Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మీ పార్ట్‌నర్ వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే ఇలా చేయండి..!
మన జీవితంలోకి వచ్చే మన జీవిత భాగస్వామి గురించి అయినా లవర్ లేదంటే భార్య, భర్త ఎవరైనా కావచ్చు. వారి గురించి ముందుగానే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ బంధంలో సమస్యలు ఎక్కువ రాకుండా ఉంటాయ్. ఏ విషయాలను మీరు తెలుసుకోవాలనే దానిపై కొంత సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.
ప్రేమ సంభాషణ
ప్రేమికులకు ప్రత్యేక సంభాషణ ఉంటుంది. సైగలతో, రాతలతో, కవిత్వాలతో ఇలా రకరకాలుగా ప్రేమసంభాషణ చేస్తుంటారు. మీ పార్ట్‌నర్ ప్రేమ సంభషణను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పటి నుంచే మీ పార్ట్‌నర్‌ను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు.
హాబీలు
వృత్తి కాకుంగా ఖాళీ సమయాల్లో ఏమి చేస్తారో తెలుసుకోవాలి. ఒకవేళ హాబీలు ఒకటే అయితే మీ మధ్య కనెక్షన్ ఇంకా బాగా కుదురుతుంది. హాబీలను లక్ష్యాలుగా ఏమైనా పెట్టుకున్నారా లాంటి విషయాలను తెలుసుకోవాలి. కొందరికి పాటలు పాడడం హాబీగా ఉంటుంది. వారికి ప్రముఖ సింగర్ అయితే అది వారికి పెద్ద అచీవ్‌మెంట్ ఇలాంటి లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా మీరు గుర్తించాలి.

రిలాక్స్ టైం
పనిలో అలసిపోయినప్పుడు మీ పార్ట్‌నర్ విశ్రాంతిని ఎలా తీసుకుంటారు. నెట్‌ఫ్లిక్స్, ఎమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లాంటివి చూస్తూ రిలాక్స్ అవుతారా. ఈ విషయం తెలుసుకోవడం ద్వారా మీ పార్ట్‌నర్ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసే అవకాశం ఉంది.
ఎలా బూస్టప్ అవుతారు
మానసికంగా కుంగిపోయినప్పుడు తమను తాము బూస్టప్ చేసుకోవడానికి ఏమి చేస్తారనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కొందరు సంగీతాన్ని వింటారు, మరికొందరు వీడియో గేమ్స్ ఆడతారు. ప్రతీ ఒక్కరి అభిరుచి వేరుగా ఉంటుంది. మీ పార్ట్‌నర్ అభిరుచిని తెలుసుకుంటే మీరు వారిని అదే పధ్దతిలో బూస్టప్ చేసి ఇద్దరూ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.
జీవిత లక్ష్యమేంటి
మీ పార్ట్‌నర్ జీవిత లక్ష్యమేంటి. జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు. ఏదైనా ప్రయత్నాల్లో ఉన్నారా, దానికి కావలసిన సహకారమేంటి అనే విషయాలను తెలుసుకోవాలి. దీని ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని మీరు అంచనా వేయవచ్చు. ఆ వ్యక్తితో మీరు జీవితం కొనసాగించగలరా లేదా అని స్పష్టత మీకు వస్తుంది.
దేనికి ప్రాధాన్యత
మీ పార్ట్‌నర్‌కు జీవితంలో ఏది ముఖ్యమనే విషయాలను కూడా తెలుసుకోవాలి. కొందరు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. మరికిందరు కుటుంబానికి , ఇంకొందరు కెరీర్‌కు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ఇది తెలుసుకోవడం వల్ల మీ పార్ట్‌నర్‌తో మీ కనెక్షన్ ఎలా ఉండబోతోందో మీకు తెలుస్తుంది.
ఫ్రెండ్ సర్కిల్
మీ పార్ట్‌నర్‌కు ఉండే స్నేహితులను బట్టి కూడా వారి వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి వారి ఫ్రెండ్ సర్కిల్ పైన కూడా ఓ కన్నేసి వుంచాలి. ముందుగానే వారి స్నేహితుల లిస్ట్‌ను బయటకు తీి, ఎలాంటి వారు మీ పార్ట్‌నర్‌కు స్నేహితులుగా ఉన్నారో తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications