Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Love or Sex: మగాళ్లు ఏది కావాలనుకుంటారు? ప్రేమ లేదా సెక్స్.. వాళ్లేం చెబుతున్నారంటే..
మగాళ్లకు సెక్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. వారికి ప్రేమ అంటే తెలీదు. వారికి ప్రేమించే మనస్సు ఉండదు. ఆడవారిలో వాళ్లు చూసేది కేవలం అందం మాత్రమే. ప్రేమించడం, ప్రేమించబడటం వారికి రాదు. ఇలాంటి విమర్శలు మగవారిపై చాలానే వస్తుంటాయి.
Love or Sex: మగాళ్లకు సెక్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. వారికి ప్రేమ అంటే తెలీదు. వారికి ప్రేమించే మనస్సు ఉండదు. ఆడవారిలో వాళ్లు చూసేది కేవలం అందం మాత్రమే. ప్రేమించడం, ప్రేమించబడటం వారికి రాదు. ఇలాంటి విమర్శలు మగవారిపై చాలానే వస్తుంటాయి. మరి నిజంగానే వారికి ప్రేమ కంటే కూడా సెక్స్ అంటేనే ఇష్టమా..? వారిలో సెక్స్ తప్ప ప్రేమ భావాలు కలగవా..?

సెక్స్ ఓదార్పునిస్తుంది
సెక్స్ అనేది ప్రేమకు సంబంధించినది కూడా. ఇది చాలా ఓదార్పునిస్తుంది, శ్రద్ధను పెంచుతుంది. శరీరాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నప్పుడు, అది ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. కొన్నిసార్లు ప్రేమ కంటే కూడా శృంగారాన్ని గొప్పదిగా పేర్కొంటారు మానసిక నిపుణులు.

సెక్స్ గురించి పురుషులు ఏమంటున్నారంటే..
సెక్స్ విషయానికి వస్తే, పురుషులు చాలా భిన్నమైన దృక్కోణాలను కలిగి ఉంటారు. కొందరు ప్రేమకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటే మరికొందరు సెక్స్ తర్వాతే ప్రేమ అని అంటారు. కొంత మంది పురుషులు సంబంధంలో ఉండి దాని తర్వాత శృంగారాన్ని అనుభవించాలని బలంగా కోరుకుంటారు.

సెక్స్ ముఖ్యం
సంబంధానికి సెక్స్ ముఖ్యం కాదని ఎవరైనా అంటే ఇది నిజంగా అబద్ధమేనని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఎవరైతే సంబంధంలో ఉండరో వారికి ప్రేమ కంటే కూడా శృంగారం అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ప్రేమ కావాలా.. శృంగారం కావాలా.. అని వారిని అడిగితే సెక్సే కావాలని అంటారు. అయితే సంబంధంలో ఉన్న చాలా మంది మాత్రం శృంగారానికి రెండో స్థానాన్ని కట్టబెడతారు.

ప్రేమే గెలుస్తుంది
సంబంధంలో ఉన్న వారికి ప్రేమ విలువ తెలుసు. భాగస్వామి విలువ అంతకంటే ఎక్కవే తెలిసి ఉంటుంది. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు, ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, తోడు కావాలనిపించినప్పుడు భాగస్వామి విలువ, ప్రేమ విలువ తెలిసి వస్తుంది. భాగస్వామి ఉంటే వారి ఒడిలో ఒదిగిపోయి మనసులోని బాధనంతా వెళ్లగక్కుతారు. అలాంటి సమయంలో సెక్స్ కూడా గుర్తుకు రాదు. గుర్తుకే రాని విషయాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామి యొక్క ప్రేమపూర్వక చర్యలు, శ్రద్ధ వహించే స్వభావం సెక్స్ కంటే ఎంతో విలువైనవి.

ఇది ఆత్మవిశ్వాసం బూస్టర్!
కొన్నిసార్లు పురుషులు ప్రేమ కంటే సెక్స్‌ను ఇష్టపడతారు. ఎందుకంటే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనిషిగా, ఒకరి ఆత్మగౌరవంపై మంచి సెక్స్ ప్రభావాన్ని చూపుతుంది. ప్రేమ కొన్ని సమయాల్లో బాధించవచ్చు. సెక్స్ ద్వారా ఒకరు పొందే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎక్కువ. సెక్స్ అనేది చాలా తేలికైనది.

సెక్స్ కొంతకాలమే కానీ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
మీ వయస్సు పెరిగే కొద్దీ, దంపతుల జీవితంలో సెక్స్‌కు అంత పెద్ద పాత్ర ఉండదు. ప్రేమ, భావోద్వేగాలు అలాగే ఉంటాయి కానీ ఒక వయస్సులో, మీరు చాలా ఫిట్‌గా మరియు ఫ్లెక్సిబుల్‌గా ఉంటే సెక్స్ ను ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు వృద్ధాప్యంలో కూడా సెక్స్ అనుభూతి చెందాలని కోరుకోవడం సుదూర జ్ఞాపకంగా మారుతుంది.
చివరిగా..
వివాహ బంధంలో ప్రేమ, సెక్స్ రెండూ ముఖ్యమైనవే. సంబంధం ప్రేమతో మొదలవుతుంది. ప్రేమ ఎక్కువైనప్పుడు దానిని శృంగారం ద్వారా తెలియజేస్తారు. అందుకే వివాహబంధంలో సెక్స్ కు, ప్రేమకు రెండింటికి అత్యధిక విలువ ఉంది.



Click it and Unblock the Notifications