Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Fathers Day Special : మీరు తండ్రైతే పిల్లలకు ఏమి చెప్పాలనుకుంటారు..? కొందరి అభిప్రాయాలు ఇలా వున్నాయ్..!
ప్రస్తుతం ఫాదర్స్ డేను జరుపుకుంటున్నాం. మనుషులను దేవుడు సృష్టించాడో లేదో సరిగ్గా తెలియదు కానీ ఒక మనిషికి జన్మనిచ్చేది నాన్న, అమ్మ. నాన్న దేవుడితో సమానం. అందులో హిందూ శాస్త్రాల్లో తల్లిదండ్రులను దైవంతో పోలుస్తారు. పురాణాల్లో గణేషుడిని సృష్టిని చుట్టి రమ్మంటే గణేషుడు పార్వతీ, పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. అలా ప్రదక్షిణ చేసిన తరువాత తల్లిదండ్రే తనకు సృష్టి అని గణేశుడు జవాబిస్తాడు.
ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులు తమకు జీవితంలో ఎదురైన అనేక సంఘటనలు, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఎదుగుతున్న తమ పిల్లలకు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి కొన్ని భావాలను, ఆలోచనలను మీతో పంచుకుంటున్నాము. కింద వున్న ఈ వివరాలను కొంత మంది తండ్రుల నుంచి సేకరించడం జరిగింది. వారు తమ పిల్లలకు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఒక సారి పరిశీలిద్దాం.

తండ్రులు తమ పిల్లలకు చెప్పాలనుకుంటున్న విషయాలు
1. నీ జీవితాన్ని నువ్వ పూర్తిగా అనుభవించు. లైఫ్‌లో రిస్క్ తీసుకొని ప్రయోగాలు చేయి, సాహసాలను ప్రదర్శించు. ఎన్ని ఓటములు ఎదురైనా సరే విశ్రమించకు. ఏదైనా సహాయం కావాలనుకుంటే నేను వున్నానన్న విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు.
2. నీ విజయాలు నాకు ఆనందాన్ని కలిగించడమే కాదు నువ్వు ఎంత శ్రమించినప్పటికీ నువ్వు ఓటమిని చవిచూసినప్పుడు నా మనసు చాలా బాధపడుతుంది. నిన్న గెలిపించడానికి నేను చేయగలిగినంత సహాయం చేస్తాను.
3. కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత బాధపడ్డం చాలా సహజం. ఈ విషయాన్ని మనసుపై తీసుకోద్దు.
4. ఎలాంటి హద్దులు లేకుండా నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తాను.

5. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటానన్ని విషయాన్ని మరిచిపోవద్దు.
6. నేను నీకు ఎట్టిపరిస్థితుల్లో అబద్ధాలు చెప్పను. ఆ అబద్ధం నిన్ను ఎంత బాధపెట్టినా కూడా నీకు నిజమే చెబుతాను.
7. మనము తప్పులు చేసినప్పుడు వాటి పర్యవసానాలను కూడా అనుభవించాల్సి వుంటుంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు కచ్ఛితంగా నేను నీకు తోడుగా వుంటాను. నీకు సహాయం చేస్తాను, నీ కష్టాల్లో పాలుపంచుకుంటాను, నీతో కలిసి బాధపడతాను.
8. నేను నా పిల్లలకు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వొద్దని చెబుతాను. వారి కలలను నిజం చేసుకోవడానికి వారు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ప్రోత్సహిస్తాను. అందరి ముందూ ఎన్ని సమస్యలు వచ్చనా బలంగా ఎలా నిలబడాలో వారికి నేర్పిస్తాను. జీవితంలో కళాత్మకంగా, ప్రేమగా, ఆనందంగా ఎలా వుండాలో వారికి నేను నేర్పుతాను.
9. ఒకరిని బాధించే అర్హత ఇంకొకరికి ఎప్పటికీ లేదు. కాబట్టి నువ్వు అనుకుంటున్న దానికోసం బలంగా నిలబడి నీకు ఏది సరైనదని అనిపిస్తే అది సాధించు.
10. నువ్వు వయసులో పెద్దవాడివైనప్పుడు నువ్వు సంతోషంగా వుంటావు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ వుంటుంది.
11. నువ్వు చేయలేవని ఎవరైనా అంటే దానిని నువ్వు తప్పు అని నిరూపించాల్సిన అవసరం, బాధ్యత నీకు కచ్ఛితంగా వుంటుంది.
12. మహిళలు, బాలికల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వుండాలి.
ఈ ఫాదర్స్ డే రోజున మీ పిల్లలకు ఏమి చెప్పాలనుకుంటున్నారో మీ పిల్లలకు తప్పకుండా చెప్పండి. ఫాదర్స్ డే రోజు పిల్లలు తండ్రులకు శుభాకాంక్షలు చెప్పడం సహజమే. కానీ అదే రోజు పిల్లలకు తండ్రులు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చెబితే అవి వారి జీవితంలో మార్పులను తీసుకొని వస్తాయ్.



Click it and Unblock the Notifications