Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Weekend Marriage: పెళ్లి బంధంలో కొత్త మార్పు.. వీకెండ్ మ్యారేజ్ పై యువత ఇంట్రెస్ట్..దీంతో ప్రయోజనాలివే!
పెళ్లి అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంతో ప్రత్యేకంగా జరగాలని,తమ భాగస్వామితో ఆనందంగా నూరేళ్లు హాయిగా కలిసుండాలని కోరుకుంటారు. అయితే నేటి యువత జీవితం ఓ యుద్ధ క్షేత్రంలా మారిపోయింది. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా కెరీర్ గురించిన ఆలోచనలు, లక్ష్యాల వెంట పరుగులు తీస్తూ బంధాలకు సమయం కేటాయించడం గగనమైపోతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి కూడా సమయం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఒక కొత్త తరహా వైవాహిక బంధం తెరపైకి వచ్చింది. అదే వీకెండ్ మ్యారేజ్(Weekend marriage).
వీకెండ్ మ్యారేజ్ అంటే ఏంటీ
ముఖ్యంగా సిటీల్లో, పట్టణాల్లో ఈ వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. వీకెండ్ మ్యారేజ్ అంటే..పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు కలిసి ఒకే ఇంట్లో రోజూ ఉండరు. కేవలం వీకెండ్ లో అంటే శనివారం,ఆదివారం లేదా ముందే నిర్ణయించుకున్న కొన్ని రోజుల్లో మాత్రమే కలుసుకుంటారు. మిగిలిన వారం అంతా తమతమ పనుల్లో, వేర్వేరు నగరాలు లేదా ప్లేస్ లలో ఉంటారు. కొందరు వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం, మరో నగరంలో కోచింగ్ తీసుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇతర బాధ్యతల కారణంగా ఇలా చేస్తుంటారు.

ఎందుకీ వింత బంధం?
కెరీర్ మీదనే ఎక్కువ ఫోకస్
ఈ రోజల్లో బంధాల మీద కన్నా కెరీర్ మీదనే యువత ఎక్కువగ ఫోకస్ పెడుతున్నారు. మంచి జాబ్, ఉన్నత స్థానం చేరుకోవడమే ముఖ్యమైనదిగా భావిస్తున్నారు నేటి యూత్. ఈ క్రమంలో భార్యకు బెంగళూరులో జాబ్ ఉంటే భర్తకు హైదరాబాద్ లో ఉంటుంది. ఇద్దరు తమ కెరీర్ ను కాపాడుకోడానికి బెంగళూరులో ఒకరు, హైదరాబాద్ లో మరొకరు జీవిస్తూ వీకెండ్స్ లో ఒకచోట కలుస్తున్నారు.
వ్యక్తిగత స్వేచ్ఛ
ఈ రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ముఖ్యంగా పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, ఒకే ఇంట్లో కలిసి ఉండటం వల్ల తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని కొందరు వేర్వేరుగా ఉంటూ వీకెండ్స్ లో కలుసుకుంటున్నారు. వీకెండ్ మ్యారేజ్ వారికి వ్యక్తిగత జీవితానికి, వైవాహిక జీవితానికి మధ్య బ్యాలెన్స్ ను అందిస్తుంది.
బాధ్యతలు
కుబుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు,ఇతర కారణాలతో భార్యాభర్తలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండాల్సి వస్తుంది.
కొత్త అనుభవం
వీకెండ్ మ్యారేజ్ కొత్త అనుభవాన్నిస్తుందని కొన్ని జంటలు చెబుతున్నారు. వారమంతా దూరంగా ఉండి వారాంతంలో కలుసుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ,ఆప్యాయత పెరుగుతాయని భావిస్తారు.
ప్రయోజనాలు, నష్టాలు
ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ కు సమయం కేటాయించడానికి సాధ్యపడుతుంది. వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించుకోవచ్చు. వారమంతా విడివిగా ఉండటం వల్ల కలిగే విరహం, వీకెండ్ లో కలుసుకున్నప్పుడు మరింత ప్రేమను కలిగిస్తుంది, ఒకరి సమయాన్ని ఒకరు విలువ ఇస్తారు. చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు.
అయితే నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే ఈ వీకెండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకరికొకరు అందుబాటులో లేకపోవడం వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండకపోవచ్చు..ఎమోషనల్ గా కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉండలేరని చెబుతున్నారు. ఈ బంధం ఎంతకాలం నిలబడుతుందనేది కూడా చెప్పడం కష్టమేనని తెలిపారు.



Click it and Unblock the Notifications