Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
రిలేషన్‌షిప్‌లో విడాకులకు ప్రధాన కారణాలు ఇవే..!
పెళి జరిగి సంవత్సరం కాక ముందే చాలా జంటలు విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనికి రచాలా కారణాలు వున్నాయ్. మారుతున్న జీవన విధానం, మారుతున్న పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. వివాహమనేది జీవితంలో చాలా ముఖ్యమైన, సున్నితమైన అంశం. వివాహం విషయంలో సరైన జాగ్రత్తలు గనుక తీసుకోకపోతే వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులను ఎదర్కొంటారు.
జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం ఏడు జన్మల బంధం అని అంటారు. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అలా అనిపించడం లేదు. వివాహం నూరేళ్ల పంట కాదు కొన్ని నెలల పంటనే అని చాలా మంది జంటలు రుజువు చేస్తున్నారు. అయితే వివాహాల తరువాత విడాకులు ఎక్కువగా కావడానికి ప్రధాన కారణాలను కొన్నింటిని కనుగ్గొన్నాము. వాటిని మీకు ఈ ఆర్టికల్‌లో అందిస్తున్నాము.

జీవిత భాగస్వామిని గౌరవించకపోవడం
భార్యా భర్తలు ఇద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి. అలా గౌరవించుకున్నప్పుడే ఇద్దరి బంధం మరింత బలంగా మారుతుంది. లేదంటే శత్రువులుగా మారుతారు. గౌరవం ఇచ్చుకోకపోతే దగ్గరికి వెళ్లే అవకాశం వుండదు. దగ్గరికి వెళ్లకపోతే ప్రమను చూపించే ఆస్కారం లేదు. కాబట్టి భార్యకు, లేదా భర్తకు కచ్ఛితంగా గౌరవం ఇవ్వాల్సిందే. లేదంటే ఇద్దరి మధ్య గొడవలు విపరీతంగా పెరిగి దూరమౌతారు. అది విడాకులకు దారి తీస్తుంది.
ఆర్థిక సమస్యలు
ప్రస్తుత జీవనశైలిలో ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయ్. లైఫ్‌స్లైల్ మారడం వల్ల కూడా ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయ్. వచ్చిన జీతంలో భార్యా భర్తలు సర్దుకోలేక గొడవలు పడుతున్నారు. ప్రతీ పైసా ఆచీ తూచీ ఖర్చు చేయకుండా అనవసర ఖర్ఛులు చేసి తరువాత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా విడాకులకు దారి తీస్తోంది. భార్య భర్తలు వేరు వేరుగా సంపాదించుకోగలుగుతామనే భావన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతోంది.

కమ్యునికేషన్ లేకపోవడం
భార్యా భర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మాట్లాడుకోకుండా వుండవద్దు. కానీ గొడవలు వచ్చినప్పుడు ఇద్దరూ మాట్లాడుకోకుండా వుండడం వల్ల వారి మనసులో ఏమి వుందో బయటకు చెప్పలేకపోతున్నారు. ఇక దూరం పెరిగి అది క్రమంగా విడాకులకు దారి తీస్తోంది.
నమ్మకం లేకపోవడం
నమ్మకం కుదిరితేనే, నమ్మకం వుంటేనే పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి తరువాత కొంత మంది భార్యా, భర్తలు, జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు. ఇది వారి మనసుపై తీవ్రమైన గాయాలను చేస్తుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి కూడా విడాకులు ఇస్తున్నారు. నమ్మకం చాలా బలమైనది, కానీ కొంత మంది భార్యలు, భర్తలు ఆ నమ్మకానికి సరైన విలువను ఇవ్వడం లేదు.
కుటుంబ సభ్యుల జోక్యం
భార్యా భర్తల మధ్య చాలా గొడవలు జరుగుతుంటాయ్. అయితే ఈ గొడవలు జరిగినప్పుడల్లా అమ్మా, నాన్నా, అత్తా, మామలు, స్నేహితులు మధ్యలో వస్తారు. వీరు రావడం వల్ల గొడవ మరింత పెద్దగా అవుతుంది. కొందరు కావాలనే భార్యా భర్తలు విడిపోవాలని మధ్యలో వచ్చి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం. ఈ గొడవ నుంచి బయటపడ్డానికి భార్యా భర్తలకు విడాకులు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఇది కూడా విడాకులకు ప్రధాన కారణం.



Click it and Unblock the Notifications