Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఇది మామూలు యవ్వారం కాదు: ఒకే ఇంట్లో భర్త,మాజీ మొగుడుతో కలిసి జీవిస్తున్న మహిళ
ప్రస్తుతం సిటీల్లో నివిసించాలంటే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. చాలామంది నగరవాసులను వేధించే ప్రధాన సమస్య ఇంటి అద్దె. పెరుగుతున్న ఇంటి అద్దెలు,చాలీచాలనీ జీతాలతో నగరజీవితం కొందరికి నరకంగా మారుతుంది. అయితే నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్న క్రమంలో ఓ మహిళ తన భర్త,మాజీ భర్త,పిల్లలో కలిసి ఉంటున్న వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనివల్ల తమకు చాలా ఖర్చు కూడా తగ్గుతోందని ఆ మహిళ చెబుతోంది. అయితే కొందరు ఆమెను ప్రశంసిస్తుడగా,మరికొందరు విమర్శిస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మేఘన్ మీయర్(25)అనే యువతికి 2020లో టేలర్ అనే పోలీస్ ఆఫీసర్ తో పెళ్లి అయింది. మేఘన్-టేలర్ దంపతులకు ఓ కూతురు కూడా పుట్టింది. అయితే 2003లో టేలర్-మేఘన్ దంపతులు విడిపోయారు. అయితే తమ కూతురు భవిష్యత్తు కోసం అప్పుడప్పుడు కలుస్తుండాలని కూతురిని కలిసి పెంచాలని నిర్ణయించుకున్నారు. డివోర్స్ తర్వాత మేఘన్ తన సొంతూరు కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. అక్కడ మేఘన్ కి తన పాత ఫ్రెండ్ మైఖేల్ ని కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల్లో మేఘన్ గర్భం దాల్చింది. తర్వాత మేఘన్, మైఖేల్ పెళ్లి చేసుకున్నారు.

తన కూతురు తల్లికి దూరంగా ఉండకూడదు,ఆమెకు దగ్గరగా ఉండాలని భావించి టేటర్ మేఘన్ ఇంటికి దగ్గర్లోనే ఓ ఇళ్లను కొనుగోలు చేయాలని ఫ్లాన్ చేశాడు. అయితే అధిక ధరల కారణంగా కొనలేకపోయాడు. దీంతో అందరం ఒకే ఇంట్లో ఉందాం,ఖర్చులు షేర్ చేసుకుందాం అని మేఘన్ చేసిన ప్రపోజల్ కి టేలర్,మైఖేల్ ఇద్దరూ అంగీకరించారు. దీంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. టేలర్,మైఖేల్ ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని మేఘన్ తెలిపింది.
మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉందని..తర్వాత అలవాటు పడిపోయామని,ఇప్పుడు అంతా హ్యాపీ అని మేఘన్ తెలిపింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వీరి గురించి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పలురకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications