Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
సెక్స్ అంటే ఇంట్రెస్ట్ రావట్లేదా? అసహ్యం వేస్తోందా? మీకు ఈ సమస్య ఉందేమో!
సెక్స్ అంటే ఇష్టపడే వాళ్లను మనం చాలా మందినే చూసుంటాం. తమకు నచ్చిన వారితో ఏకంతంగా కలవడానికి ఎంతగానో ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా కొంత మంది సెక్స్ అంటేనే భయపడిపోతుంటారు. అసలు సెక్స్ అనే పదం వింటేనే పైన పాములు జెర్రిలు పాకినట్లుగా భావిస్తుంటారు.
ఎవరైనా తమను తాకుతారేమోనని చాలా భయపడిపోతుంటారు కూడా. అయితే ఇది కూడా ఓ సమస్యే. దీనిని సెక్సువల్ అనోరెక్సియా అంటారు. అధికారికంగా ఈ రోగ నిర్ధారణ జరగకపోయినప్పటికీ.. ఓ ప్రముఖ వైద్య నిపుణుడు ఈ సమస్యకు ఈ పేరు పెట్టారు.

లైంగిక అనోరెక్సియా అనే పదాన్ని ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ పాట్రిక్ కార్నెస్ రూపొందించారు. అనోరెక్సియా అనే పదానికి ఆకలి లేకుండా అనే అర్థం వస్తుంది. కాబ్టి లైంగిక అనోరెక్సియా అంటే లైంగిక ఆకలి లేకపోవడం అనే అర్థం వస్తుందని ఈ పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు.
లైంగిక అనోరెక్సియా, లైంగిక వ్యసనం రెండింటికీ చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఈ రెండింటి వల్ల మనిషికి చాలా ప్రమాదం. ఈ రెండు సమస్యలు కూడా మిమ్మల్ని శక్తిహీనులుగా చేస్తాయి. మీ జీవితంలోని ప్రతీ అంశంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
చాలా మంది శారీరక సమస్యలను పట్టించుకున్నంతగా లైంగిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కానీ మనం ఇలాంటి సమస్యలను పట్టించుకోకపోతే జీవితమే నాశనం అయిపోతుంటుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, దగ్గరి వాళ్లో, బంధువుళ్లోనే ఇలాంటి సమస్యలు ఉంటే గుర్తించడం చాలా ముఖ్యం. ఒకవేళ వారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మీకనిపిస్తే.. దాన్ని నివారించేందుకు కృషి చేయాలి.
లైంగిక అనోరెక్సియా అంటే ఏమిటి?:
మీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి మీలో లైంగిక అనోరెక్సియా ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచి సెక్స్ అనేది పాపం అనే ఆలోచనతో ఉంటే మీరు పెద్దయ్యాక కూడా శృంగారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కేవలం ఇదే కాకుండా లైంగిక వేధింపులు, లైంగిక తిరస్కరణ, చిన్నప్పటి నిర్లక్ష్యం, ఇతర గాయాల కారణంగా కొంతమంది సెక్స్ కు దూరంగా ఉంటారు.
బలవంతంగా లైంగిక వాంఛలను మనసులోంచి తొలగించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనుషులకు ఆకలి అనేది ఎంత సహజమో లైంగిక వాంఛ కూడా అంతే సహజం. ప్రతి ఒక మనిషి దీన్ని ఎక్స్ పీరియన్స్ చేస్తుంటాడు.
లైంగిక అనోరెక్సియా యొక్క లక్షణాలు:
* లైంగిక కార్యకలాపాలను అవాయిడ్ చేయడం
* ఇతరులతో సన్నిహితంగా ఉండటానికి భయపడటం
* సెక్స్ గురించి అబ్సెసివ్ ఆలోచనలు
* లైంగిక కోరిక లేకపోవడం
* సన్నిహితంగా ఉండటానికి భయపడటం
* దాంపత్యంలో ఒత్తిడి, నిరాశ, ఆందోళన
లైంగిక అనోరెక్సియాకు కారణాలు:
* లైంగిక గాయాలు
* గత అనుభవాలు
* సెక్స్ గురించి ప్రతికూల నమ్మకాలు
* సన్నిహిత సంబంధం లేకుండా సెక్స్
* భావోద్వేగంగా కనెక్ట్ కాకుండా సెక్స్ చేయడం
* మానసిక ఆరోగ్య పరిస్థితులు
* డ్రగ్స్, ఆల్కహాల్ కు వ్యసనం కావడం
* హార్మోన్ల అసమతుల్యతలు



Click it and Unblock the Notifications