Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇండియాలో సిచ్యుయేషన్‌షిప్ ట్రెండ్.. శృంగార కోరికలు తీర్చేసి వెళ్ళిపోవడమే!
రోజులు మారుతున్న కొద్దీ ప్రజల్లో మార్పులు వస్తున్నాయి. ఒకరితో ఇంకొకరు ఏర్పరుచుకుంటున్న బంధాలు కూడా మారిపోతున్నాయి. మనసుల స్వభావాలు మారేకొద్దీ కొత్త కొత్త బంధాలు తెరమీదకు వస్తున్నాయి. అలాంటి వాటిలో సిచ్యుయేషన్‌షిప్ కూడా ఒకటి. ఈ మధ్యలో ఈ సిచ్యుయేషన్‌షిప్‌కు సంబంధించిన బంధాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ సిచ్యుయేషన్‌షిప్ అంటే ఏంటి? ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం.
సిచ్యుయేషన్‌షిప్ అంటే ఏమిటి?
సాధారణంగా ప్రతి బంధంలో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటామనే నమ్మకాన్ని కలిగిస్తుంటారు. అయితే సిచ్యుయేషన్‌షిప్‌లో అది ఉండదు. కేవలం రొమాంటిక్ రేలషన్‌షిప్ అని చెప్పుకోవచ్చు. కమిట్మెంట్స్, ఎమోషనల్ బాండింగ్ అనేది ఏవీ లేకుండా కేవలం రొమాంటిక్ కోరికలను తీరుచుకోవడానికి సిచ్యుయేషన్‌షిప్‌ను వినియోగిస్తారు. దీన్నే సిచ్యుయేషన్‌షిప్ అని పిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువ అవుతుంది.

ఎలాంటి హద్దులు ఉంటాయంటే
ఎవరైతే సిచ్యుయేషన్‌షిప్‌లో ఉంటారో వారు, తమ భాగస్వామిని భాగస్వామి అని చెప్పుకోరు. వారికి ప్రేయసి, ప్రియుడు అనే పేర్లు కూడా ఉండవు. వారు ఎలా ఉన్నా పట్టించుకోరు. వారితో ఎలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ కూడా ఉండవు. సిచ్యుయేషన్ ఆధారంగా వారితో ఉండాలి అంతే. ఈ సిచ్యుయేషన్‌షిప్‌లో ఒకరికి ఒకరు కొన్ని ప్రత్యేకమైన, కొన్ని పర్సనల్ హద్దులను పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వాటిని దాటకూడదు. ఎదుటి వ్యక్తి అవసరాలు, హద్దులను గౌరవించి ముందుకు సాగాలి. వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడకూడదు.
ఒప్పందాలు ఉంటాయా?
ఈ సిచ్యుయేషన్‌షిప్‌లో ఎలాంటి ఒప్పందాలు ఉండవు. కేవలం తాము ఎలాంటి ఒప్పందాల్లో లేమనే ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఎమోషనల్‌గా కూడా వీరు కనెక్ట్ అవ్వరు. సాధారణంగా శారీరకంగా కలిసిన ప్రతి మనిషి ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతారు. అయితే ఈ సిచ్యుయేషన్‌షిప్‌లో మాత్రం అది ఉండదు. తమ కోరికలను తమ అవసరాలను, తమ ఇష్టాలను ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఎవరూ అడ్డు చెప్పకూడదు.
ఒక్క మాటలో చెప్పాలంటే శరీరానికి కావాల్సిన సుఖాలను ఎలాంటి నియమ నిబంధనలు, అటాచ్మెంట్స్, కమిట్మెంట్స్ లేకుండా తీర్చుకోవడమే. ఇదే సిచ్యుయేషన్‌షిప్ అంటే. మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే ఇది విస్తరిస్తోంది. దీని వల్ల బంధం అనే పదానికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే పెళ్లిళ్లు చేసుకునే వారు ఉంటారో లేదో చూడాలి.



Click it and Unblock the Notifications