Latest Updates
-
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే!
పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమవుతుంది? ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంటాయి?
ఈ సృష్టిలోని ప్రతి మహిళకు సాధారణంగా పీరియడ్స్ అవుతుంటాయి. గర్భధారణ కూడా సాధారణంగా ఆ మహిళ యొక్క పీరియడ్ సైకిల్ మీద ఆధాపడి ఉంటుంది. పీరియడ్ సైకిల్ సరిగ్గా ఉంటేనే ప్రెగ్నన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ అనేది మహిళ యొక్క పీరియడ్ సైకిల్ పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పీరియడ్ సమయంలో, పీరియడ్ తర్వాత లేదా ముందు కలిసే సందర్భంలో ఏ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. ప్రెగ్నెన్సీ కోసం ప్రణాళికలు చేసే వారు పీరియడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం అవసరం. అందుకే ఈ స్టోరీలో పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమవుతుంది? ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెంట్ అవుతారా లేదా అనేది తెలుసుకుందాం.
పీరియడ్ సైకిల్
పీరియడ్ సమయంలో గర్భసంచి లైనింగ్ బ్లీడింగ్ ద్వారా బయటకు వస్తుంది. అండాశయాల నుంచి అండం విడుదలైన తర్వాత పీరియడ్ మొదలవుతుంది. ఈ సమయంలో విడుదలైన అండం గర్భసంచి ట్యూబ్ దగ్గర ఎదురు చూస్తుంది. అటు వైపు, పురుషుని స్పెర్మ్ కణాలు ఉంటే, అండంతో ఫలదీకరణం జరగుతుంది, తద్వారా ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. కాకపోతే, అండం విడుదలైన తర్వాత పీరియడ్ రూపంలో బ్లీడింగ్ జరిగి బయటకి వస్తుంది.

పీరియడ్ వచ్చిన 15 రోజులకు ముందు అండం విడుదల అవుతుంది. అంటే, మీరు నెలవారీ పీరియడ్ వచ్చినా లేదా 45 రోజులకు వచ్చినా, అండం విడుదల 15 రోజులకు ముందు జరుగుతుంది. అండం విడుదలయ్యే రోజున లేదా 14, 15 రోజుల్లో పీరియడ్ మొదలవుతుంది.
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు
ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే సమయంలో, పీరియడ్‌కు ముందు లేదా తరువాత కలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం అవసరం.
పీరియడ్ ముందు కలిస్తే: పీరియడ్ వచ్చే 4-5 రోజుల ముందు, స్పెర్మ్ కణాలు మహిళ శరీరంలో 3-4 రోజులు జీవించగలవు. అండం విడుదలైన 3-4 రోజుల ముందు లేదా తర్వాత కలిస్తే, ప్రెగ్నెన్సీ జరిగే అవకాశం ఎక్కువ. అయితే, పీరియడ్‌కి ఒకటి లేదా రెండు రోజులు ముందు కలిస్తే, అండం చాలా ఆవశ్యకమైన సమయంలో విడుదల అయ్యే అవకాశం లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాబోదు.
పీరియడ్ సమయంలో కలిస్తే: పీరియడ్ సమయంలో గర్భసంచి లైనింగ్ బయటకి వెళ్లిపోతుంది, కాబట్టి గర్భసంచి ప్రెగ్నెన్సీకి సిద్ధంగా ఉండదు. పీరియడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
పీరియడ్ పూర్తయిన వెంటనే కలిస్తే: పీరియడ్ ముగిసిన వెంటనే కలిస్తే కూడా ప్రెగ్నెన్సీ రావడం చాలా తక్కువ. ఎందుకంటే ఈ సమయంలో శరీరం తదుపరి సైకిల్ కోసం అండం విడుదల చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. అప్పుడు అండం చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువ.
సరైన సమయం
ప్రీగ్నెన్సీ పొందాలంటే, అండం విడుదలకు 4 రోజుల ముందు లేదా అండం విడుదలైన రోజు, లేదా అండం విడుదలైన 4 రోజులు తర్వాత కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే.. అండం విడుదలకు 4-5 రోజుల ముందు లేదా తరువాత కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పీరియడ్ సమయంలో, ముందు లేదా తరువాత కలిస్తే అవకాశాలు తక్కువ.



Click it and Unblock the Notifications