Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
భార్యా భర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే..?
రిలేషన్‌షిప్‌లో డబ్బును తక్కువ అంచనా వేయవద్దు. డబ్బు విషయంలోనే దంపతులిద్దరి మీధ్య గొడవులు ఎక్కువగా వస్తాయ్. ఎన్ని సమస్యలు వచ్చినా భార్యా భర్తలు డబ్బు గురించి ఎక్కువ గొడవలు పడవద్దు. వున్న ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చనేదానిపై ఇద్దరూ మాట్లాడుకోవాలి. సమస్యసు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కానీ గొడవ పడ్డం ద్వారా సమస్య మరింత తీవ్రమౌతుంది. సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలనేదానిపై ఒక ప్రణాళికను రూపొందించుకోండి.

ఇంటి పనులు
ఇంటి పనులకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు వున్నాయ్. ఈ విషయంలో మీదంటే మీది కూడా బాధ్యత వుందనే ప్రశ్నలు వాదనలు తలెత్తుతాయ్. గొడవ తీవ్రమౌతుంది. ఇంటి పనిని కూడా సక్రమంగా విభజించుకోవాలి. ఏ గొడవ వచ్చినా రాజీ పడ్డానికి ముందుండాలి గానీ దాన్ని పెంచే విధంగా వుండకూడదు.
సరిగ్గా మాట్లాడుకోకపోవడం
సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల భార్యా భర్తలిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణమౌతాయ్. చెప్పిన విషయాన్ని వినిపించుకోకపోవడం. వినిపించినా విననట్టు వుండం. వింటానని చెప్పి మాట తప్పడం. మనసులోని విషయాలను బయటకు సరిగ్గా చెప్పకపోవడం వల్ల భార్యా భర్తలిద్దరూ వాదనలకు దిగుతారు.

రొమాన్స్
ఇద్దరి మధ్య రొమాన్స్, సెక్స్ సంతృప్తిగా లేకపోవడం వల్ల కూడా గొడవలు వస్తాయ్. ఈ విషయంలో ఇద్దరికి ఏ సమస్య వచ్చినా మనసు విప్పి మాట్లాడుకోవాలి. శృంగార విషయంలో ఎలాంటి దాపరికాలూ పెట్టుకోవద్దు. ప్రతీ దానికి నేను అనే పదాన్ని ఉపయోగించడం వల్ల మీ అహంకరాన్ని ప్రదర్శించి గొడవను మరింత తీవ్రం చేసినవారౌతారు.
పిల్లలు
పిల్లల విషయంలో కూడా భార్యా భర్తల మధ్య గొడవలు వస్తాయ్. పెళ్లి తరువాత ఎక్కువగా గొడవలు రావడానికి పిలలు కూడా ప్రధాన కారణంగా కనుగ్గొన్నారు. పిల్లలు పుట్టుకముందే ఈ విషయంపై చర్చించుకోండి. పిల్లలకు ఎలాంటి బుద్ధులు నేర్పించాలి, ఎలా చదివించాలి లాంటి విషయాలపై తల్లిదండ్రులు ముందుగానే మాట్లాడుకోవాలి. పేరెంటింగ్ పైన సరైన అవగాహన గనుక లేకపోతే అటు భార్యా, ఇటు భర్త తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల విషయంలో కూడా భాధ్యతలను వభజించుకోవాలి. ఒకరు తినిపించడం, మరొకరు చదువు చెప్పించడం. ఒకరు స్నానం చేయించడం, మరొకరు బయటకు తీసుకెళ్లడం. ఇలా పిల్లలకు సంబంధించిన విషయాలను విభజించుకుంటే సమస్యలు రాకుండా వుంటాయ్. మీరు, మీ పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీ తల్లిదండ్రులు ఎక్కువగా తలదూర్చకుండా జాగ్రత్తపడండి. అలా చేసినప్పుడు మీరు మీ పిల్లలు సంతోషంగా వుంటారు.
జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం
వ్యక్తగత జీవితం కుటుంబం జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కుటుంబానికి సరైన సమయాన్ని కేటాయించాలి. పిల్లల, భార్య, భర్తలకు తగిన సమయాన్ని కేటాయించాలి. ఎంత పని ఒత్తిడి వున్నా వీరు మన జీవితంలో ప్రముఖులు అన్న విషయాన్ని మరువరాదు. వున్న సమయాన్ని వృధా కాకుండా సరిగ్గా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి.
కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య అసూయ, అభద్రతా భావం వస్తుంది. ఈ విషయంలో ఇద్దరూ వాదనలకు దిగే అవకాశం వుంది. ఇలాంటివి జరిగినప్పుడు భావోద్వేగంలో నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి భయాలను తొలగించుకోవాలి.ప్రతీ బంధం చాలా ప్రత్యేకమైంది. ఎన్ని గొడవలు, ఎన్ని వాదనలు వచ్చినా వాటిని మొగ్గలోనే తుంచివేసే విధంగా మాట్లాడుకోవాలి, కలిపి పరిష్కరించుకోవాలి. లేదంటే సమస్య చాలా పెద్దగా మారిపోతుంది. మీ మధ్యలు సమస్య



Click it and Unblock the Notifications