Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
పక్క చూపులకు.. పక్కా కారణాలు ఇవే..!!
దాంపత్య జీవితం లో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయ్. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. ఇంకా ఏయే కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఆర్థిక సమస్యలు
ఆర్థిక సమస్యలు, ఖర్చులు పెరగడం వలన దాంపత్య జీవితం ఒత్తిడికి గురవుతుంది. ఆర్థిక భారంతో వ్యక్తులు మానసికంగా, శారీరకంగా దూరమవుతారు. ఆర్థికంగా ఆందోళనలతో ఉన్న వ్యక్తులు బయట ఆనందం కోసం వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ప్రారంభిస్తారు.
సోషల్ మీడియా
ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ విస్తరణ కారణంగా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా వ్యక్తులకు ప్రైవెసీ అవకాశాలను మరింత పెంచుతున్నాయ్. ఆన్లైన్ లో పరిచయాలు, చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా వ్యక్తులు సులభంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం చేస్తున్నారు.
సంస్కృతి మారడం
ఆధునిక సమాజంలో సాంస్కృతిక మార్పులతో వ్యక్తుల ఆలోచన విధానాలు, అభిరుచులు మారుతున్నాయి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం, సమాజంలో స్వేచ్ఛా భావం పెరగడం వలన వివాహేతర సంబంధాలను కొంతమంది సాధారణంగా తీసుకుంటున్నారు. సాంప్రదాయక ఆంక్షలు తగ్గి, వ్యక్తులు స్వేచ్ఛగా ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డం వల్ల వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
శారీరక, మానసిక అవసరాలు
దాంపత్య జీవితంలో శారీరక, మానసిక అవసరాలు తీరకపోవడం కూడా వివాహేతర సంబంధాలకు కారణం అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం, శారీరక సంతృప్తి కోసం వ్యక్తులు వివాహేతర సంబంధాలను ఆశ్రయిస్తారు.ఇది కూడా వివాహేతర సంబంధానికి కరణమౌతుందని అంటున్నారు.
కొత్తదనం, సాహసవాంఛ:
కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకోవడం, ఒకే వ్యక్తితో సుదీర్ఘంగా ఉండటం వలన వచ్చే విసుగు, కొత్తదనం కోసం ఆరాటపడ్డం ద్వారా వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. దాంపత్యంలో ప్రేమ తగ్గి కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వివాహేతర సంబంధాలను పెరిగిపోతున్నాయ్.
భర్త, భార్య మధ్య నమ్మకం లేకపోవడం
దాంపత్య జీవితంలో విశ్వాసం, స్నేహం లేకపోవడం వలన ఒకరి పై మరొకరు అనుమానం పెరగుతుంది. ఆ అనుమానాలు నిజమై వివాహేతర సంబంధాలకు దారితీస్తాయి. విశ్వాసం లోపించడం వ్యక్తులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అభిరుచులు, ఆసక్తులు విభిన్నంగా ఉండటం వలన విభేదాలు, దూరం పెరుగుతుంది. ఈ విభేదాలు ఇతర వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగడానికి కారణం అవుతాయి.
సంబంధాలలో బద్ధకము
కొన్నిసార్లు దాంపత్య జీవితంలో వచ్చిన బద్ధకము కూడా వివాహేతర సంబంధాలకు కారణం అవుతుంది. ఒకే రకమైన దైనందిన జీవితంలో ఆసక్తి కోల్పోవడం, కొత్త అనుభవాలు కోసం ఇతర సంబంధాలను ఆశ్రయిస్తున్నారు. పాత సంబంధాలలో ప్రేమ, ఆకర్షణ తగ్గిపోవడం వలన, ఇతర సంబంధాలు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. మానసిక సంతృప్తి కోసం వ్యక్తులు వివాహేతర సంబంధాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది.
వివాహేతర సంబంధాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు దీనికి ప్రధాన కారణాలు. ఈ కారణాలను అర్థం చేసుకోవడం, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications
