Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రొమాన్స్ అంటే సెక్స్ ఒక్కటే కాదు.. ఇందులో చాలానే రకాలు ఉన్నాయి, అవేంటో తెలుసా?
రొమాన్స్.. ఈ పదం వినగానే చాలా మంది సెక్స్ అనుకుంటారు. మరికొందరు కిస్సింగ్, హగ్గింగ్ వంటివి ఊహించుకుంటారు. అయితే రొమాన్స్ లో చాలానే రకాలు ఉన్నాయి. అందులో ఎనిమిది రకాల రొమాన్స్ గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. అసలు రొమాన్స్ లో ఆ ఎనిమిది రకాలు ఏంటి, అవేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎమోషనల్ ఇంటిమెసి:
ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం. ఎమోషనల్ గా దగ్గరవడాన్ని ఎమోషనల్ ఇంటిమెసి అంటారు. ఇందులో భాగస్వాములు ఆలోచనలతో పాటు ఇతర విషయాలను.. భావోద్వేగాలను పంచుకుంటారు. సానుభూతి పొందడం, సపోర్ట్ ఇవ్వడం ఇందులోనే ఉంటుంది.

2. ఫిజికల్ ఇంటిమెసి:
ఫిజికల్ ఇంటిమెసి అంటే ముట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, చేతులు పట్టించుకోవడం ఇలా ప్రతీది ముట్టుకోవడంతో ఉంటుంది.
3. ఇంటలెక్చువల్ ఇంటిమెసి:
ఇంటలెక్చువల్ ఇంటిమెసిలో కాస్త లోతైన ఆలోచనలు ఉంటాయి. ప్రతీది పంచుకోవడం, మనసులోని బాధలను తెలుసుకోవడం వంటివి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.
4. ఎక్స్ పీరియెన్షియల్ ఇంటిమెసి:
ఇది భాగస్వామ్య అనుభవాలను పంచుకునేందుకు కలిసి జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. అందుకోసం కలిసి టూర్లు తిరగడం, సహసాలు చేయడం వంటివి ఉంటాయి.
5. స్పిరిట్యువల్:
ఈ రకమైన ఇంటిమెసిలో ఆధ్యాత్మికమైన సాన్నిహిత్యం ఉంటుంది. ఇందులో నమ్మకాలు, విశ్వాసాలు, ఉద్దేశ్యం, జీవితపు అర్థాలను వంటి వాటిని అన్వేషించడం జరుగుతుంది.
6. రీక్రియేషనల్ ఇంటిమెసి:
రీక్రియేషనల్ ఇంటిమెసిలో సాన్నిహిత్యం అనేది రెస్ట్ మోడ్ లో ఉంటుంది. దీన్ని ఆస్వాదించడం, కలిసి సరదాగా గడపడం, ఆటలు ఆడడం, విహార యాత్రకు వెళ్లడం లేదా బంధాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి ఉంటాయి.
7. క్రియేటివిటీ ఇంటిమెసి:
క్రియేటివిటీ ఇంటిమెసిలో కలిసి పని చేయడం, క్రియేటివిటీని ఎక్స్ ప్లోర్ చేయడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా కలిసి వంట చేయడం, కళను సృష్టించడం ఏదైనా క్రియేటివిటీగా సృష్టించడం, దేనికైనా రూపాన్ని ఇవ్వడం వంటివి ఉంటాయి.
8. సెక్సువల్ ఇంటిమెసి:
సెక్సువల్ ఇంటిమెసిలో దంపతుల మధ్య ప్రేమ, కోరిక, అభిరుచి, ఫిజికల్ ఎక్స్ ప్రెసివ్ నెస్ వంటి వాటి గురించి ఇద్దరూ తెలుసుకుంటారు.
దాదాపుగా అందరూ అన్ని రకాల రొమాన్స్ ను ఎక్స్ పీరియన్స్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్ పీరియన్స్ జంటలు చాలా సంతోషంగా ఉంటాయి. వీరి వైవాహిక బంధం కూడా చాలా బలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications