Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆదర్శ దంపతులు: మొగుడికి గర్ల్ ఫ్రెండ్,పెళ్లానికి బాయ్ ఫ్రెండ్..సంసారానికి షిఫ్ట్ లు
ఈ మధ్య కాలంలో సంబంధాలలో కొత్త కొత్త మార్పులొస్తున్నాయి. ఈ మార్పులను చూసి ప్రపంచం ఎటు పోతుందో అని కొందరు బాధపడుతుంటే..నేటి కాలానికి ఇదే సరైనదని మరికొందరు వాదిస్తుంటారు. తాజాగా ఓ ఇంట్లో జరిగిన ఓ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఓ ఇంట్లో ఇద్దరు భార్యభార్తలు నివిసిస్తున్నారు. వీరికి బంగారం లాంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు..భర్తకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరికీ ఎఫైర్లు ఉన్నాయని తెలియడంతో ఇద్దరూ ఓ ఒప్పందంకి వచ్చారు. వీళ్లు చేసుకున్న ఒప్పదం వింటే అరె ఏంట్రా ఇది అని ఆశ్చర్యపోవాల్సిందే మరి.
బ్రెజిల్ దేశంలోని ఫ్లోరియానోపోలిస్ లో నివసించే బ్రూనో కోర్డిస్క్,కేల్ మసిట్టరే ఇద్దరూ భార్యభర్తలు. దాదాపు 20 ఏళ్ల క్రితం వీరికి పెళ్లయింది. వీరికి హెన్నీ(19),హెక్టార్(13)అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. హాయిగా సంసారం సాగిపోతున్న సమయంలో వివాహేతర సంబంధం వీరి జీవితాల్లో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చింది. బ్రూనో..జెన్నిఫర్ ఫరియా అనే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోగా,కేల్.. డియిగో మచాడో అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. తమ ఎఫైర్స్ గురించి ఇద్దరూ ఒకరికొకరు చెప్పేసుకున్నారు. మనం గొడవపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు..కాబట్టి హాయిగా మనం జీవించాలంటే ఏం చేయాలని ఆలోచించారు. అందరూ కలిసి ఓ ఇంట్లో ఉండే బాగుంటుందని ఆలోచించారు.

కుటుంబ ఖర్చుల బాధ్యతలను అందరూ షేర్ చేసుకునేందుకు ఓ చార్ట్ వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్ కు తగిలించారు. అయితే ఈ నలుగురు వారంలో ఏ రోజు ఎవరు ఎవరితో శృంగారంలో పాల్గొనాలనేది కూడా షెడ్యూల్ ఛార్ట్ వేసుకున్నారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా బ్రూన్,కేల్ ఇద్దరు కలిసి ఉంటారు..శని,ఆది వారాల్లో బ్రూనో తన లవర్ తో,కేల్ తన బాయ్ ఫ్రెండ్ తో సమయం గడుపుతుంది. కొన్నిసార్లు తాము నలుగురం కలిసి ఎంజాయ్ చేస్తాం అని బ్రూనో చెప్పాడు. కేల్ కి తనకి మధ్య చాలా తీవ్రమైన కెమిస్ట్రీ ఉందని,రోజూ తాము శృంగారంలో పాల్గొంటామని తెలిపాడు, తాము ఒకరినొకరం మిస్ అవుతుంటాం అని చెప్పాడు. వీకెండ్స్ లో తాము ఎఫైర్ పెట్టుకున్నోళ్లతో గడుపుతాం కాబట్టి వారమంతా మా మధ్య ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్న ఆరాటం,అనురాగం మరింత పెరుగుతుందని బ్రూనో చెప్పాడు.
శృంగారానికి సంబంధించిన షెడ్యూల్ ఐడియా మొదట కేల్ కే వచ్చిందట. ఎపైర్ ప్రారంభంలో బ్రూన్ తన గర్ల్ ఫ్రెండ్ జెన్నిఫర్ తో ఎక్కువ సమయం గుడపుతుండేవాడట. దీంతో తాను ఏదో తెలియని ఇబ్బందిని ఫీల్ అయ్యేదాన్నని,తమ ప్రైవేట్ కనెక్షన్ ని కోల్పోతున్నట్లు తాను భావించేదాన్నని, కాబట్టే షెడ్యూల్ వేసుకున్నాం అని దీంతో సమస్య తీరిపోయిందని, తమ వ్యక్తిగత సంబంధాన్ని బలోపేతం చేసుకోడానికి ఇది సహాయపడుతుందని ఆమె చెప్పారు. కొన్నిసార్లు పనిమీద ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంటదని, అందుబాటులో ఉండలేని పరిస్థితుల్లో కూడా తాము అడ్జెస్ట్ అవుతుంటామని,అదేం తమకి పెద్ద సమస్య కాదని చెప్పారు. బాగా ఎక్కువ శృంగారం కావాలనిపించినప్పుడు ఇంట్లో కాకుండా హోటల్స్ కి కూడా వెళ్లడమో లేదా ఫ్రైవేట్ హోమ్ రెంట్ కి తీసుకోవడం వంటివి చేస్తుంటామని వీళ్లు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications