Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిమ్మర్ డేటింగ్ ఇష్టపడుతున్న GenZ అమ్మాయిలు.. కేవలం శృంగారం మాత్రమే!.. అమ్మాయిలను ఎలా కలవాలంటే?
కాలం మారిపోయింది. కాలం మారిన కొద్దీ ప్రేమించుకునే విధానం కూడా మారిపోతుంది. డేటింగ్ పేరుతో రకరకాలుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో పెద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లు చేసుకునే వారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇలా ప్రేమించుకునే విధానాన్ని తమకు ఇష్టమొచ్చినట్లు మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ ఉద్భవించింది. అదే సిమ్మర్ డేటింగ్. జనరేషన్ జెడ్ వాళ్ళు దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సిమ్మర్ డేటింగ్ అంటే?
ఈ డేటింగ్ విధానాన్ని జనరేషన్ జెడ్ వాళ్ళు ఎక్కువగా పాటిస్తుంటారు. జనరేషన్ జెడ్ అంటే 1996 నుంచి 2012 మధ్య జన్మించిన వారు అని అర్ధం. సిమ్మర్ డేటింగ్ అంటే కలవరు, కానీ కలిసే ఉంటారు అనే అర్ధం వచ్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లాంగ్ డిస్టెన్స్ రేలషన్‌షిప్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా జనరేషన్ జెడ్‌లో ఉన్న వ్యక్తులు తమ బంధంలో నిదానంగా అడుగుపెడతారు.

కాలక్రమేణా తమ బంధం బలపడేలా చూసుకుంటున్నారు. వీరు లైంగిక పద్ధతులకు కూడా చాలా నిదానంగా అలవాటు పడుతున్నారు. శారీరక బంధం కూడా నిబద్ధతతో ఉండే విధంగా చూసుకుంటున్నారు. సిమ్మర్ డేటింగ్‌లో కూడా అదే ఫాలో అవుతున్నారు. నెమ్మదిగా తమ భాగస్వామితో బంధంలోకి అడుగుపెడతారు. లైంగిక బంధంలోకి కూడా నిదానంగా అడుగుపెట్టి కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. దూరంగా ఉన్నా ఇద్దరూ కలిసే ఉంటారు.
ఇలా చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడంతో వారిపై ఎలాంటి అసంతృప్తి కలగదట. లైంగికంగా కూడా ఒకరినొకరు అర్ధం చేసుకుంటారని చెబుతుంటారు. సిమ్మర్ డేటింగ్‌లో కాలక్రమేణా నమ్మకం, ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది. అలాగే బంధం లోతు నుంచి బలపడేందుకు సహాయపడుతుంది. అందుకే జనరేషన్ జెడ్ వాళ్ళు సిమ్మర్ డేటింగ్ విధానాన్ని పాటిస్తున్నారు. మిగతా డేటింగ్ విధాలన్నిటినీ వదిలేస్తున్నారు.
ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి?
ఇప్పటి వరకు నాలుగు జనరేషన్స్ ఉన్నాయి. 1965 నుంచి 1984 మధ్య పుట్టిన వ్యక్తులను జనరేషన్ ఎక్స్ అని, 1985 నుంచి 1995 మధ్య పుట్టిన వ్యక్తులను జనరేషన్ వై అని, 1996 నుంచి 2012 మధ్య పుట్టిన వ్యక్తులను జనరేషన్ జెడ్‌కు చెందిన వారీగా పరిగణిస్తున్నారు. 2013 నుంచి 2020 మధ్య పుట్టిన వ్యక్తులను జనరేషన్ ఆల్ఫా అని, 2020 నుంచి ఇప్పుడు వరకు పుట్టిన వ్యక్తులను జనరేషన్ బీటాకు చెందిన వారీగా చెప్పుకుంటున్నారు.



Click it and Unblock the Notifications