Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Relationship Tips: మీ జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాల్లో గొడవలు రావొద్దంటే ఇలా చేయండి
మీ భాగస్వామితో డబ్బు గురించి గొడవ పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అనవసరమైన గొడవ లేకుండా ఆర్థిక నిర్వహణ సరిగ్గా ఉండేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక విషయంలో అపార్థాల వల్ల, అభిప్రాయ భేదాల వల్ల కలహాలు అవుతుంటాయి. దంపతుల మధ్య గొడవలు జరగడానికి ఆర్థిక పరమైన కారణాలు కూడా ఉంటాయి.
ఆర్థిక విషయాలకు సంబంధించిన విభేదాలు ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతాయి. వీటి వల్ల విడిపోయే పరిస్థితి కూడా రావొచ్చు. అయితే, మీ భాగస్వామితో డబ్బు గురించి గొడవ పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అనవసరమైన గొడవ లేకుండా ఆర్థిక నిర్వహణ సరిగ్గా ఉండేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలిసి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి:
డబ్బు గురించి గొడవలు జరగకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోవడం ముఖ్యం. ఒక లక్ష్యమంటూ ఉంటే దాని కోసం ప్రయత్నిస్తారు. ఇద్దరూ ఒకేదారిలో ఉన్నప్పుడు గొడవలు జరగడానికి ఆస్కారం తక్కువ.
ఆర్థిక లక్ష్యాల జాబితాను రూపొందించుకోవాలి. ఇంటికి డౌన్ పేమెంట్ కోసం ఆదా చేయడం, రుణాన్ని చెల్లించడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం లాంటి లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి.
బడ్జెట్ రూపొందించండి:
బడ్జెట్ ను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేది పక్కాగా తెలిసినప్పుడు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. నెల, ఆరునెలలు, సంవత్సర బడ్జెట్ ప్రణాళిక ఉంటే ఖర్చులు అదుపులో ఉంటాయి.
బడ్జెట్ అంటూ నిర్ణయించుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లో దానిని ఫాలో అవ్వాలి. సినిమాకు ఇంత ఖర్చు పెట్టాలి, వినోదానికి, దుస్తులుకు ఎంత ఖర్చు పెట్టాలో ముందే బడ్జెట్ లో రాసుకోవాలి.
డబ్బుకు మీరిచ్చే విలువ గురించి చెప్పండి:
డబ్బుపై ఒక్కొక్కరికి ఒక్కో విలువ ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే భిన్న వైఖరులు ఉంటాయి. డబ్బు పట్ల మీ విలువలు, వైఖరుల గురించి మీ భాగస్వామితో చెప్పడం చాలా అవసరం.
దీని వల్ల మీ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ఎదుటివారికి సులభమవుతుంది. ఖర్చు, పొదుపు విషయంలో రాజీపడే మార్గాన్ని కనుక్కోవడం ఈజీగా ఉంటుంది.

బాధ్యతలు నిర్దేశించుకోవాలి:
ఆర్థిక నిర్వహణ కోసం బాధ్యతలను విభజించడం వ్ల విభేదాలు రాకుండా చూసుకోవచ్చు. ప్రతి భాగస్వామికి వారి పాత్ర ఏంటి, వారి బాధ్యత ఏంటో నిర్ణయించుకోవాలి.
ఒకరు పెట్టుబడులు నిర్వహిస్తే, మరొకరు ఖర్చులను నియంత్రించాలి.
ఆర్థిక పరిస్థితి గురించి అబద్ధాలు చెప్పొద్దు:
మీ భాగస్వామితో ఆర్థిక పరిస్థితి గురించి ఏదీ దాచకుండా, నిజాయితీగా చెప్పాలి. ఆర్థిక పరిస్థితి గురించి బహిరంగంగా, నిజాయితీగా చెప్పడం చాలా ముఖ్యం. ఆదాయం, అప్పులు, ఆస్తుల గురించి దాచకుండా చెప్పాలి.
ఆర్థిక విషయాల గురించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరికీ సహాయపడుతుంది.
సంబంధంలో గొడవలకు డబ్బు కారణం కావొచ్చు. అయితే ఆ గొడవలను నివారించవచ్చని గుర్తుంచుకోవడం ముఖ్యం. కలిసి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం, బడ్జెట్ ను రూపొందించడం, డబ్బు పట్ల విలువలు వైఖరులు చెప్పడం, బాధ్యతలు నిర్దేశించుకోవడం, ఆర్థిక పరిస్థితి గురించి నిజాయితీగా చెప్పడం చాలా కీలకం. వీటి వల్ల దంపతుల మధ్య ఆర్థిక విషయాల్లో గొడవలు రాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications