Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న వందల ఏళ్ల నాటి హిందూ ఆచారం
సంజయ్ దత్- మాన్యత, సన్నీ లియోన్- డేనియల్ వెబర్ సహా ఈ మధ్య కాలంలో ఎందరో సెలబ్రిటీ, ప్రముఖ జంటలు కూడా తమ ప్రేమ, వైవాహిక బంధానికి కొత్త ఊపిరి పోస్తున్నారు. అదే ప్రతిజ్ఞ పునరుద్ధరణ (Vow Renewal). ఇది పెళ్లి నాటి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకుంటూ, అప్పటివరకు కలిసి గడిపిన జీవితానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే భవిష్యత్తుకు కొత్త వాగ్దానాలు చేసుకునే ఒక అందమైన వేడుక.
నిజానికి ఈ సంప్రదాయం మనకు కొత్తేమీ కాదు. మన సంస్కృతిలో శతాబ్దాలుగా ఉన్న షష్టిపూర్తి దీనికి చక్కటి ఉదాహరణ. భర్తకు 60 ఏళ్ళు నిండిన సందర్భంగా దంపతులు మళ్లీ పెళ్లిపీటలెక్కి, తమ వివాహ బంధాన్ని పునరుద్ధరించుకుంటారు. నేటి ఆధునిక ప్రతిజ్ఞ పునరుద్ధరణలు ఈ షష్టిపూర్తికి సమకాలీన రూపమనే చెప్పవచ్చు.

ఎందుకు, ఎప్పుడు?
కొందరు 10వ లేదా 25వ వివాహ వార్షికోత్సవం వంటి మైలురాళ్లను ఘనంగా జరుపుకోవడానికి దీనిని ఎంచుకుంటారు. మరికొందరు జీవితంలో ఎదురైన కష్టాలను కలిసి ఎదుర్కొన్నందుకు, తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే మార్గంగా చూస్తారు. కరోనా సమయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న వాళ్లు ఇప్పుడు తమ కలను నెరవేర్చుకోవడానికి ఈ వేడుకను ఆశ్రయిస్తున్నారు. కొందరైతే మళ్లీ వధూవరులుగా మారాలనే ఆనందం కోసం దీన్ని జరుపుకుంటారు.
వేడుక వెనుక లోతైన అర్థం
ఈ ప్రతిజ్ఞ పునరుద్ధరణ కేవలం ఆడంబరమైన వేడుక మాత్రమే కాదండోయ్..బంధాన్ని బలోపేతం చేసే ఒక శక్తివంతమైన సాధనం. గడిచిన కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ఒకరికొకరు చేసిన త్యాగాలను గుర్తించడానికి, భవిష్యత్తులో ఒకరి నుండి ఒకరు ఏమి ఆశిస్తున్నారో మాట్లాడుకోవడానికి ఇది ఒక అద్భతమైన అవకాశం. ముఖ్యంగా బంధంలో ఏవైనా పొరపొచ్చాలు వచ్చి ఉంటే వాటిని సరిదిద్దుకుని, స్వచ్ఛమైన మనసుతో కొత్త ప్రారంభానికి నాంది పలకవచ్చు.
ఇది మంత్రదండం కాదు
అయితే ప్రతిజ్ఞ పునరుద్ధరణ అనేది బంధంలో ఉన్న సమస్యలను పరిష్కరించే మంత్రదండం కాదు. ఇది కేవలం ఒక ప్రతీక మాత్రమే. ఆ వేడుక తర్వాత కూడా దంపతుల మధ్య అర్థవంతమైన సంభాషణలు, పరస్పర గౌరవం, ప్రవర్తనలో మార్పు ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. కేవలం సోషల్ మీడియాలో ఫోటోల కోసం, నలుగురికీ గొప్పగా చూపించుకోవడం కోసం చేసే వేడుక వల్ల బంధం బలపడదు. వేడుక చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదు. ఒకరికొకరు ఇచ్చుకునే వాగ్దానంలోని నిజాయితీ, కలిసి ప్రయాణించాలన్న తపన ముఖ్యం. ఎందుకంటే,నిజమైన పండుగ ఆడంబరంలో కాదు, బలమైన అనుబంధంలోనే ఉంటుంది.



Click it and Unblock the Notifications
