For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Roommate Syndrome: రూమ్‌మేట్ సిండ్రోమ్ అంటే ఏంటి? దాంపత్యబంధంలో సాన్నిహిత్యం పెంచడం ఎలా?

|

Roommate Syndrome: సంబంధంలో సాన్నిహిత్యం చాలా ముఖ్యం. దాంపత్య జీవితాన్ని కలకాలం ఉండేలా చేసేది సాన్నిహిత్యమే. దాంపత్య జీవితంలో మొదట్లో ఉన్న ఆకర్షణ, ప్రేమ, ఇష్టం, వ్యామోహం రోజులు గడిచే కొద్దీ తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రతి ఒక్క దాంపత్య జీవితంలో జరిగేదే.

దాంపత్య జీవితంలో మొదట్లో ఉండే ఇష్టం ఆ బంధం పాతబడే కొద్దీ తగ్గుతుంది. దీనినే రూమ్ మేట్ సిండ్రోమ్ గా వ్యవహరించవచ్చు.

రూమ్‌మేట్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

రూమ్‌మేట్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎమోషనల్ గా దూరం అవుతారు. అభిరుచి లేకుండా పోవడాన్ని రూమ్‌మేట్ సిండ్రోమ్ గా వ్యవహరిస్తారు మానసిక నిపుణులు. కొత్తదనం, ఉత్సుకత, అభిరుచి అన్నీ రొటీన్ గా మారతాయి. భాగస్వామి పట్ల మొదట్లో ఉన్న ఆసక్తి ఉండదు. చాలా మంది రూమ్‌మేట్ సిండ్రోమ్ ను కేవలం దాంపత్య జీవితంలో సెక్స్‌ లేకపోవడంగా పరిగణిస్తారు. కానీ రూమ్‌మేట్ సిండ్రోమ్ అంటే దాంపత్యంలో అభిరుచి లేకపోవడం.

రూమ్‌మేట్ సిండ్రోమ్‌కు కారణమేమిటి?

రూమ్‌మేట్ సిండ్రోమ్‌కు కారణమేమిటి?

లక్ష్యం, భవిష్యత్తుపై దృష్టి, ప్రాధాన్యత లేకపోవడం. పెళ్లి అయ్యాక సంవత్సరానికో, రెండేళ్లకో పిల్లలు కలుగుతారు. బాధ్యతలు మీద పడతాయి. వయసు పైబడుతున్న తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉంటుంది. కెరీర్ లక్ష్యాలు ఉంటాయి, సామాజిక మరియు ఆధ్యాత్మిక కట్టుబాట్లు ఏర్పడతాయి. ఇలాంటి ఒత్తిడిల వల్ల దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం తగ్గుతుంది. మొదట్లో ఉన్న కొత్త దనం ఉండదు. ఇది క్రమంగా పెరిగి పెద్దది అవుతుంది. అది రూమ్‌మేట్ సిండ్రోమ్ గా అభివృద్ధి చెందుతుంది.

రూమ్‌మేట్ సిండ్రోమ్ ఉందో లేదో ఇలా తెలుసుకోండి

రూమ్‌మేట్ సిండ్రోమ్ ఉందో లేదో ఇలా తెలుసుకోండి

* రూమ్‌మేట్ సిండ్రోమ్ మీ సంబంధంలోకి చొరబడుతుందా?

* మీరు మీ భాగస్వామి నుండి మానసికంగా దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారా?

* మీరు సమాంతర జీవితాలను గడుపుతున్నారా?

* మీరు ప్రత్యేక బెడ్లపై పడుకుంటున్నారా?

* పిల్లలు, పని మొదలైన వాటి గురించి కాకుండా మీ గురించి మీరు సాన్నిహిత్యంగా ఎప్పుడు మాట్లాడారు?

* మీ సంబంధం బోర్ కొడుతోందా?

* ఏదైనా విషయాన్ని పంచుకోవాలనుకుంటే భాగస్వామి కాకుండే వేరే వారు గుర్తుకొస్తున్నారా?

రూమ్‌మేట్ సిండ్రోమ్‌ నుండి ఎలా బయటపడాలి?

రూమ్‌మేట్ సిండ్రోమ్‌ నుండి ఎలా బయటపడాలి?

1. మీ మధ్య సాన్నిహిత్యం ఎందుకు దూరం అయిందో తెలుసుకోవాలి.

ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం మొదట చేయాల్సిన అంశం. సాన్నిహిత్యం తిరిగి రావడం కోసం ఏం చేయాలో చర్చించుకోవాలి. చాలా సమస్యలు మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అవుతాయని గుర్తుంచుకోవాలి.

2. రొటీన్ జీవితం నుండి బయటకు రావాలి. కొత్తగా ఏదైనా ట్రై

చేయండి. మీ ఇద్దరికి ఇష్టమైన పనులు ఏవో ఒక జాబితా తయారు చేసి వాటిని చేసేందుకు సమయం వెచ్చించండి. మొదట చిన్నగా ప్రారంభించండి. మీ భాగస్వామితో సమయం గడపండి.

3. బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి

మీకు ఇష్టమైన జ్ఞాపకాలను కలిగి ఉన్న భౌతిక ప్రదేశాన్ని తిరిగి సందర్శించడం అనేది మీ సంబంధంలో ఒకప్పుడు స్పార్క్ అనిపించిన సమయానికి తిరిగి రావడానికి మరొక మార్గం. ఆ ప్రదేశానికి తిరిగి రావడం ద్వారా మరియు ఆ సానుకూల అనుభవాలను గుర్తుంచుకోవడం ద్వారా, మీరు నిజంగా ఏమి జరిగిందో మీ మనస్సు మరియు హృదయంలో తిరిగి పొందవచ్చు.

4. మీ సెక్స్ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి

రూమ్‌మేట్ సిండ్రోమ్ వల్ల దాంపత్య జీవితంలో శృంగారానికి దూరం అవుతారు. సెక్స్ కు దూరం కావడం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిని శృంగారానికి ప్రేరేపించండి.

5. ప్రశంసించడం మర్చిపోవద్దు

బంధం, ప్రశంస చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదైనా చిన్న పని అయినా పర్లేదు.. మీ భాగస్వామిని ప్రశంసించండి. వారు మీకిష్టమైన కర్రీ చేస్తేనే, లేదా ఏదైనా పని మీకు నచ్చేలా చేస్తేనో వారికి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. దాని ద్వారా సాన్నిహిత్యం పెరుగుతుంది.

6. సర్ ప్రైజ్ లు ఇవ్వాలి

ఊహించని మరియు అసాధారణమైన పనిని చేయడం మార్పులేనితనాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మీరు అతని లేదా ఆమె గురించి ఆలోచిస్తున్నట్లు మీ ముఖ్యమైన వ్యక్తిని చూపించడానికి సరైన మార్గం. సర్ ప్రైజ్ లు ఊహించని విధంగా ఉంటుంది కాబట్టి వారిలో మంచి భానలను కలిగిస్తుంది.

Read more about: roommate syndrome
English summary

What is roommate syndrome? How to increase intimacy in couples in Telugu

read on to know What is roommate syndrome? How to increase intimacy in couples in Telugu
Story first published:Tuesday, September 27, 2022, 12:46 [IST]
Desktop Bottom Promotion