Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Valentines day 2025: సింగిల్స్ వాలంటైన్స్ డేని ఎలా జరుపుకోవాలో చూడండి
ఫిబ్రవరి నెల ప్రారంభం అవగానే అందరికీ గుర్తుకొచ్చేది వాలంటైన్స్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఫిబ్రవరి 7నుంచే వాలంటైన్ వీక్ స్టార్ట్ అవుతుంది. అయితే వాలెంటైన్స్ డే పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎవరినైనా ప్రేమిస్తూ ఇప్పటివరకు వారికి ఆ విషయం చెప్పలేక మదనపడుతున్నట్లయితే వాలంటైన్స్ డే రోజు తమ మనసులోని మాట ప్రియమైన వారికి చెప్పడానికి మంచి ఛాన్స్. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఉవ్విళ్లూరే వారు ఓ వైపు, జంటగా కనిపిస్తే పెళ్లి చేసేందుకు మరికొందరు వాలంటైన్స్ డే రోజు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా ప్రేమికుల దినోత్సవం వివాదంగా కూడా మారుతోంది
వాలెంటైన్స్ డే జంటలకు చాలా ప్రత్యేకమైన రోజు. అయితే మీకు లవర్ లేదా భాగస్వామి లేకుండా ఒంటరిగా ఉంటే.. మీరు కూడా వాలంటైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సింగిల్ వ్యక్తులు ఈ వాలంటైన్స్ డే 2025ని రోజును చిరస్మరణీయంగా మార్చుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి.

అదనపు చర్మ సంరక్షణ
ఒంటరిగా ఉండటంలో కూడా ఒక ఆనందం ఉంటుంది. మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుని దానికి ప్రేమను అందించడానికి ఇదే సరైన సమయం. అదనపు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ అందం మెరుగుపడటమే కాకుండా మీకు ఒక ప్రత్యేక అనుభవం కూడా లభిస్తుంది. అలాగే మీరు నమ్మకంగా ఉంటారు.
స్నేహితులతో ఆనందించండి
మీరు సింగిల్ గా ఉంటే..వాలంటైన్స్ డే రోజున మీ స్నేహితులతో కలిసి కొన్ని వినోదాత్మక ప్రణాళికలు వేయండి. ఒక కేఫ్‌లో కూర్చుని టీ తాగండి లేదా అందరూ ఇష్టపడే కొత్త సినిమా కలిసి చూడండి.
నచ్చిన ఫుడ్ తయారు చేయడం
వాలెంటైన్స్ డే అందరికీ ప్రత్యేకమైనది. మీరు ఒంటరిగా ఉంటే మీకు ఇష్టమైన ఆహారంతో ఆ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి మీ కోసం మంచి ఆహారాన్ని తయారు చేసుకోవడం గొప్ప మార్గం. మీకు ఇష్టమైన వంటకాలు వండినప్పుడు అది మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది.
సాహసయాత్రకు వెళ్ళండి
మీ జీవితంలో కొంచెం సాహసం చేయాలనుకుంటే ఒంటరిగా ప్రయాణించడాన్ని పరిగణించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి, కొత్త విషయాలను అనుభవించడానికి ఇది ఒక మంచి మార్గం. వాలంటైన్స్ డే రోజు మీకు దగ్గర్లోని ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళినా లేదా కొత్త ప్రదేశాన్ని అన్వేషించినా అది మీకు ఒక మెమోరబుల్ ఎక్సీపీరియెన్స్ గా మిగిలిపోతుంది.



Click it and Unblock the Notifications