Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సంభోగానికి ముందు ఈ పనులు అస్సలు చేయొద్దు..శృంగార నిపుణుల సలహాలు
శృంగారం అంటే కొన్ని నిమిషాల సుఖం అనే చాలామంది అనుకుంటారు. వాస్తవానికి శృంగారం అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల్లో చెప్పలేని ఒక అపురూపమైన భావన. ఆ సన్నిహిత క్షణాల్లో పంచుకునే అనుభూతులు బంధానికి పునాది వేసి, మనసులను మరింత దగ్గర చేస్తాయి. అయితే ఎంతో మధురమైన ఈ అనుభవాన్ని కొన్ని చిన్న పొరపాట్లు నీరుగార్చే అవకాశం ఉంది. మీ లైంగిక జీవితాన్ని మరింత ఆనందమయం, సంతృప్తికరంగా మార్చుకోవాలంటే సంభోగానికి ముందు కొన్ని పనులకు దూరంగా ఉండటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.
శృంగారంలో పాల్గొనే ముందు చేయకూడని పనులు ఇవే
శుభ్రతను నిర్లక్ష్యం చేయకండి
శారీరక కలయిక అనేది ఒక పవిత్రమైన కార్యం లాంటిది. ఒకరినొకరు తాకే ముందు సువాసనభరితమైన స్నానం చేయడం వల్ల ఇద్దరిలోనూ నూతనోత్సాహం కలుగుతుంది. ఇది మిమ్మల్ని ఫ్రెష్ గా, కాన్ఫిడెన్స్ తో ఉంచడమే కాకుండా మీ భాగస్వామికి మీపై గౌరవాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పరిశుభ్రత పాటించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) వంటి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. కాబట్టి ఆ మధుర క్షణాలకు ముందు స్నానం చేయడం మర్చిపోవద్దు.

కడుపు నిండా భోజనం వద్దు
శృంగారానికి ముందు కడుపునిండా బిర్యానీలు, మసాలా వంటకాలు లాగించారా? అయితే ఆ తర్వాత మీరు బద్ధకంగా ఉండటం ఖాయం. నిద్రమత్తులో ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకే, కలయికకు ముందు ఎప్పుడూ తేలికపాటి ఆహారాన్నే ఎంచుకోండి. ఒక కప్పు సూప్ లేదా కొన్ని డార్క్ చాక్లెట్ ముక్కలు తినడం మంచిది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ మీలో సెరోటోనిన్ అనే ఆనందాన్నిచ్చే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మీలో ఉత్సాహాన్ని నింపి, సరికొత్త శక్తిని అందిస్తుంది.
మద్యానికి దూరంగా ఉండటమే మేలు
ప్రేమను వేడుకలా జరుపుకోవడం మంచిదే, కానీ ఆ వేడుకకు మద్యం తోడైతే అసలుకే మోసం వస్తుంది. చాలామంది మూడ్ ను పెంచుకోవడానికి మద్యపానం చేస్తుంటారు, కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే. మద్యం మీ నరాలను మొద్దుబారేలా చేసి స్పర్శలోని మాధుర్యాన్ని, అనుభూతిలోని తీవ్రతను తగ్గిస్తుంది. మత్తులో ఉన్నప్పుడు ఆ క్షణంలోని నిజమైన ఆనందాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి మీ భాగస్వామితో గడిపే ఆ అమూల్యమైన సమయంలో పూర్తి స్పృహతో ఉండి, ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించండి. ఈ చిన్న మార్పులు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి.



Click it and Unblock the Notifications