తపరచడానికి ఒక గొప్ప మార్గం. మీరు మీ ప్రియమైన వారికి ఒక నెక్లెస్, బ్రాస్లెట్ లేదా ఉంగరం ఇవ్వొచ్చు. పర్సనలైజ్డ్ ఆభరణాలు కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. వారి పేరు వచ్చేవిధంగా డిజైన్ చేపించి వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.
వ్యక్తిగత బహుమతులు
వ్యక్తిగత బహుమతులు మీ ప్రేమను, మీరు వారిపై చూపించే శ్రద్ధను ప్రతిరంభించేలా చేస్తాయి. మీరు మీ ప్రియమైన వారికి వారి పేరు లేదా ఫోటోతో పర్సనలైజ్డ్ కప్పు, టీ-షర్ట్ లేదా ఫోన్ కేసును ఇవ్వవచ్చు. పర్సనలైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్, మెసేజ్ ఫ్రేమ్ వంటివి కూడా వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.
అనుభవాలు
కొన్నిసార్లు, అనుభవాలే ఉత్తమ బహుమతులు. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఒక రొమాంటిక్ డిన్నర్, సినిమా లేదా విహారయాత్రకు వెళ్లవచ్చు. అలాగే ఇప్పటి వరకు మీకున్న అనుభవాలన్నిటినీ ఓ ఫోటో ఫ్రేమ్ కట్టించి కూడా వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.
క్లాసికల్ గిఫ్ట్స్
మీరు ప్రేమించే వ్యక్తికి ఇష్టమైన పుస్తకాలు, లేదా వారికి ఇష్టమైన ఆర్ట్‌ను వారికి బహుమతిగా అందజేయొచ్చు. దీంతో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్, మేకప్ కిట్, దుస్తులు వంటివి వారికి బహుమతిగా ప్రజెంట్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications