రిలేషన్‌షిప్‌లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్‌ 5 సీక్రెట్స్‌ ఇవే.!

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటలు పాడుకోని పురుషులు ఉండరు. ఒక రిలేషన్‌షిప్‌లో మహిళలు నిజంగా ఏం ఆశిస్తారో చాలా మంది పురుషులకి తెలియదు. చిన్న విషయాలకే అలిగి కోపం తెచ్చుకుంటారని, ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటారని భావిస్తుంటారు. దీంతో మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నిజంగా ఒక బంధంలో పురుషుల నుంచి మహిళలు ఏం కోరుకుంటారు.. మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారు.. చూద్దాం..

What do women really want in a relationship these are the secrets

గౌరవప్రదమైన సంభాషణ

మీ భార్య ఏదైనా టెన్షన్‌, ఆందోళనలో ఉన్నప్పుడు మీరు పట్టించుకోకపోవడం, వారు చెప్పేది వినకపోవడం కారణంగా వారిలో చిరు కోపం తలెత్తుతుంది. మీ ఎదుట ఏదైనా కంప్లయింట్‌ చేసినా దానిని మీరు చిన్న విషయంగా కొట్టిపారేసినా, పట్టించుకోనట్లు ఉన్నా వారు తమ భావాలకు విలువ ఇవ్వడం లేదని ఫీలవుతుంటారు. వారిని మనస్తాపానికి గురవుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే రిలేషన్‌షిప్‌లో ఒకరి మాటలను మరొకరు ఓపికగా, శ్రద్ధగా వినడం శ్రేయస్కరం. వారి మధ్య బంధం బలపడి గొడవలు రాకుండా ఉంటాయి.

ఒకరిపై ఒకరికి గౌరవం

ఒక బంధంలో ఇద్దరి మధ్యా ప్రేమే కాదు గౌరవం కూడా ఉండాలి. భార్యతో అగౌరవంగా ప్రవర్తించడం, దూషించడం, వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, కుటుంబీకులు, ఫ్రెండ్స్‌ ముందు చులకనగా మాట్లాడటం ద్వారా మీ రిలేషన్‌షిప్‌లో దూరం ఏర్పడవచ్చు. ఆమె అభిప్రాయాలు, నిర్ణయాలు, వ్యక్తిత్వాన్ని గౌరవించినప్పుడు మాత్రమే ఆమెతో రిలేషన్‌షిప్‌ సురక్షితంగా, సంతోషంగా ఉంటుంది. హెల్తీ రిలేషన్‌షిప్‌ ఎప్పుడూ పరస్పర గౌరవంపైనే ఆధారపడి ఉంటుంది.

What do women really want in a relationship these are the secrets

భావోద్వేగాలు

ప్రతి రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్యా ప్రేమ వ్యక్తపరచడమనేది భిన్నంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకోవడం ముఖ్యం. కష్ట సమయాల్లో మహిళలు భాగస్వాముల నుంచి మానసికంగా మద్దతు కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో, వారి వ్యాఖ్యలపై అతిగా స్పందించడం, అతి సున్నితత్వం వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని అంటున్నారు. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, తక్షణ సలహా ఇవ్వకుండా వారికి మద్దతు ఇవ్వడం, ఒంటరి కాదని భాగస్వామికి తెలియజేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రేమను వ్యక్తపరచడం

రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్యా ప్రేమను మనసులోనే ఉంచుకుంటే సరిపోదు. ఆ ప్రేమను సందర్భానుసారంగా వ్యక్తపరుచుకోవజడం ముఖ్యం. మనసులో అనుభూతి చెందితే సరిపోదు. మాటలు, చిన్న చిన్న పనులు, చేష్టల ద్వారా ప్రేమను వ్యక్తపరచాలి. మీ భాగస్వామి మీ కోసం, కుటుంబం కోసం చేసిన పనిని ప్రశంసించడం, అభినందన, ధన్యవాదాలు, ప్రేమపూర్వకమైన హగ్‌ వంటివి సంబంధాన్ని బలపరుస్తాయి.

భావోద్వేగ భద్రత

ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి పునాది నమ్మకం. ఆ నమ్మకంతో భాగస్వాములు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, సలహాలను, సందేహాలను ఎలాంటి భయం లేదా సంకోచం లేకుండా పంచుకోగలగాలి. మీరు మీ భాగస్వామికి ప్రతి పరిస్థితిలోనూ అండగా ఉంటారనే నమ్మకాన్ని వారికి తెలియజేయాలి. అలాంటి బంధాలను మహిళలు ఎక్కువగా ఆశిస్తారు. భావోద్వేగ భద్రత, బహిరంగ సంభాషణ ద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. ఈ 5 రహస్యాలను పాటించినట్లయితే భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య బంధం సుదీర్ఘకాలం సంతోషంగా ఉంటుంది.

Story first published: Wednesday, July 22, 2026, 16:43 [IST]
Desktop Bottom Promotion