Latest Updates
-
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం
Sleep Divorce: స్లీప్ డైవర్స్ అంటే ఏంటి? దంపతులు విడివిడిగా నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా?
దంపతుల్లో భార్యాభర్తలకు నిద్ర పోయే అలవాట్లు వేర్వేరుగా ఉండొచ్చు. ఒకరు త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. మరొకరికి చాలా సమయం పట్టొచ్చు. ఒకరికి వాటేసుకుని పడుకోవడం ఇష్టం ఉండొచ్చు, మరొకరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. ఒకరు నిద్రలో గురక పెట్టడం లాంటి వాటి వల్ల మరికొరి నిద్రకు భంగం కలగొచ్చు. ఇలాంటి వాటి వల్ల నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు అసౌకర్యానికి గురై కోపం రావొచ్చు.
ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం దంపతులు వేర్వేరుగా పడుకోవడం. భార్యాభర్తలు వేర్వేరుగా పడుకోవడం ఏంటి అనిపించవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. రోజంతా ఎవరికి పనుల్లో వారు బిజీగా ఉండి, కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యి రాత్రి వేళ నాణ్యమైన విశ్రాంతి కోసం మంచి నిద్ర కావాల్సిందే. అలాంటి వారికి స్లీప్ డైవర్స్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

స్లీప్ డైవర్స్ అంటే ఏంటి?
స్లీప్ డైవర్స్ అంటే దంపతులు వేర్వేరు పడకగదుల్లో పడుకోవడం. విపరీతమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో కొంత కాలంపాటు స్లీప్ డైవర్స్ పద్ధతి పాటించవచ్చు. దీని వల్ల ఒకరి నిద్ర అలవాట్ల వల్ల మరొకరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో గొడవలకంటే ఈ స్లీప్ డైవర్స్ పాటించడం మంచిది.
స్లీప్ డైవర్స్ ప్రయోజనాలు
1. పర్సనల్ స్పేస్, ప్రైవసీ:
తనతో తాను సమయం గడపడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇద్దరి మధ్య బంధం బలపడటానికి కూడా పర్సనల్ స్పేస్ మరింత ఉపయోగపడుతుంది. ఇలా కొంచెం సమయాన్ని తమ కోసం తాము ఉపయోగించుకోవడం వల్ల తమ ఇష్టాలు, ఆసక్తులను పెంపొందించుకోవచ్చు. ఇది వారి వ్యక్తిగత గుర్తింపును చెక్కు చెదరకుండా కాపాడుతుంది.
2. బ్రేకులు లేని మెరుగైన నిద్ర:
భాగస్వాములు ఇద్దరూ ఒకే బెడ్ పై పడుకోవడం వల్ల నిద్రాభంగం కల్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురక, బ్లాంకెట్ లాక్కోవడం, నిద్ర వేళల్లో షెడ్యూల్స్, సాన్నిహిత్యంతో మిమ్మల్ని హత్తుకొని పడుకోవడం వంటి వాటి వల్ల నిద్రాభంగం కల్గుతుంటుంది. ఒకసారి మెలుకువ వస్తే మళ్లీ నిద్ర కూడా పట్టకపోవచ్చు. అందువల్ల విడి విడిగా పడుకోవడం వల్ల భాగస్వాములు ఇద్దరూ తగినంత నిద్ర పోవచ్చు.
3. సౌకర్యవంతమైన నిత్యకృత్యాలు:
రోజూ వారి దినచర్యల్లో.. నిద్ర వేళలు కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి వేర్వేరు పడకల్లో పడుకోవడం వల్ల తమ నిత్యకృత్యాలను తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇద్దరూ ఒకేసారి ఇది చేయాలి, అది చేయాలనే నియమం ఉండదు.
4. భాగస్వాములు తక్కువగా వాదించుకునే అకాశం:
నిద్ర సరిపోని జంటల్లో ఎక్కువగా విభేదాలు వస్తుంటాయి. వారు తరచుగా నిద్ర సరిపోక ఒకరిపై ఒకరు అరుచుకోవడం, వాదించుకోవడం వంటివి చేస్తుంటారు. సమస్యలను తీర్చుకోవడం కాకుండా మరింత ఎక్కువ చేసుకుంటారు. అందువల్లో ప్రత్యేక పడకల్లో నిద్రించడం వల్ల కొన్ని వివాదాలు తగ్గించుకోవచ్చు. పూర్తి నిద్రను ఆస్వాదించి ఏదైనా సమస్య ఉంటే తీర్చుకోవచ్చు.



Click it and Unblock the Notifications