Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
What To Say: కలయికలో.. పని చేయడమే కాదు, మాటలూ ముఖ్యమే
మహిళలకు కలయిక మాత్రమే సరిపోదు. వారు ప్రేమను కోరుకుంటారు. ఆ ప్రేమను వ్యక్తం చేయాలని భావిస్తారు.
What To Say: శృంగారం సమయంలో చాలా మంది పురుషులు చాలా యాంత్రికంగా ప్రవర్తిస్తుంటారు. ఆ మూడ్ రాగానే రెచ్చిపోయి వెంటనే చల్లబడిపోతారు. కానీ మహిళలు అలా కాదు. వారికి కలయిక మాత్రమే సరిపోదు. వారు ప్రేమను కోరుకుంటారు. ఆ ప్రేమను వ్యక్తం చేయాలని భావిస్తారు.

చేతల ద్వారా మాత్రమే కాకుండా నోటి మాటల ద్వారా ప్రేమను, ఇష్టాన్ని, వ్యామోహాన్ని వినేందుకు ఇష్టపడతారు. అందుకే నోటికి కూడా పని చెప్పాలని అంటారు నిపుణులు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. మహిళలు మాట్లాడేందుకు, వినేందుకు ఇష్టపడతారు. మహిళలకు, మౌఖిక సంభాషణ అనేది భావోద్వేగ సాన్నిహిత్యానికి కీలకం అని రిలేషన్షిప్ సైకాలజిస్టులు చెబుతున్నారు.

1. నిజాయతీగా ఉండండి:
మీరు చెప్పేదానిని మీరు అర్థం చేసుకోవాలి. మీ బాడీ లాంగ్వేజ్ ఎల్లప్పుడూ నిజం చెబుతుంది. అది మీ పదాలతో ఏకీభవించకపోతే.. ఆమె మీరు చేసేది బ్లఫ్ అనుకోవచ్చు.

2. నిర్దిష్టంగా ఉండండి:
ఇది మిమ్మల్ని మరింత ఆలోచనాత్మకంగా అనిపించేలా చేస్తుంది. మీరు ఆమెలో ఏదైనా ప్రత్యేకతను గమనించినట్లు ఆమెకు చూపుతుంది. అందంగా ఉన్నావు అనడానికి.. నీ కళ్లు చాలా బాగున్నాయి అని చెప్పడానికి చాలా తేడా ఉంది.

3. పాయింట్‌కి వెళ్లండి:
మీ భాగస్వామితో మాట్లాడటానికి మీరు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. విషయాలను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడం ముఖ్యం.

శృంగారానికి ముందు
1. జుట్టు చాలా బాగుంది
ఏదైనా శారీరక పొగడ్త ఆమెకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఆమె చాలా కృషి చేస్తుందని మీకు తెలిసిన వాటిపై దృష్టి సారించడం మీరు శ్రద్ధ చూపుతున్నారని మరియు ఆమె ప్రయత్నాలను మీరు అభినందిస్తున్నారని చెబుతుంది.

2. నువ్వు పెట్టే ముద్దు నాకు చాలా ఇష్టం
మీరు వారిని ముద్దుపెట్టుకోవడాన్ని ఇష్టపడుతున్నారని తెలుసుకోవడం మహిళలకు చాలా ముఖ్యం. శృంగార సమయంలో చేసే అల్లరి పనులు వాళ్లు చాలా ఇష్టపడతారు. అలాంటి పనులు చేయాలని కోరుకుంటారు. వారికి ఏది ఇష్టమో అది ఇవ్వడానికి ప్రయత్నించండి.

3. నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది
ఆమెలో ఉద్రేకం పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. డర్టీగా మాట్లాడితే ఆమెలో ఆ కోరికలు రగిలించవచ్చు. అయితే అదొక్కటే మార్గం కాదు. చిన్న చిన్న పదాలు, ప్రేమను వ్యక్తం చేసే వర్డ్స్ వాడుతూ ఆమెలో కోరికలను పెంచొచ్చు. అయితే ఆమెకు దేనిని ఇష్టపడుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆమె మీ జీవితంలో ఉంటే ఎలాంటి మార్పు వస్తుందో చెప్పవచ్చు. తన సాన్నిహిత్యం మీకు ఎలాంటి భావాలను కలిగిస్తుందో వివరించవచ్చు.

4. నీతో మమేకం కావడానికి ఆత్రుతగా ఉన్నాను
శృంగారానికి ముందు ఈ మాట ఆమెలో కోరికలను రగిలిస్తుంది. ఇది మీ నోటి నుండి వస్తున్నప్పుడు మీ చేతులు కూడా పని చేస్తూ ఉంటే ఆ మాటకు రెట్టింపు ప్రయోజనం చేకూరుతుంది.

సెక్స్ సమయంలో
1. నాకు నువ్వంటే..
శృంగారం సమయంలో మీరు ఆమెతోనే ఉండాలని కోరుకుంటుంది. శారీరకంగా మాత్రమే కాదు మానసికంగానూ మీరు ఆమెతోనే ఉండాలని భావిస్తుంది. శరీరం ఇక్కడ, మనసు ఇంకెక్కడో ఉండటానికి ఆమె ఏమాత్రం ఇష్టపడదు. అందుకే మాటల ద్వారా మీరు పూర్తిగా ఆమెతోనే ఉన్నారని చెప్పాలి.
ఆమెను, ఆమె శరీరాన్ని ప్రశంసించాలి. పొగుడుతూ మీకు కావాల్సింది రాబట్టుకోవాలని అంటారు సెక్సాలజిస్టులు. మాట్లాడుతూ చేతులతో చేయాల్సిన పనులు చేయాలి. అప్పుడే వారు పిచ్చెక్కిపోతారు.

2. నువ్వెంత టేస్టీగా ఉన్నావో..
మీరు మీ స్వంత ఎండోమెంట్ గురించి ఎలా చింతిస్తున్నారో అలాగే, ఆమె ప్రైవేట్ పార్ట్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారనే ఆమె ఆందోళన చెందుతుంది. కాబట్టి మాటలతో, చేతలతో ఆమెకు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి. తర్వాత ఆమెను సంతృప్తి పరచాలి.

3. నువ్వు ఆ పొజిషన్‌లో చాలా హాట్‌గా ఉన్నావు
శృంగారం సమయంలో పొగడ్తలు మంచి పాత్ర పోషిస్తాయి. పొగడ్తలు ఆమెలో కోరికలను రగిలిస్తుంది. ఆమె భాగాలను ఒక్కొక్కటిగా, మొత్తంగా వివిధ భంగిమల్లో కనిపించే తీరు గురించి మాట్లాడండి.

సెక్స్ తర్వాత
1. వావ్
వావ్ పదానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శృంగార సమయంలో మీరు వ్యక్తం చేయలేని భావాలను వావ్ పదంతో తెలిపవచ్చు. క్లుప్తంగా మరియు సరళంగా, మీరు ఆమెపై ప్రేమను, కోరికను తెలియజేయవచ్చు.

2. థ్యాంక్స్
ఔనన్నా.. కాదన్నా.. థ్యాంక్స్ చెప్పాల్సిందే. మిమ్మల్ని అంతలా సంతృప్తి పరిచిన మీ పార్ట్ నర్ కు థ్యాంక్స్ చెప్పడంలో తప్పు లేదు. అయితే అది చెప్పే పద్ధతి రొమాంటిక్ గా ఉండాలి. శృంగారం అనేది స్త్రీ పురుషునికి ఇవ్వగల అత్యంత విలువైన బహుమతి. కాబట్టి ధన్యవాదాలు చెప్పండి.
ఆమెతో కలయికను మీరు ఎంతగానో ఆస్వాదించారని, చాలా సంతృప్తి చెందానని, ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఆమెతో ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నానని చెప్పండి. శృంగారం అయిపోగానే అంతా అయిపోయిందని అనుకోవద్దు. ఆ సమయంలో మీరు అనుభవించిన సుఖాన్ని, మాటల రూపంలో ఆమెకు చెబుతూ ఉండండి. దానితో ఆమెలో మరోసారి కోరికలు రగిలించవచ్చు.



Click it and Unblock the Notifications