Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్య కోపంగా వుంటే.. ఇలా హ్యాండిల్ చేయండి..!
పెళ్లనేది నూరేళ్ల పంట కాదు నూరేళ్ల మంట అని కొందరు చలోక్తులు విసురుతూ వుంటారు. దీనికి వెనక భార్యా భర్తల మధ్య జరిగే అంతులేని గొడవలే కారణమని చెబుతున్నారు. పెళ్లైన కొత్తలో ఎలా వుందో జీవితం మొత్తం అలాగే వుంటుందనుకోవడం పూర్తిగా భ్రమ. భార్యా భర్తల మధ్య కోపం, గొడవలు సహజంగానే ఎక్కువగా వుంటాయ్. కానీ వాటిని శృతి మించకుండా చూసుకోవాలి. భర్త రోజంగా పనిచేసి, లేదా వ్యాపారం చేసి ఇంటికి వచ్చిన తరువాత కొంత రిలాక్స్ అవుదామని అనుకుంటాడు. ఆ సమయంలో భార్య భర్తపై కోపంగా ప్రవర్తిస్తే ఇక ఆ వైవాహిక జీవితం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది.
భార్య తన భర్తను చాలా సులువుగా మ్యానేజ్ చేసుకోగలదు, అయితే ఈ విషయంలో భర్తలు కొంత వెనకబడి వుంటారు. భార్య ప్రమతో వున్నట్టే వుండి ఒక్కసారిగా కోపంతో భర్త మీద పడిపోతుంది. ఈ సమయంలో భర్త తీవ్ర సమస్యలను ఎదుర్కొంటాడు. భార్య కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియన సతమతమవుతుంటాడు. ఇలాంటి భార్యల పట్ల ఎలా మెలగాలి. భార్యల కోపాన్ని ఎలా అణచివేయాలో కొన్ని చిట్కాలను మీకు ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నాము.

కౌగిలించుకోండి
మీ భార్యకు వెంటనే ఎక్కడాలేని కోపాన్ని మీపైన ప్రదర్శిస్తే ముందుగా మీరు చేయవలసిన పని. మీ భార్యను దగ్గరకు తీసుకొని ఒక కౌగిలింతను ఇచ్చి ఆమెను ముద్దుపెట్టుకోవాలి. ఇలా చేయగానే ఆమెకు వున్న కోపం ఉన్నట్టుండి ఎగిరి పోతుంది. భర్త ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతే భార్య ఇంటిపనులు, పిల్లలు, అత్తా,మామ, సరుకులు, వంట, క్లీనింగ్ పనులతో బిజీ అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో భార్యకు చిరాకు రావడం సహజం. కాబట్టి భర్త వీటన్నింటినీ అర్థం చేసుకొని భార్యకు ఒకరోజు విశ్రాంతి తీసుకోమని, పనులన్నింటినీ ఒక రోజు పక్కనబెట్టమని చెప్పాలి.
సమయం కేటాయించాలి
ఆఫీస్ పనులతో అలసిపోయిన భర్త ఇంటికి వచ్చి భోజనం చేసి వెంటనే పడుకుంటాడు. ఇలా చేయడం వల్ల కూడా భార్యకు కోపం వస్తుంది. ఇంటికి వచ్చిన తరువాత భార్యతో కొంత సమయాన్ని గడపాలి. ఎంత బిజీగా వున్నా భార్య కోసం కొంత సమయాన్ని పక్కకు తీసి మాట్లాడాలి. ఇచేయడం వల్ల భార్య కోపానికి రాకుండా వుంటుంది.

పిల్లలను చూసుకోవాలి
భార్య కోపంగా వుంటే పిల్లలను దగ్గరకు తీసుకొని వారి బాగోగులు చూడాలి. పిల్లలను ఆడించడం, వారికి తినిపించడం, వారితో మాట్లాడటం చేస్తే భార్యకు కోపం తగ్గుతుంది. పిల్లలో కలిసి కాలం గడపడం వల్ల భార్య కూడా భర్తపై అరిచే సమయం, సందర్భం దొరకదు. దీంతో భార్య అరవడానికి ఆస్కారం వుండదు.
ప్రేమను చూపాలి
మీపై భార్య ఎంత కోపాన్ని ప్రదర్శించినా మీరు ఓర్పుతో, సహనంతో వుండాలి. ఆమె కోపాన్ని ప్రదర్శించినప్పుడల్లా మీరు ఆమెపై ప్రేమను కురిపించాలి. అలా కాకుండా మీరు కూడా కోపాన్ని ప్రదర్శిస్తే మంటపై పెట్రోల్ పోసినట్లవుతుంది. వీలయితే భార్యకు క్షమాపణ చెప్పాలి. ఇలా చయడం వల్ల భార్య కోపం ఖచ్ఛితంగా తగ్గుతుంది.
భార్యకు బహుమతులు
మీ భార్య మీపై తరచూ కోపాన్ని ప్రదర్శిస్తుందని మీకనిపిస్తే.. మీ బ్యాగులో ముందు జాగ్రత్తగా ఎప్పుడూ ఒక చిన్న బహుమతిని ప్యాక్ చేసుకొని పెట్టుకోండి. ఈ బహుమతులు కూడా మీ భార్యకు ఇష్టమైన వస్తువులకు సంబంధించిన వుండాలి. ఇలాంటివి భార్యకు బహుమతిగా ఇవ్వడం వల్ల కోపం వెంటనే కరిగిపోతుంది.



Click it and Unblock the Notifications