Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
అరెంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్.. ఈ రెండు పెళ్లిల్లే అయినా రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. పెద్దలతో సంబంధం లేకుండా కేవలం ఇద్దరు ఇష్టపడి చేసుకునేది ప్రమేపెళ్లి అయితే పెద్దలతో చొరవతో అన్నీ సాంప్రదాయంగా ముందు వెనక అన్నీ చూసుకొని అన్నీ మాట్లాడుకొని పెద్దలను ఒప్పించి చేసుకునేంది అరెంజ్ మ్యారేజ్. ఇప్పుడు అరెంజ్ మ్యారేజ్ అనగానే అదేదో పాతకాలపు పధ్దతిలా కొందరు చూస్తున్నా అరెంజ్ మ్యారేజ్ వైపే ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. అయితే జీవిత భాగస్వామితో కలకాలం సుఖసంతోషాలతో ఉండాలంటే కొన్ని విషయాలపై ముందగానే ఓ అవగాహణకు రావడం చాలా ముఖ్యం. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ పెళ్లి బంధంతో మీరు ఆశిస్తున్నది ఏంటి ?
మీరిద్దరూ కలిసి వివాహం ఎందుకు చేసుకుంటున్నారనే దానిపై ఇద్దరికీ ఓ అభిప్రాయం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఓ బలమైన కారణం ఉంటే మాత్రమే కలిసి ఆనందంగా సుఖసంతోషాలతో ముందుకు వెళ్తారు.
మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి ఆరోగ్యం అయినా ఆందోళనపడాల్సిన అవసరముందా ?
కుటుుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారా లేదా అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. ఇద్దరూ కలిసి ఆ భారాన్ని కష్టాన్ని మోయవలసి ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలపైన కూడా ముందుగా చర్చించుకోవాలి. అరెంజ్ మ్యారెజ్ అంటే రెండు కుటుంబాలు కలవడం కూడా.
ఆధ్యాత్మికత పై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయ్ ?
బంధం విజయవంతంగా కొనసాగాలంటే ఆధ్యాత్మిక అంశాలపైన కూడా అభిప్రాయాలు తీసుకోవడం చాాలా అవసరం. వివాహానంతరం దేవుడు, ఆధ్యాత్మికత, ఆచారాల విషయం తరచుగా చర్చకు వస్తుంది. ఆ సమయంలో మనస్పర్ధలు, ఘర్షణలు రాకుండా ఉండాలంటే ఆధ్యాత్మికతపై కూడా ఒకరి భావాలు మరొకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
జీవితంలో మీ లక్ష్యాలు ఎలా ఉన్నాయ్ ?
జీవితభాగస్వామిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారి లక్ష్యాలను, కోరికలను మీరు గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ ఇద్దరి బంధం బలంగా ముందుగు కొనసాగుతుంది. ఒకరితో ఒకరు వారి ఉద్యోగ బాధ్యతలపై లోతుగా చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావాలి.
మీరు ఆర్ధికంగా ఎలా స్థిరపడాలనుకుంటున్నారు ?
జీవితం కుటుంబం గడవాలంటే డబ్బు చాలా ముఖ్యమైంది. ఈ అంశంపై మీకున్న సందేహాలన్నింటినీ ముందుగానే నివృత్తి చేసుకోవాలి. సంవత్సర ఆదాయం ఎంత, ఖర్చులు ఎలా వుంటాయ్, ఎన్ని అప్పులు ఉన్నాయ్, భవిష్యత్తులో ఏమి కొనాలనుకుంటున్నారు లాంటి వాటిపై ముందుగానే చర్చించుకోవాలి. ఈ విషయంలో దాపరికాలు అస్సలు లేకుండా చూసుకోవాలి.
మన కుటుంబ సభ్యుులు కలిసి ఇమడగలుగుతారా ?
ఇద్దరూ పెళ్లి చేసుకున్న తరువాత రెండు కుటుంబాలతో ఎలా ఉండాలనుకుంటున్నారనేదానిపైన కూడా ముందుగానే ఓ అభిప్రాయానికి రావాలి. కొందరు కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటారు. మరికొందరు కుటుబానికి దూరంగా న్యూక్లియర్ ఫ్యామిలీని మొదలుపెట్టాలనుకుంటారు. ఏదైనా సరే ముందుగానే దీనిపై కూడా చర్చించుకావాలి.



Click it and Unblock the Notifications