Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
పెళ్లైన, ప్రేమలో ఉన్న జంటలు ముద్దులు పెట్టుకోవడం ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? ఇది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
వివాహ బంధం, ప్రేమ బంధంలో ఉన్న వ్యక్తులు శృంగార బంధాన్ని కూడా కలిగి ఉంటారు. భాగస్వాములు, దంపతులు తమ ప్రేమను, సాన్నిహిత్యాన్ని వ్యక్తపరిచేందుకు ముద్దులు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే తమ ప్రేమను, సాన్నిహిత్యాన్ని సజీవంగా ఉంచేందుకు ముద్దులు ఎంతగానో ఉపయోగపడతాయి. ముద్దుల వల్ల ప్రేమ పెరగడం మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే దంపతులు లేదా భాగస్వాములు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం మానేసినప్పుడు అది వారి సంబంధాలపై ప్రతికూలత చూపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
అయితే దంపతులు లేదా ప్రేమికులు ముద్దులు పెట్టుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ముద్దులు ఆపేయడం వల్ల తమ సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మానసిక దూరం పెరుగుతుంది
ముద్దులు అనేది కేవలం శారీరక చర్య మాత్రమే కాదు. మానసిక చర్య కూడా. దంపతులు లేదా జంటలు ముద్దులు పెట్టుకోవడం మానేసినప్పుడు దంపతులు లేదా జంటల మధ్య మానసిక దూరం పెరుగుతుంది. ఫలితంగా దంపతుల మధ్య అపార్థాలు, అనుమానాలు, సమాచార లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒకరి భావాలను మరొకరు గుర్తించలేరు. ఇది వారి బంధం విడిపోవడానికి కూడా ఒక కారణంగా మారుతుంది.

ఆత్మీయత తగ్గుతుంది
శృంగార బంధం బలంగా ఉండాలన్నా, సానుకూలంగా సాగిపోవాలన్న ముద్దులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శృంగార బంధం మొదలయ్యేది కూడా ఈ ముద్దులతోనే. లైంగిక కోరికలను ప్రేరేపించడంతో పాటు శృంగార జీవితం సాఫీగా సాగేందుకు ముద్దే ప్రధానంగా పని చేస్తాయి. ఎప్పుడైతే జంటలు ముద్దులు పెట్టుకోవడం ఆపేస్తాయో తమ శారీరక బంధంలో గణనీయమైన మార్పులను గమనించొచ్చు.
అలాగే ముద్దులు లేకపోవడం వల్ల కౌగిలింతలు, చిలిపి చేష్టలు, చివరికి లైంగిక కార్యక్రమాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. లైంగిక కార్యక్రమాలు తగ్గిపోయినప్పుడు ఒక వ్యక్తిపై ప్రేమ అనురాగం కూడా తగ్గిపోతుంటాయి. ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గిపోవడంతో పాటు దంపతులు ఆ శృంగార బంధం కోసం మరొక వ్యక్తితో సంబంధాలు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది.
కమ్యూనికేషన్ తగ్గిపోతుంది
ముద్దు అనేది ప్రేమ వ్యక్తీకరణ మాత్రమే కాదు. ఒక కమ్యూనికేషన్ సాధనం కూడా. భాగస్వామిపై మీకు ఎంత ప్రేముందో ముద్దు ద్వారా తెలియజేయొచ్చు. అలాగే ఒకరి భావాలు, కోరికలు ఉద్దేశాలను ముద్దుల ద్వారా తెలియపరచొచ్చు. అయితే జంటలు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం మానేసినప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఒకరి విషయాలను ఇంకొకరు పంచుకునేది తగ్గిపోతుంది. ఇబ్బందులు లేదా కొన్ని సున్నితమైన విషయాలు కూడ పంచుకోలేకపోతారు. శృంగార బంధంలో ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పుకోలేకపోతారు.
ఆత్మగౌరవం కూడా తగ్గిపోతుంది
ముద్దు అనేది భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరచడమే కాదు, ఆత్మగౌరవం కూడా. జంటలు ముద్దు పెట్టుకోవడం మానేసినప్పుడు, అది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు మీ భాగస్వామికి ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది. ఇది వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ముద్దులు పెట్టుకోవడం ఆపేసినప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏ పనిని సరిగ్గా చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయి.
అవిశ్వాసం పెరుగుతుంది
వివాహ బంధంలో లేదా ప్రేమ బంధంలో అతిముఖ్యమైనది విశ్వాసం. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం ఉండకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు కూడా. అయితే ఎప్పుడైతే దంపతులు లేదా భాగస్వాములు ఇద్దరూ ముద్దులు పెట్టుకోవడం ఆపేస్తారో వారి మధ్య అవిశ్వాసం చిగురిస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానించడం పెరుగుతుంది. రహస్య సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
అందుకే దంపతులు అయినా ప్రేమ బంధంలో ఉన్న భాగస్వాములు అయినా ముద్దులు పెట్టుకోవడం చాలా మంచిది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను బలంగా ఉంచడంతో పాటు కఠినమైన సమయంలో బంధం విచ్చిన్నం కాకుండా, బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications











