Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
భాగస్వామితో సెక్స్ బోరు కొడుతోందా? ఇలా చేస్తే నిమిషం కూడా వదలిపెట్టాలనిపించదు!
రిలేషన్ షిప్ ప్రారంభంలో సెక్స్, రొమాన్స్ పట్ల ఉన్న ఉత్సాహం కాలం గడిచే కొద్దీ తగ్గిపోతుంది. ఓ రెండు, మూడేళ్ల తర్వాత సెక్స్ బోరింగ్ గా కూడా అనిపించే అవకాశం ఉంది. చాలా మంది జంటల్లో ఓ ఏడాది తర్వాత శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి. సమస్యలను తొలగించుకోండి.
సెక్స్ ఎందుకు ఎందుకు బోరింగ్ గా మారుతుంది?
మన మొదడు ప్రతిరోజూ ఒకేరకమైన దృశ్యాలు, వాసనలు, కార్యకలాపాలకు అలవాటు పడినప్పుడు.. రొటీన్ గా ఫీలవుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు నచ్చిన ఆహారాన్ని రోజూ తింటే కొంత కాలానికే దానిపై విరక్తి పెరుగుతుంది. సైక్స్ కూడా ఇలాగే. రోజూ చేస్తూ పోతుంటే నచ్చకుండా మారుతుంది. ఇదే కాకుండా ఒత్తిడి, అలసట, జీవితంలో కలిగే మార్పుల వల్ల కూడా లైంగిక చర్యలపై విసుగు వస్తుంది.

సెక్స్ కు మానసిక స్థితి కూడా చాలా ముఖ్యమైంది. మీరు మీ భాగస్వామితో గొడవ పడుతున్నా, మానసికంగా అంత దగ్గరకాలేకపోయినా, వారి మాటల వల్ల మానసికంగా కాస్త దూరమైనా వారిపై ఇష్టాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల వారిపై మీకు సెక్స్ కోరికలు కల్గవు. ఒకవేళ కల్గినా చాలా బోరింగ్ గా అనిపిస్తుంటుంది. మీరూ ఇలాంటి భావనే పొందుతున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ భాగస్వామితో స్వేచ్ఛగా మాట్లాడండి:
వీలు కుదిరినప్పుడుల్లా మీ భాగస్వామితో స్వేచ్ఛగా మాట్లాడండి. మీ ప్రాధాన్యతల గురించి చర్చించండి. పడుకునే ముందు కాకుండా తినగానే అలా వాక్ చేస్తూ, ఇద్దరే కలిసి భోజనం చేస్తున్నప్పుడు సెక్స్, తదితర పర్సనల్ అంశాల గురించి మాట్లాడుకోవాలి. కొత్తగా ట్రై చేస్తుంటే కాస్త ఆసక్తి పెరుగుతుంది. సెక్స్ మరీ అంత బోరింగ్ గా అనిపించదు.
2. మానసికంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి:
మీరు మానసికంగా సంతోషంగా ఉన్నప్పుడే సెక్స్ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది. మానసికంగా ప్రేమించడం అంటే సెక్స్ మాత్రమే కాదు. ఇతర విషయాలను కూడా కలిసి ఆస్వాదించండి. ఉదాహరణకు కలిసి కొత్త వంటకాలను ప్రయత్నించండి, కలిసి సినిమా చూడండి, నడక కోసం బయటకు వెళ్లండి, మీరు ఇంతకు ముందెన్నడూ చేయనిది ప్రయత్నించండి. ఇది కూడా మిమ్మల్ని మానసికంగా అటాచ్ చేయగలదు.
3. సెన్సేషన్ ప్లేని ప్రయత్నించండి:
ఒకే రకమైన సెక్స్ కూడా చాలా మందిలో విసుగు తెప్పిస్తుంది. అందుకే కొత్త కొత్త యాంగిల్స్ లో ట్రై చేస్తూ ఎంజాయ్ చేయండి. మీ భాగస్వామికి తెలియని యాంగిల్ చూపిస్తూ మీ ప్రేమను అందించండి. ఒకరి నోట్లోని చాక్లెట్, టీ, ఐస్ క్రీం వంటి వాటిని మరొకరు జుర్రుకోవడం, ఇద్దరూ ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది.
4. భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వండి:
మీ సంబంధంలో ఆగ్రహం, నిరాశ, డిస్‌కనెక్ట్ అనేది బోరింగ్ సెక్స్‌కు అతిపెద్ద దోహదపడే కారకాల్లో ఒకటి. మీరు ఈ సమస్యలతో బాధ పడుతున్నట్లయితే.. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని కలిసి గడపాలి. మీ భావాలను వ్యక్తపరచడం, సమస్య పరిష్కారానికి కృషి చేయడం ద్వారా మీ బంధం బలపడుతుంది. మీ భావోద్వేగ సాన్నిహిత్యం పెరిగుతున్నా కొద్దీ.. లైంగిక జీవితంపై కూడా ఆసక్తి పెరుగుతుంది.
5. నిజాయితీగా ఉండడం ముఖ్యం:
సమయం లేకపోవడం, ఆసక్తి లేకపోవడం లేదా అనేక కారణాల వల్ల సెక్స్ బోరింగ్‌గా మారవచ్చు. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండటం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవచ్చు. దాని వల్ల మరింత దగ్గరై అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ.. సెక్స్ లైఫ్ ను కూడా ఫుల్లగా ఎంజాయ్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications