Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పార్ట్‌నర్ మోసం చేస్తే ఇలా డీల్ చేయాలి..! ఆవేశం కన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..!
రిలేషన్‌షిపలో ఎలాంటి గొడవలైనా జరగొచ్చు కానీ మోసం చేయడం క్షమించరాని నేరం. ఇద్దరూ కలిసివున్నా ఒకరు కావాలని మోసం చేయడం, ప్రమిస్తున్నట్టు నటించడం వల్ల రిలేషన్‌షిప్ మొత్తం ఆ వ్యక్తి వల్ల కలుషితమవుతుంది. అలాంటి రిలేషన్‌షిప్‌లో కొనసాగకపోవడమే మంచింది. ఇలాంటి సంబంధాల వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి పార్ట్‌నర్‌ను మార్చడం చాలా కష్టం.
పార్ట్‌నర్ మోసం చేస్తే దానిని క్షమించడం, చూస్తూ భరిస్తూ వుండటం సాధ్యమయ్యే పని కాదు. ఈ సమయంలో వారు తీవ్రమైన మనోవేదనకు గురౌతారు. భార్య, లేదా భర్త మోసం చేశారని తెలియగానే భావోద్వేగంగా ఏవేవో నిర్ణయాలను తీసేసుకుంటారు. ఇది వారి జీవితంలో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. మిమ్మల్ని మీ పార్ట్‌నర్ మోసం చేస్తుందని మీకు తెలిస్తే, వేరే వారితో అఫ్ఫైర్ ఉందని తెలిస్తే మేము చెప్పిన విషయాలను పాటించండి. అప్పుడు మీరు ఈ సమస్య నుంచి తొందరగా బయటపడే అవకాశం వుంది. తొందరపడి ఏ నిర్ణయాలను తీసుకోవద్దు.

పగ తీర్చుకోవద్దు
మీ భార్య లేదా మీ భర్త మిమ్మల్ని మోసం చేశారని మీకు తెలియగానే వారిపై ఎక్కడా లేని కోపం వస్తుంది. వారిని వెంటనే ఏదైనా చెయ్యాలి, వారిని కొట్టాలి అని మీరనుకుంటారు. ఇలా చేయడం వల్ల మీరు తాత్కాలికంగా సంతృప్తిని పొందవచ్చు కానీ అది శాశ్వత పరిష్కారం ఇవ్వదని గ్రహించాలి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మీరు మీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించడం లేదంటే వారితో సర్దుకు వెళ్లడం చేయాలి.
మీ పై మీరు దృష్టి పెట్టండి
పార్ట్‌నర్ వేరే వాళ్లతో అఫ్ఫైర్ పెట్టుకుందని తెలియగానే మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది. రాత్రుళ్లు నిద్రపట్టకపోవచ్చు, ఆకలి వేయకపోవచ్చు, తలనొప్పి వస్తుంది, వాంతులు కూడా అయ్యే పరిస్థితి వుంటుంది. అలాంటి సందర్భంలో మీరు మీ ఆరోగ్యం పై దృష్టిని కేంద్రీకరించాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. నిద్రించడానికి ఒక టైంటేబుల్‌ను రెడీ చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.
పిల్లలకు తెలియనివ్వరాదు
మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తుందని తెలిస్తే అప్పుడు మీకు గనుక పిల్లలు వుంటే ఈ విషయాన్ని పిల్లలకు చెప్పవద్దు. పిల్లలకు ఈ విషయం చెప్పడం వల్ల వారు ఆందోళనకు, మానసిక వేదనకు గురైతారు. చిన్నవయసులో వారి మనసుపై బలమైన గాయం తగిలినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలను పిల్లలకు తెలియనివ్వద్దు.

నిందించి శక్తిని వృధా చేసుకోద్దు
పార్ట్‌నర్ మోసం చేసిందని తెలియగానే పార్ట్‌నర్‌ను ఒకసారి నిందించవచ్చు.. కానీ పదే పదే నిందించడం, గొడవపడ్డం వల్ల మీ శక్తిని వృధా చేసుకోవడం తప్ప ఏ మార్పూ రాదని మీరు అర్థం చేసుకోవాలి. నిందించడం వల్ల మీ సమయం, శక్తీ అంతా వృధా అవుతుంది.
ఆలోచించండి నిర్ణయం తీసుకోవాలి
మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేసిందని మీకు తెలిస్తే మీరు ఆ విషయాన్ని కుటుంభ సభ్యులకు చెప్పాలా వద్దా అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో జరిగి పరిణామాలను ఒకసారి అంచనా వేసుకోండి. రాబోయే అన్ని సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటాను అని మీకు అనిపిస్తే మీరనుకున్నట్లు ముందుకు సాగవచ్చు.



Click it and Unblock the Notifications