Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వాలెంటైన్స్ డే అలర్ట్..ఈ గిఫ్ట్స్ ఇస్తే మీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడ్డట్టే!
ఫిబ్రవరి 14 రాగానే ప్రేమికుల గుండెల్లో ఆనందంతో పాటు కొద్దిగా టెన్షన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున కొత్తగా తమ ప్రేమను ప్రపోజ్ చేసేవాళ్లకి తమ ప్రియమైన వారి నుంచి ఎలాంటి రెస్ఫాన్స్ వస్తుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ప్రేమికుల రోజున లవర్ కి లేదా భాగస్వామికి మంచి గిఫ్ట్ ఇచ్చి, వాళ్ల మనసు గెలుచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు.
కానీ గిఫ్ట్ సెలక్షన్ లో ఏమాత్రం తేడా వచ్చినా, మీ రిలేషన్ షిప్ స్టేటస్ మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సింగిల్ గా మిగిలిపోకూడదనుకుంటే వాలంటైన్స్ డే నాడు పొరపాటున కూడా ఇవ్వకూడని గిఫ్ట్ లు ఏవో ఇక్కడ చూడండి.

డ్యూప్లికుట్ జ్యూవెలరీ, ప్లాస్టిక్ పువ్వులు
గిల్టు నగలు లేదా ప్లాస్టిక్ గులాబీలు ఇవ్వడం ద్వారా మీరు వారిని తక్కువ అంచనా వేస్తున్నారని అర్థం చేసుకుంటారు. రెండు రోజుల్లో రంగు వెలిసిపోయే నగలు, దుమ్ము పట్టిపోయే ప్లాస్టిక్ పూల కంటే.. ఒక్క నిజమైన గులాబీ పువ్వు ఇవ్వండి, దాని సువాసన ఆ క్షణాన్ని మధురంగా మారుస్తుంది.
పెద్ద టెడ్డీ బేర్
ఒకప్పుడు ఇది ట్రెండ్ కావచ్చు కానీ ఇప్పుడు ఇది పాత చింతకాయ పచ్చడి లాంటిదే. పెద్ద టెడ్డీ బేర్ చూడటానికి బాగానే ఉన్నా, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. పైగా అది దుమ్మును ఆకర్షించే అయస్కాంతం మాత్రమే.
పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్
సబ్బులు, షాంపూలు, లేదా డియోడరెంట్ సెట్లు వంటి వాటిని మీరు మంచి ఉద్దేశంతోనే ఇవ్వవచ్చు. కానీ అవతలి వారికి మాత్రం అది వేరేలా అర్థమవుతుంది.
నా దగ్గర నుంచి దుర్వాసన వస్తోందా? అని వారు ఫీలయ్యే అవకాశం 100 శాతం ఉండే అవకాశం ఉంటది. రొమాంటిక్ మూడ్‌ని చెడగొట్టి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఈ బహుమతి ప్రపంచంలోనే అతిపెద్ద మూడ్ కిల్లర్.
వంటగది సామాగ్రి
మిక్సీలు, గ్రైండర్లు, లేదా అప్పల కర్రలు, ఫ్రైయింగ్ పాన్ వంటి కిచెన్ సామాను గిఫ్ట్ గా ఇస్తే మీ లవర్ మిమ్మల్ని ప్రేమగా చూడదు సరికదా, సాయంత్రం డిన్నర్ తర్వాత అదే పాన్ మీ వైపు దూసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రొమాంటిక్ బహుమతి కాస్తా పని మనిషిలా చూస్తున్నావా? అనే గొడవకు దారితీస్తుంది.
పుస్తకాలు
కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి లేదా మంచి వ్యక్తిగా మారడం ఎల" వంటి పుస్తకాలు ఇవ్వడం అంటే.. యుద్ధానికి సైరన్ మోగించడమే. నాలో లోపాలు ఉన్నాయి, నువ్వు మారాలి అని మీరు పరోక్షంగా చెబుతున్నట్లు ఉంటుంది.
జిమ్ మెంబర్ షిప్ లేదా డైట్ ప్లాన్
మీరు వారి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నా సరే,వాలెంటైన్స్ డే రోజున బరువు తగ్గించే చిట్కాలు ఇవ్వడం అంటే, మీ కాలికి మీరే గొడ్డలి పెట్టుకున్నట్టే. ఇది నువ్వు లావుగా ఉన్నావు అని చెప్పినట్లుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications