Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మగవారి సెక్స్ జీవితాన్ని ఇవి చాలా ప్రభావితం చేస్తాయి!
శృంగారం ఓ మధురమైన అనుభూతి. స్త్రీలైనా, పురుషులు అయినా వారి వారి జీవితాల్లో శృంగారానికి చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. దాంపత్య సంబంధానికి లైంగిక జీవితమే అత్యంత కీలకం. మానసికంగా, శారీరకంగా పెనవేసుకుపోయి ఊసులాడుకోవడమే శృంగారం. అలాంటి సెక్స్‌ను ఎంజాయ్ చేయాలంటే దంపతులు ఇద్దరూ అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాల్సిందే.
కొన్ని సార్లు పురుషులు లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. భార్య లేదా ప్రియురాలు ఆశగా దగ్గరికి వచ్చినా, రొమాన్స్ చేస్తున్నా పట్టించుకోరు. వారి జీవితంలో ఎదురయ్యే కొన్ని అంశాలపై మగవారి సెక్స్ లైఫ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అవేంటో.. వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కోపం:
కోపం లైంగిక జీవితంలో చాలా సమస్యలను సృష్టిస్తుంది. కోపాన్ని నియంత్రించడం ప్రారంభించిన తర్వాత లైంగిక జీవితం మెరుగుపడటాన్ని స్పష్టంగా గమనించవచ్చు. కోపం వస్తే దాంతో పాటు ఒత్తిడి కూడా వస్తుంది. శారీరక ఆరోగ్యానికి అయినా, లైంగిక ఆరోగ్యానికి అయినా ఒత్తిడి అతిపెద్ద శత్రువు. కోపాన్ని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాధన చేయండి. ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి చాలా బాగా ఉపయోగపడతాయి.
2. అశ్లీల వీడియోలు:
అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తూ వాటికి అలవాటు పడిపోయిన వ్యక్తులు నిజజీవితంలో సుఖంగా ఉండలేరు. ఎప్పుడో ఒకప్పుడు పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకునే వరకు పర్లేదు. కానీ, అదే అలవాటుగా మారితే మాత్రం దాంపత్య జీవితంలో అసంతృప్తి మొదలవుతుంది. అశ్లీల వీడియోల్లో కనిపించేది వేరు, నిజజీవితంలో జరిగేది వేరు. ఆ తేడాను గుర్తించగలగడం చాలా ముఖ్యం.
3. కమ్యూనికేషన్:
భాగస్వామితో కమ్యూనికేషన్ లైంగిక జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. లైంగిక దృఢత్ం గల వ్యక్తులు వారి లైంగిక జీవితానికి సంబంధించి మెరుగన అనుభవాన్ని పొందుతారు. మంచి కమ్యూనికేషన్ తో ప్రేమ సంబంధం మెరుగుపడుతుంది లైంగిక చర్యల్లో సంతృప్తి లభిస్తుంది. పడగ్గదిలో మీకేం కావాలో చెప్పగలగడం, వారికి ఏం కావాలో తెలుసుకుని ఇవ్వడం చాలా ముఖ్యం. సెక్స్ లో కోరికలు నెరవేరకపోతే అది అసంతృప్తిని కలిగిస్తుంది.
4. సెక్స్ ఫ్రీక్వెన్సీ:
సెక్స్ ఫ్రీక్వెన్సీ లైంగిక సుఖానికి చాలా కీలకం. నెలకు ఒకసారి శృంగారం చేసుకోవడం వల్ల దానిలోని ఆనందాన్ని ఆస్వాదించలేరు. అందుకే తరచూ సెక్స్ లో పాల్గొనాలని వైద్యులు సూచిస్తుంటారు. వారానికి 2, 3 సార్లు సెక్స్ చేసుకునే జంటలతో పోలిస్తే నెలకోసారి సెక్స్ చేసుకునే జంటల మధ్య గొడవలు, అపార్థాలు, కలహాలు ఎక్కువ ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.
5. ఆత్మగౌరవం:
దంపతుల మధ్య తప్పకుండా ఇచ్చిపుచ్చుకోవాల్సింది ఆత్మగౌరవం. హేళన తరహా మాటలతో మనసు గాయపడుతుంది. కాబట్టి గౌరవించండి, గౌరవం తీసుకోండి. సెక్స్ చేసే సమయంలో కూడా సూటిపోటి మాటలు, హేళన చేయడం వల్ల మూడ్ పోతుంది. అది అసంతృప్తికి దారి తీస్తుంది. పడగ్గదిలో అయినా ఇంకెక్కడైనా ఆత్మగౌరవం దెబ్బతినకుండా వ్యవహరించాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications