Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
ఒకరికి రోజూ శృంగారం కావాలి, మరొకరికి అప్పుడప్పుడు మాత్రమే కావాలి.. ఇలాంటి జంటలు ఏం చేయాలంటే?
దంపతులు ఇద్దరికీ శృంగార కోరికలు ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు. ఒకరికి రోజూ లైంగిక తృప్తి కావాలనిపించవచ్చు, మరొకరికి వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆ కోరికలు రావొచ్చు. ఒకరికి ఆ కోరికలు ఎక్కువగా ఉండొచ్చు, మరొకరికి తక్కువ ఉండొచ్చు. ఈ సమస్య చాలా మంది జంటల్లో ఉంటుంది.
దాంపత్య బంధం హ్యాపీగా ఉండటానికి పడగ్గదిలో సుఖంగా, సంతృప్తిగా ఉండటం చాలా ముఖ్యంత. ఇతర విషయాల్లో ఎలా ఉన్నా.. లైంగికంగా మాత్రం దంపతులు ఒకేలా ప్రవర్తిస్తే శృంగారంలో చాలా ఆనందించవచ్చు. ఒకవేళ దంపతుల మధ్య శృంగారంలో హెచ్చుతగ్గులు ఉంటే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనసువిప్పి మాట్లాడాలి:
దంపతుల మధ్య కమ్యూనికేషన్ చాలా చాలా కీలకం. ఒకరి మనసులో ఏముందో 100 శాతం కరెక్టుగా చెప్పడం మానసిక శాస్త్రవేత్తల వల్ల కూడా కాదు. అలాంటి సాధారణ వ్యక్తులం మన వల్ల ఏమవుతుంది. అందుకే ఎదుటివారి మనసులో ఏముందో అంచనా వేసి అది ఒకవేళ తప్పు అయితే బాధ పడేకంటే వారినే నేరుగా అడగడం చాలా మంచిది.
దీని వల్ల అపార్థాలు రాకుండా ఉంటాయి. ఎదుటివారు ఏమనుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో తెలుసుకుంటే వారిని ఎలా సంతోషంగా ఉంచాలో తెలుస్తుంది. కాబట్టి మీరైనా, వారైనా ఓపెన్ కమ్యూనికేషన్ ను ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. శృంగార సమస్యలు చాలా వరకు కమ్యూనికేషన్ వల్ల పరిష్కారమవుతాయి.
ప్రయోగాలు చేయాలి, కొత్తగా ప్రయత్నించాలి:
కొత్తగా ట్రై చేయడానికి ఎప్పుడూ వెనకాడొద్దు. ముఖ్యంగా లైంగికంగా ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తే భాగస్వామికి చెప్పి చేసేయాలంతే. అది నచ్చుతుందో లేదో తర్వాత సంగతి కొత్తగా చేయడం వల్ల శృంగారం అంటే ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది.
సెక్స్‌ను అయినా ఇతర పనులనైనా ఎప్పుడూ ఒకేలా చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది. కొత్త ఆవకాయ ఎప్పుడూ రుచిగానే ఉంటుంది అన్నట్లుగా కొత్త ఎప్పుడూ కొత్తకొత్తగా ఉంటుంది. నచ్చడం, నచ్చకపోవడం తర్వాత. కొత్త పొజిషన్లు, బొమ్మలతో సెక్స్, కలిసి పోర్న్ చూడటం, ఫాంటసీలతో ప్రయోగాలు చేయడం, రోల్ ప్లే లాంటి చేయాలి.
సెక్స్‌లో కంఫర్ట్ ముఖ్యమే కానీ ఆ కంఫర్ట్‌ను దాటి శృంగారాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. ఏమో.. కొత్తగా చేసే పనులు విపరీతంగా నచ్చేయొచ్చు కదా.

లైంగిక ఆనందానికే మొదటి ప్రాధాన్యత:
శృంగారంలో కేవలం ఒకరే ఆనందం పొందితే అది అసలు శృంగారమే అనిపించుకోదు. మీరు మీ కోరికలు, అవసరాలు, భావప్రాప్తిపై ఎంత దృష్టి పెడతారో.. భాగస్వామి కోరికలను, భావప్రాప్తిని అంతే ఇష్టపడాలి. లైంగికంగా ఇద్దరూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ పనుల వల్ల వారు హ్యాపీగా లేకపోతే దేనివల్ల సంతృప్తి కలుగుతుందో అడిగి తెలుసుకోవాలి. లేకపోతే కొత్తగా ప్రయత్నించాలి.
ఎమోషనల్ బాండింగ్ కీలకం:
శృంగారం అంటే కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. మానసికమైనది, భావోద్వేగమైనది కూడా. శారీరకంగా, మానసికంగా పెనవేసుకుపోయినప్పుడే నిజమైన శృంగారాన్ని ఆస్వాదించగలం. ఎమోషనల్ బాండింగ్ లేకుండా చేసే శృంగారం వల్ల తాత్కాలిక సంతృప్తి ఉంటుంది కానీ దీర్ఘాకాలిక సంతోషం ఉండదు.



Click it and Unblock the Notifications