Latest Updates
-
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.?
Relationship Tips: ఇలా సెక్స్ చేస్తున్నారా? బోర్ కొట్టేస్తుంది జాగ్రత్త!
ఏదైనా పనిని ఎప్పుడూ ఒకేలా చేస్తుంటే కొద్ది రోజులకు బోర్ కొట్టేస్తుంది. అందుకే కొత్తగా చేయాలని, నూతనంగా ప్రయత్నించాలని, రిస్క్‌లు తీసుకోవాలని చెబుతుంటారు. ఇది కేవలం పనికి మాత్రమే వర్తించదు. పడక పనికి కూడా వర్తిస్తుంది. అంటే భాగస్వామితో ఎప్పుడూ ఒకేలా శృంగారం చేస్తే బోర్ కొట్టేస్తుంది.
శృంగారం ఎప్పుడూ నిత్య నూతనంగా ఉండాలి. భాగస్వామితో శృంగారంలో పాల్గొంటున్నామంటే ఆ ఆనందం, ఎగ్జైట్‌మెంట్, ఆ కోరిక, ఆత్రుత రావాలి. ఏదో చేశామా అంటే చేశాం, ఎంజాయ్‌మెంట్ లేదు, ఎగ్జైట్‌మెంట్ లేదు అనుకునేలా ఉండకూడదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. ఎలాంటి పనుల వల్ల శృంగారం బోర్ కొడుతుందో, అసలు శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో, ఎలా చేస్తే భాగస్వామి సంతృప్తి, భావప్రాప్తి పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎదుటివారి ఇష్టాయిష్టాలు పట్టించుకోకపోవడం:
శృంగారాన్ని మీరెంతగా ఎంజాయ్ చేయాలనుకుంటారో మీ జీవిత భాగస్వామి కూడా అంతే ఎంజాయ్ చేయాలనుకుంటారు. కొన్ని పనులు, చర్యల వల్ల మీకు 'హై' వచ్చినట్లే.. ఎదుటివారికి ఆ ఫీల్ రావడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో ట్రిగ్గరింగ్ పాయింట్లు ఉంటాయి. అవేంటో కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఫోర్ ప్లే లేకుండా అసలు పనిని అస్సలే మొదలు పెట్టవద్దు. దీని వల్ల మూడ్ లేక యోని తడిగా అవ్వదు. దాని వల్ల సంభోగించే సమయంలో అసౌకర్యంగా, నొప్పిగా, మంటగా ఉంటుంది.
ఒకే రకమైన పొజిషన్‌లు:
ఎప్పుడూ ఒకే రకమైన భంగిమలో సెక్స్ చేయడం వల్ల పెద్దగా ఎగ్జైట్‌మెంట్ రాదు. అయితే కొందరికి కొన్ని భంగిమల్లో సంభోగించడం సౌకర్యంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు దానినే కంటిన్యూ చేయడంలో తప్పు లేదు. కొత్తదనం కావాలానుకుంటే మాత్రం కొత్తగా ట్రై చేయాల్సిందే అని గుర్తుంచుకోండి.
నేరుగా అసలు కార్యానికి వెళ్లొద్దు:
చాలా మంది చేసే పొరపాటు ఇది. ముఖ్యంగా మగవారు ఈ పొరపాటు చేస్తుంటారు. శృంగారం చేసుకోవాలన్న మూడ్ వచ్చింది. లేదా భాగస్వామిని చూడగానే రతి క్రీడలో పాల్గొనాలని కోరిక రావొచ్చు. అలాంటప్పుడు పడక గదికి వెళ్లి నేరుగా సంభోగించవద్దు. మొదట ఫోర్ ప్లే చేయాలి. దీని వల్ల భాగస్వామిని కూడా మూడ్ లోకి తీసుకురావాలి. కొద్దిసేపు రొమాన్స్ చేసిన తర్వాత అసలు పని మొదలు పెట్టాలి.
ఇతరులతో పోలిక వద్దు:
శృంగార సమయం కేవలం దంపతులకు మాత్రమే చెందినది. ఆ సమయంలో భాగస్వామిని ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి కానీ నిరుత్సాహపరచకూడదు. కొందరు ఇతరులతో పోలుస్తూ ఉంటారు. వారి శరీర సౌష్టవం, అందం లాంటివి మాట్లాడుతుంటారు. దీని వల్ల ఎదుటివారు అసౌకర్యానికి, అభద్రతాభావానికి గురికావొచ్చు. దీని వల్ల అప్పటికప్పుడు ఏమీ కాకపోయినా తర్వాత దాని ప్రభావం ఉండొచ్చు.
పడకగదిలో మాత్రమే శృంగారం చేయొద్దు:
శృంగారాన్ని కేవలం పడకగదికి మాత్రమే పరిమితం చేయవద్దు. శృంగార కోరికలు ఎప్పుడైనా రావొచ్చు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడైనా రావొచ్చు. మూడ్ బాగుండి, ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకపోతే భాగస్వామితో సెక్స్ లో పాల్గొనాలని అనిపించవచ్చు. హాల్ లో ఉన్నప్పుడు సెక్స్ చేయాలన్న కోరిక, భాగస్వామిపై కోరిక రగిలితే దాని కోసం బెడ్రూమ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.
హాల్ లో కూడా శృంగారాన్ని ట్రైం చేయాలి. కిచెన్ లో, డ్రాయింగ్ రూమ్, బాత్రూమ్, టెర్రస్, బాల్కనీ ఇలా భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించడానికి బెడ్రూమ్ ఒక్కటే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీలో రొమాంటిక్ యాంగిల్ ఉంటే చాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా భాగస్వామిని ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications