Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శృంగారంలో సరికొత్త ట్రెండ్, అలాంటి అబ్బాయిలు, అమ్మాయిలకు ఇది వరం లాంటిది
రోజురోజూ లోకం మారుతుంది. లోకం ఆలోచిస్తున్న తీరు మారుతుంది. ప్రజలు మారుతున్నారు. వారి జీవన విధానంతో పాటు ఆలోచన విధానం కూడా మారిపోతుంది. కాలానికి అనుగుణంగా చాలా మంది స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు. పెళ్లి, ప్రేమ అనే బంధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఇలా చాలా మంది యువత అనుకోవడం వలన కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. అలాంటి ట్రెండ్ గురించి ఈరోజు ఈ స్టోరీలో చెప్పబోతున్నాం. ఈ స్టోరీని పూర్తిగా చదివి దాని గురించి తెలుసుకోండి.
సోలో పాలియోమరీ
సోలో పాలియోమరీ అనేది ఒక కొత్త ట్రెండ్. ఇది ఎవరైతే వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారో వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఒక వ్యక్తి యొక్క స్వాతంత్రాన్ని ప్రాధాన్యతనిస్తూ.. వేరే వ్యక్తితో సన్నిహితమైన సంబంధాలు పెట్టుకునేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామితో సహజీవనం చేయరు. తన భాగస్వామితో ఆర్థిక బాధ్యతలు పంచుకోకుండా, పెళ్లి సంబంధాల వంటి సంప్రదాయ లక్ష్యాలను అనుసరించకుండానే ప్రేమ, రొమాన్స్‌పై దృష్టి పెడతారు.

ఇది తాత్కాలికంగా ఉండొచ్చు, కావాలనుకుంటే శాశ్వతంగానైనా ఉండొచ్చు. కానీ ఈ బంధంలో ప్రేమ, నిబద్ధత, స్వతంత్రం వంటి వాటిని కేవలం తమకు తామే నిర్వచించుకోగలరు. ఎదుటి వ్యక్తితో సంబంధం లేకుండా, మనకు కావాల్సిన వాటికోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇది సాంప్రదాయ పరిమితులను అనుసరించి, సంబంధాలను ఒక దృక్పథంతో చూసేలా చేస్తుంది.
ఈ ట్రెండ్‌ను మహిళలు ఎందుకు ఎక్కువగా అనుసరిస్తున్నారు?
సంప్రదాయ పెళ్లి వ్యవహారంలో మహిళలు ప్రధానంగా తమ స్వతంత్రతను కోల్పోతారు. దీంతో, ఇటీవల కొందరు మహిళలు పెళ్లి వ్యవహారాన్ని విస్మరించడమే కాకుండా, దాని నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా, శాడిస్ట్ భర్తలున్నప్పుడు అణచివేత, బాధ్యతలు అసహ్యంగా అనిపిస్తాయి. ఈ క్రమంలో స్వేచ్ఛ కోసం మహిళలు ఇలాంటి ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నారు.
తగ్గిన పెళ్లిళ్లు
2020లో జరిగిన ఒక అధ్యయన ప్రకారం, 32 దేశాలలో పెళ్లి రేట్లు 20 శాతం తగ్గాయని తేలింది. బ్లూమ్ సర్వే కూడా ఇదే విషయాన్ని అంగీకరించింది. మహిళలలో ఆర్థిక, భావోద్వేగ, లైంగిక స్వేచ్ఛ పెరగడంతో, వారి జీవితాల్లో నిబద్ధతపై కొత్త దృక్పథం వస్తోంది. ఈ పరిణామం వల్ల, సోలో పాలియోమరీ ట్రెండ్ ద్వారా ప్రేమ, స్వతంత్రత సమతుల్యాన్ని పొందడమే కాకుండా, కొత్త జీవనశైలి అనుభవించే అవకాశాన్ని కూడా ఇస్తుంది.
సోలో పాలియోమరీ ప్రతి ఒక్కరికీ అనువుగా ఉండకపోవచ్చు, కానీ మీరు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రాధాన్యం ఇచ్చి, ఎలాంటి ఇబ్బందులు లేని సంబంధాల్లో ఉండాలనుకుంటే ఇది మీకు సరిపోవచ్చు.



Click it and Unblock the Notifications