Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మగవారిలో శృంగార సామర్త్యాన్ని డిసైడ్ చేసేది ఇదే.. ఇది తక్కువగా ఉంటే, పని చేయలేరు!
మనిషి యొక్క రిప్రొడక్టివ్ హెల్త్‌కి టెస్టోస్టెరాన్ అనేది అత్యంత ముఖ్యమైన హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ అణా హార్మోన్ అత్యధికంగా పురుషుల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. స్త్రీలలో కూడా ఇది కొద్దీ మొత్తంలో కనిపిస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో.. పురుషులు తమ పెళ్ళికి ముందే తమలోని టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోవాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది దాని గురించి వెతకడం ప్రారంభించారు. టెస్టోస్టెరాన్ ఎలా పెంచుకోవాలి? అది తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? అవి ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుంది? అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ స్టోరీలో టెస్టోస్టెరాన్ అంటే ఏమిటి? దానితో ఎలాంటి లాభాలు, ఎలాంటి దుష్ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
టెస్టోస్టెరాన్ టెస్ట్ అంటే ఏమిటి?
టెస్టోస్టెరాన్ స్థాయిని పరీక్షించడానికి చేయబడే టెస్ట్‌నే టెస్టోస్టెరాన్ టెస్ట్ అంటారు. ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే చేయబడుతుంది. చాలా మంది దీనిని స్పెర్మ్ టెస్ట్ అని వేరుగా భావిస్తారు, కానీ నిజానికి ఇది రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను కొలిచే పరీక్ష. ఈ టెస్ట్ సాధారణంగా ఉదయం 7 నుండి 10 గంటల మధ్య చేయించడం ఉత్తమం, ఎందుకంటే ఈ సమయాల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు అత్యధికంగా ఉంటాయి.

టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎంత ఉండాలి?
మగవారిలో: టెస్టోస్టెరాన్ స్థాయిలు సాధారణంగా 300-1,000 ng/dL మధ్య ఉండాలి.
ఆడవారిలో: ఇది 15-70 ng/dL మధ్య ఉండాలి.
టెస్టోస్టెరాన్ టెస్ట్ ఎందుకు చేస్తారు?
టెస్టోస్టెరాన్ స్థాయిలు చూసేందుకు ఈ టెస్ట్ చాలా ముఖ్యమైనది. దీని ద్వారా కొన్ని సమస్యలు గుర్తించవచ్చు:
లైంగిక సామర్థ్యం: స్త్రీలు మరియు మగవారిలో లైంగిక సామర్థ్యాల గురించి తెలుసుకోవడానికి దీనిని చేస్తారు. అలాగే శృంగార జీవితంలో మార్పులు, ఫెర్టిలిటీ సమస్యలను ఇది గుర్తించగలదు. దీని ద్వారా ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో, వారికి ఎందుకు పుట్టడం లేదో తెలుసుకోవచ్చు.
హైపోగోనాడిజం: తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉండటం వలన హైపోగోనాడిజం అనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది శరీరంలో శృంగార డ్రైవ్ తగ్గడం, అలసట, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి లక్షణాలను కలిగిస్తుంది.
హైపర్‌గోనాడిజం: టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితిని సూచిస్తుంది, దీనివల్ల ముఖంపై మొటిమలు, కోపం, ఫెర్టిలిటీ సమస్యలు, వంధ్యత్వం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
టెస్టోస్టెరాన్ టెస్ట్ రకాలు
టోటల్ టెస్టోస్టెరాన్: ఈ టెస్ట్‌లో రక్తంలో మొత్తం టెస్టోస్టెరాన్ స్థాయిలను లెక్కిస్తారు. సాధారణ స్థాయి 300-1,000 ng/dL.
ఫ్రీ టెస్టోస్టెరాన్: రక్తంలోని ప్రోటీన్ల వల్ల కోల్పోయిన టెస్టోస్టెరాన్‌ను ఈ టెస్ట్ లో గుర్తిస్తారు. సాధారణ స్థాయి 5-20 ng/dL.
బయో అవైలబుల్ టెస్టోస్టెరాన్: శరీరం ఉపయోగించడానికి అందుబాటులో ఉన్న టెస్టోస్టెరాన్ స్థాయిలను ఈ టెస్ట్ లెక్కిస్తుంది. ఇది 150-500 ng/dL మధ్య ఉండాలి.
టెస్టోస్టెరాన్ సమస్యలకు చికిత్స
తక్కువ టెస్టోస్టెరాన్: దీనికి టెస్టోస్టెరాన్ రిప్లేస్‌మెంట్ థెరపీ (TRT) అందించబడుతుంది. ఇందులో టెస్టోస్టెరాన్ ఇంజక్షన్లు, జెల్స్, లేదా ప్యాచ్‌లు ఉపయోగిస్తారు.
అధిక టెస్టోస్టెరాన్: ఎక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్నప్పుడు, ఇది అనేక ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు, అందువల్ల వైద్యుడు సమగ్రమైన పరీక్షలు చేయించి, చికిత్స అవసరం ఉంటే సూచిస్తారు. ఈ రకమైన టెస్ట్‌లు మరియు చికిత్సలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రించడం అనేది శరీర ఆరోగ్యాన్ని, హార్మోన్ సమతుల్యతను కలిపి అన్ని విధాలా శ్రేయస్సు కోసం ముఖ్యం.



Click it and Unblock the Notifications