Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే.. మీ పార్ట్‌నర్‌లో ఈ లక్షణాలు కనిపిస్తాయ్..
ఘాడమైన ఎమోషన్స్‌ను పంచుకోవాడానికి ఎవ్వరూ ఇష్టపడరు, అది ప్రేమైనా కావచ్చు. కొంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నా దానిని మాటల్లో చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో హావభావాలతో కూడా చూపించలేరు. కేవలం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రేమికులు దొరకడం నిజంగా అదృష్టం. అయితే నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనే దానిని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. వారు చేసే పనులను, మాటలను బట్టి గ్రహించవచ్చు. మీకు అప్పటికే పార్ట్‌నర్ ఉంటే మీ పార్ట్‌నర్ నిజయంగా మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారా తెలుసుకోవాలంటే ఈ కింది లక్షణాల ద్వారా తెలిసిపోతుంది.
కృతజ్ఞతా భావం
మీపైన ప్రేమ ఎక్కువగా ఉంటే.. మీరు చేసే చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా కృతజ్ఞతా భావాన్ని చూపెడుతూ ఉంటారు. పదే పదే మీపై ఈ కృతజ్ఞతా భావాన్ని చూపడానికి వెనుకాడరు. మీకు మీ పార్ట్‌నర్ ఎక్కువసార్లు థ్యాంక్యూ గనగ చెబుతున్నట్టయితే మీమీద కొండంత ప్రేమ ఉన్నట్టని గుర్తించండి.

ఏదీ దాచుకోరు
మీతో అన్ని విషయాలనీ పంచుకుంటారు. ఎటువంటి దాపరికాలు లేకుండా ప్రతీఒక్క అంశాన్ని మీకు వివరిస్తుంటారు. వారి నిజస్వరూపాన్ని మీ ముందు వుంచుతారు. వారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను మీతో పంచుకుంటారు. ఇలా చేయడం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఏమీ అడగకున్నా మీకు అన్నీ చెప్పేస్తుంటారు.
మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు
మీ పై పూర్తి నమ్మకాన్ని మీ పార్ట్‌నర్ కలిగి ఉంటారు. మీరు ఇంటికి లేటుగా వచ్చినా దానికి కారణమేంటని అడగరు. మీ అనుమతి లేనిదే మీ ఫోన్‌ను చెక్ చేయరు. నమ్మకం ఎక్కువైతే మీపై అనుమానాలు కూడా ఉండవు. వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై మిమ్మల్ని సలహాలు కోరుతారు.
సమయాన్ని కేటాయిస్తారు
మీతో విలువైన సమయాన్ని కేటాయిస్తారు. వారి పనుల్లో ఎంత బిజీగా ఉన్న మీకోసం ప్రత్యకంగా సమయం తీసుకొని మీతో కాలాన్ని గడుపుతారు, మాట్లాడుతారు, డిన్నర్ చేస్తారు. మీతో కలిసి ఉండటమే వారు విలువైన క్షణాలుగా భవిస్తారు. కాబట్టి మీకు సమయం కేటాయించడానికి అస్సలు వెనుకాడరు.
మీతో కలిసి జీవించడానికి
మీపార్ట్‌నర్‌కు మీరు ఇష్టమైతే మీతో కలిసి జీవితంలో నడవడానికి ఉత్సాహం చూపుతారు. మీతో కలిసి బ్రతికితే ఎలా ఉంటుందనే విషయాలను మీతో తరచుగా చర్చిస్తుంటారు. ఇలాంటి విషయాలు మీతో మాట్లాడ్డానికి వెనకాడరు. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు చెప్పకపోయినప్పటికీ ఇద్దరం కలిసి బ్రతికితే ఎలా ఉంటందనే విషయాలను మీతో మాట్లాడుతుంటారు.
గైరవప్రదంగా
మీ గురించి మీ పార్ట్‌నర్ ఏ అంశంపై ఎలా ఫీలవుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఘాడంగా గనుక ప్రేమిస్తే మీ పట్ల గౌరవ భావంతో ఉంటారు. లేదంటే మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటున్నట్లయితే మీ పట్ల గౌరవంతో ఉంటున్నారని అనుకోవచ్చు.
మీ సంతోషమే ముఖ్యం
మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ఘాడంగా ప్రేమిస్తే.. మీ సంతోషానికే వారు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. మీ సంతోషం కోసం మధ్యలో ఏవైనా పరిమితులు ఉంటే వాటిని కూడా పక్కకి పెడతారు. ఉదాహరణకు మీతో డేటింగ్‌కు రావడం, వారు మీకు ఇష్టమైన పనులను ఎక్కువగాీ చేయడం చూస్తుంటారు.



Click it and Unblock the Notifications