For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loyal Relationship: మీ భాగస్వామి ఇలా ఉంటే.. మీ బంధం బలమైనదే

|

Loyal Relationship: బంధం కలకాలం నిలిచి ఉండేందుకు అంకితభావంతో ఉండటం ముఖ్యం. సంబంధంలో విశ్వాసం ఉండాలి. ఒకరిపై ఒకరికి అచంచలమైన నమ్మకం ఉండి తీరాలి. విజయవంతమైన సంబంధానికి ఇవి ముఖ్యమైన అంశాలు. అది భార్య భర్తల సంబంధం అయినా... కుటుంబ బంధమైన, పని బంధం అయినా ఇవి పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి విధేయతతో ఉంటే, అది దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. విశ్వాసం చూపించే వ్యక్తికి సంబంధాలు, సమాజంలో గౌరవం లభిస్తాయి. వారి బంధాన్ని ప్రతి ఒక్కరు విలువైనదిగా భావిస్తారు.

విధేయత అనేది బంధంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ బంధంలో సమస్యలు తెచ్చిపెట్టదు అనే దానికి మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు. బంధంలో ఆత్మగౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. కోపం వస్తే పరుషమైన పదాలు వాడొద్దు. భాగస్వామి దుఃఖంగా ఉంటే ఓదార్చడానికి ప్రయత్నించాలి. నమ్మద్రోహం అస్సలే చేయవద్దు. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా సంబంధం సమస్యలను తెచ్చిపెడుతుంది.

ఒక బంధం నమ్మకమైనదా.. కాదా.. అనేది ఎలా గుర్తించాలి. ఈ చిట్కాలతో ఆ విలువైన బంధాన్ని గుర్తించవచ్చు.

ఒక బంధం నమ్మకమైనదా.. కాదా.. అనేది ఎలా గుర్తించాలి. ఈ చిట్కాలతో ఆ విలువైన బంధాన్ని గుర్తించవచ్చు.

1.నో గాసిప్

నమ్మకం, అంకితభావం ఉన్న వ్యక్తులు.. మీరు సమీపంలో లేనప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు లేనప్పుడు మీ గురించి ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణి వారిలో కనిపించదు. మీరు ఉన్నా.. లేకపోయినా.. వారికి మీ పట్ల ఒకే భావన ఉంటుంది. పుకార్లు ఎట్టిపరిస్థితుల్లోనూ స్ప్రెడ్ చేయరు. అలాగే మీ పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడినా, పుకార్లు చెప్పినా.. వాటిని ఖండిస్తారు. నిజానిజాలు తెలియజేస్తారు. ఎప్పుడూ అండగా నిలబడతారు.

2.కేరింగ్ చూపించడం

2.కేరింగ్ చూపించడం

భాగస్వామి పట్ల విశ్వాసం చూపించే వారు వారికి ఎప్పుడూ అండగా ఉండటంతో పాటు కేరింగ్ చూపిస్తుంటారు. భాగస్వామి రక్షణ పట్ల శ్రద్ధ చూపిస్తారు. వారు పార్ట్నర్ పట్ల తమ ధోరణి ఏమిటో చక్కగా తెలియజేస్తారు. అలాంటి వారు కష్టనష్టాల్లో తోడుంటారు. కష్టం వచ్చింది కదా అని విడిచి పెట్టి వెళ్లిపోరు. డబ్బు, సంపద, ఆనందం ఉంది కదా అని వారి వెంటే ఉండరు. అన్ని సమయాల్లోనూ అండగా నిలబడతారు. ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటారు.

3. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం

3. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం

గౌరవం అనేది ప్రతి బంధంలో ఉండి తీరాల్సిన ముఖ్యమైన అంశం. మన వాళ్లే కదా అనే ధోరణిలో గౌరవం ఇవ్వకపోవడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సరైనది కాదు. గౌరవం ఇవ్వాలి, అలాగే గౌరవం తీసుకోవాలి. భాగస్వాములు ఎదురుగా ఉన్నా, లేకపోయినా.. వారి పట్ల గౌరవ మర్యాదలు చూపిస్తుంటారు. భాగస్వాములిద్దరూ ఒకరి విమర్శకులను మరొకరు ఏ విధంగానూ సహించలేనప్పుడు సంబంధంలో కూడా విధేయత కనిపిస్తుంది.

4. బంధాన్ని పదిలం చేసుకోవడం

4. బంధాన్ని పదిలం చేసుకోవడం

సంబంధంలో సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ బంధాన్ని పదిలం చేసుకోవాలనే నిబద్ధత కనిపించాలి. తమ బంధం మరింత మెరుగుపడాలనే తాపత్రయం ఉండాలి. ఇది సంబంధంలో చిన్న పాటి కలహాలు వచ్చినా.. అర్థం చేసుకుని సర్దుకుపోయేలా చేస్తుంది. అలాగే చిన్న చిన్న గొడవలను పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగే మార్గాన్ని చూపిస్తుంద. ఒక వ్యక్తి వ్యక్తిగతంగానే కాకుండా సంబంధంగా అభివృద్ధి చెందినప్పుడు... బంధం బలపడుతుంది. మరింత ప్రేమతో నిండిపోతుంది.

5. హామీలను, వాగ్దానాలను నెరవేర్చడం

5. హామీలను, వాగ్దానాలను నెరవేర్చడం

అవగాహన, నమ్మకం, వాగ్దానాలపై సంబంధాలు నిర్మితం అవుతాయి. ఒకరికొకరు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. హామీ ఇచ్చినంత సులభంగా వీటిని పాటించలేరు. కానీ నిబద్ధత ఉంటే తప్పక పాటిస్తారు. అలా వాగ్దానాలు నిలబెట్టుకున్నప్పుడే నిజమైన బంధం అవుతుంది. ఇలా నిలబెట్టుకోవాలంటే.. నమ్మకం, ప్రేమ, విశ్వాసం ఉండాలి.

6. సహనం ఉండటం

6. సహనం ఉండటం

మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక అవసరం. సహనం ఒకరికొకరు ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఓపిక అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇది ఒక్కో సందర్భంలో ఒక్కోలా బయటపడుతుంది. ఎల్లప్పుడు భాగస్వామి పట్ల సహనం కోల్పోవద్దు.

సంబంధంలో విధేయతగా ఉండటం ఎలా?

1. ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యాలు ఉంచుకోవద్దు.

2. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవాలి. అలాగే వాటిని ఆమోదించగలగాలి.

3. భాగస్వామి జీవితంలో ముఖ్యమైన కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

4. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. భాగస్వామి కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వారిని క్షమించగలగాలి. కానీ పగ పెంచుకోవద్దు.

5. ఒక నిర్ణయం తీసుకునే ముందు అది బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆలోచించాలి. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా సరే.. సరైనది అనిపిస్తే ముందుకే వెళ్లాలి.

చివరిగా..

చివరిగా..

ఒక వ్యక్తి స్వభావం కంటే సంబంధంలో విధేయతతో ఉండటం అనేది ముఖ్యం. విధేయత, ప్రేమ అనే అంశాలు ఉంటే ఆ బంధం నిజంగా మధురంగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఏ తప్పు చేసినా క్షమించగలరు. ఏదైనా పని చేస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బంధం ఏదైనా దానిని నిలబెట్టే పిల్లర్ నమ్మకమే.

English summary

What Are The Signs Of A Loyal Relationship? in Telugu

read on to know What Are The Signs Of A Loyal Relationship? in Telugu
Story first published:Wednesday, July 20, 2022, 12:14 [IST]
Desktop Bottom Promotion