Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
భార్య మిమ్మల్ని ఎప్పటికీ అనుమానించకూడదంటే ఏం చేయాలో తెలుసా?
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనందరి జీవితాల్లో ఒక ముఖ్యమైనదిగా మారిపోయింది. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే దాకా స్మార్ట్ ఫోన్ లేకుంటే ఏ పని జరగదు,పొద్దు గడవదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ అతి వినియోగం,దుర్వినియోగం కారణంగా అనేక అనర్థాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాట్సాప్.. మన సంబంధాలను దగ్గర చేస్తూనే, ఒక్కోసారి చిన్న అపార్థాలతో చిచ్చు రేపుతుంది. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు..ఇంట్లో నిశ్శబ్ద తుఫాను సృష్టించడానికి.
మీ భార్య మీ ఫోన్ లో అనుకోకుండా ఒక చాట్ చదివి, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే? ఆ క్షణంలో ఆమె కళ్ళలో కోపం, మీ గుండెల్లో భయం..ఈ పరిస్థితి చాలా మందికి అనుభవమే. ఇలాంటి సమయంలో ఆవేశపడటం, తప్పు నాది కాదు అని వాదించడం లేదా భయంతో మౌనంగా ఉండిపోవడం లాంటివి పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. బంధం బీటలు వారకుండా ఉండాలంటే ఆ క్షణంలో సంయమనం పాటించి, ప్రేమతో పరిస్థితిని చక్కదిద్దాలి. మీ దాంపత్య జీవితంలో ఇలాంటి గొడవలకు చోటులేకుండా, అపార్థం అనే చీకటిని తొలగించే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ చూడండి.

ప్రశాంతతే మొదటి మంత్రం
ఆమె కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా కోప్పడితే అది గొడవను పెంచుతుందే తప్ప తగ్గించదు. మీరు ప్రశాంతంగా ఉంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ ప్రశాంతత ఆమె కోపాన్ని సగానికి తగ్గిస్తుంది.
నిజాయితీనే మీ ఆయుధం
ఆమెను బాధపెట్టిన ఆ మెసేజ్ వెనుక ఉన్న అసలు నిజాన్ని నిజాయితీగా వివరించండి. అబద్ధాలు చెప్పడం, సాకులు వెతకడం వల్ల మీపై ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ మెసేజ్ అసలు సందర్భం ఏమిటో స్పష్టంగా, నిజాయితీగా చెప్పండి. నిజం కాస్త బాధపెట్టినా చివరికి బంధాన్ని నిలబెడుతుంది.
పారదర్శకతే నమ్మకానికి పునాది
దాపరికం అనుమానాలకు జన్మనిస్తుంది. నా దగ్గర దాచడానికి ఏమీ లేదు అని మీ ప్రవర్తనతో చూపించండి. మీ ఫోన్, పాస్ వర్డ్ ల విషయంలో పారదర్శకంగా ఉండటం వల్ల ఆమెలో భద్రతా భావం పెరుగుతుంది. ఇది ఆమె నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఒక బలమైన పునాది వేస్తుంది.
ఆమె వాదన కూడా వినండి
కేవలం మీ వివరణ ఇచ్చి చేతులు దులుపుకోవద్దు. ఆమె ఎందుకు అంతగా బాధపడుతుందో శ్రద్ధగా వినండి. ఆమె స్థానంలో ఉండి ఆలోచించండి. ఆమె భావాలను, భయాలను అర్థం చేసుకున్నారని ఆమెకు తెలిస్తే ఆమె కోపం నెమ్మదిగా కరిగిపోతుంది. నీ బాధ నాకు అర్థమైంది అనే ఒక్క మాట చాలు, పరిస్థితిని మార్చేయడానికి.

నమ్మకాన్ని తిరిగి గెలుచుకోండి
పగిలిన అద్దాన్ని అతికించడం కష్టమే కానీ అసాధ్యం కాదు. అలాగే దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆమెతో ఎక్కువ సమయం గడపండి, చిన్న చిన్న సర్ ప్రైజ్‌లు ఇవ్వండి. మీ ప్రేమను మాటల్లో, చేతల్లో వ్యక్తపరచండి. మీపై ఆమెకు ఉన్న డౌట్స్ నెమ్మదిగా తొలగిపోయేలా ఓపికతో వ్యవహరించండి.
సరిహద్దులు గీసుకోండి
ప్రతి బంధంలో ప్రైవసీ అవసరం. గొడవ సద్దుమణిగాక, ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి. ఏ విషయాలు పంచుకోవాలి, దేనికి వ్యక్తిగత సమయం అవసరం అనే దానిపై స్పష్టమైన అవగాహనకు రండి. ఈ సరిహద్దులు భవిష్యత్తులో ఇలాంటి అపార్థాలు రాకుండా ఒక కవచంలా కాపాడతాయి. కొన్నిసార్లు సమస్య మీ ఇద్దరి చేతుల్లోంచి జారిపోతోందని అనిపిస్తే అహం వీడి నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి.



Click it and Unblock the Notifications
