Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ భాగస్వామికి ఎప్పుడూ అదే యావా? కామంతో కటకటలాడుతుంటారా? పెద్ద ప్రమాదం!
వైవాహిక జీవితంలో శృంగారం లేదా శారీరక సాన్నిహిత్యానికి ఒక ప్రత్యేకమైన, అందమైన స్థానం ఉంటుంది. జంట మధ్య అనుబంధాన్ని, ఆప్యాయతను పెంచడంలో, దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని నింపడంలో శృంగారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన లైంగిక జీవిత బంధాన్ని బలపరుస్తుంది. అయితే అదే శృంగారం హద్దులు దాటి, ఒక వ్యసనంగా మారితే? ప్రేమ స్థానంలో కేవలం కామం మాత్రమే మిగిలితే ఆ బంధం ఇక డేంజర్ జోన్ లో ఉన్నట్లే.
చాలా పెళ్లిళ్లు పెటాకులు అవడానికి, లవ్ రిలేషన్స్ కట్ అవడానికి, వివాహేతర సంబంధాలు పెట్టుకోడానికి లైంగిక అసంతృప్తి ఒక కారణమైతే..అతిశృంగారం కూడా అంతే తీవ్రమైన సమస్య. మీ భాగస్వామి ప్రవర్తనలో శృంగారం పట్ల కేవలం ఇష్టం కాకుండా ఒకరకమైన పిచ్చి లేదా వ్యసనం కనిపిస్తోందా? అయితే అది కేవలం అధికమైన కోరిక కాదు ఒకరకమైన మానసిక సమస్య కూడా కావచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే బంధం విచ్ఛిన్నం అవ్వడమే కాకుండా, వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయాన్ని వారితో సున్నితంగా చర్చించి కౌన్సిలింగ్ నిపుణులను లేదా సంబంధిత నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సంకేతాలను గమనించడం ద్వారా మీ భాగస్వామిలోని ఈ సమస్యను గుర్తించవచ్చు.

భావోద్వేగ బంధం కంటే పడక సుఖానికే ప్రాధాన్యత
భాగస్వామి మీతో గడిపే టైంలో లోతైన సంభాషణలు, మీ ఇష్టాయిష్టాలు, మీ రోజు ఎలా గడిచింది వంటి భావోద్వేగపరమైన విషయాల కంటే ఎక్కువగా శృంగారం గురించే మాట్లాడుతున్నారా? మీ మధ్య ఉన్నది కేవలం శారీరక బంధమేనని, మానసిక బంధానికి విలువివ్వడం లేదని మీకు అనిపిస్తోందా? ఇది ఒక హెచ్చరిక సంకేతం. ఎందుకంటే అలాంటి వారు శృంగారాన్ని ప్రేమను వ్యక్తపరిచే మార్గంగా కాకుండా ఒక అవసరంగా మాత్రమే చూస్తారు. ఇది మీ బంధాన్ని తెలగిపోయేలా చేస్తుంది.
సమయం, సందర్భం లేని కోరికలు
భాగస్వామి మీ మానసిక స్థితి, ఆరోగ్యం లేదా చుట్టూ ఉన్న వాతావరణంతో సంబంధం లేకుండా కేవలం శృంగారం కోసమే నిరంతరం పట్టుబడుతున్నారా? పబ్లిక్ గా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, అసభ్యంగా తాకడం వంటివి చేస్తున్నారా? ఇది ప్రేమ కాదు, కేవలం వారి శారీరక అవసరాన్ని తీర్చుకోవాలనే ఆత్రుత మాత్రమే. ఆరోగ్యకరమైన బంధంలో పరస్పర అంగీకారానికి, కంఫర్ట్ కి విలువ ఉంటుంది.
అశ్లీల చిత్రాలు చూడటం
మీ భాగస్వామి ఎప్పుడూ అశ్లీల చిత్రాలు చూడటంలో మునిగిపోతున్నారా? వాస్తవ ప్రపంచంలోని సాన్నిహిత్యం కంటే ఆ కల్పిత ప్రపంచంలోనే ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటున్నారా? ఇది వారి ఆలోచనా విధానాన్ని దెబ్బతీయడమే కాకుండా మీ మధ్య ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది.
స్వార్థపూరితమైన శృంగారం
శృంగార సమయంలో మీ ఆనందం, ఇష్టాయిష్టాలకు విలువివ్వకుండా కేవలం వారి శారీరక సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తున్నారా? మీ కోరికలను, మీ శరీరాన్ని గౌరవించకుండా కేవలం వారి సుఖం కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నట్లు అనిపిస్తోందా? ఇది సంబంధంలో తీవ్రమైన అగౌరవానికి గుర్తు.



Click it and Unblock the Notifications