Latest Updates
-
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.! -
జూన్ 4: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో అద్భుతమైన మార్పులు!
మీ లవర్ పై మీ ఫ్రెండ్ చూపు పడిందా? ఇలా ఎదుర్కోండి!
మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో టాప్ ప్లేస్ లో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మన మంచి,చెడు,రహస్యాలు అన్నింటిని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటాం. ఇంట్లో వ్యక్తుల కన్నా స్నేహితులే ప్రాణంగా భావిస్తుంటారు చాలామంది. ఫ్రెండ్ ఉంటే చాలు ఇంకెవరు అక్కర్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే మీరు ప్రాణంగా భావించే ఫ్రెండ్ మీరు లవ్ చేసే వ్యక్తితో హద్దులు మీరడం ప్రారంభిస్తే? మీ గుండెలో కోపం, బాధ, అయోమయం లాంటి భావోద్వేగాల తుఫాను మొదలవుతుంది. ఇద్దరిలో ఎవరిని నమ్మాలి? ఎవరితో మాట్లాడాలి? ఈ క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటే, తెలివిగా ఎలా బయటపడాలో ఇక్కడ చూడండి.
తొందరపాటు వద్దు, గమనించడమే
మీ ఫ్రెండ్ ప్రవర్తన మీకు ద్రోహంలా అనిపించవచ్చు.. కానీ వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు. కొన్నిసార్లు స్నేహపూర్వక సంభాషణ కూడా సరసాలాడినట్టు అనిపించవచ్చు. అందుకే కాస్త ఓపికతో గమనించండి. మీ ఫ్రెండ్ చనువుగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ భాగస్వామి స్పందన ఎలా ఉంది? వారు అసౌకర్యంగా ఫీలవుతున్నారా లేక ప్రోత్సహిస్తున్నారా? ఇది ఒకేసారి జరిగిందా లేక పదేపదే రిపీట్ అవుతోందా? అర్ధరాత్రి మెసేజ్ లు, అనవసరమైన పొగడ్తలు, హద్దు మీరిన శారీరక చనువు వంటివి ఏమైనా ఉన్నాయా? ఇది గమనించడం ద్వారా సమస్య ఎవరి వైపు నుండి వస్తోందో స్పష్టం చేస్తుంది. అది మీ ఫ్రెండ్ ఏకపక్ష ప్రవర్తనా లేక ఇద్దరి మధ్య నడుస్తున్న వ్యవహారమా అనేది మీకు అర్థమైపోతుంది.

మొదటి సంభాషణ భాగస్వామితోనే
ఏదైనా తేల్చుకునే ముందు మీ భాగస్వామితో మాట్లాడండి. నిందలు వేయకుండా, మీ బాధను పంచుకోండి. నువ్వు తనతో మరీ చనువుగా ఉంటున్నావు అని కోపంగా అనడానికి బదులుగా..ఈ మధ్య మీ ఇద్దరి మధ్య చనువు చూస్తుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, దీని గురించి మనం మాట్లాడుకుందామా? అని సున్నితంగా అడగండి. ఇలా చేయడం వల్ల వారు ఆత్మరక్షణలోకి వెళ్లకుండా మీ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బహుశా వారి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుందని వారు గ్రహించలేదేమో. మీ భాగస్వామి మీ ఆందోళనను అర్థం చేసుకుంటే ఇద్దరూ కలిసి ఒక పరిష్కారం కనుక్కోవచ్చు. మీ బంధాన్ని కాపాడుకోవడమే మీ ఇద్దరి లక్ష్యం కావాలి.ః
స్నేహానికి సరిహద్దులు గీయండి
మీ భాగస్వామితో మాట్లాడిన తర్వాత మీ ఫ్రెండ్ తో సమయం వస్తుంది. ఈ సంభాషణ సూటిగా, గౌరవంగా, కానీ గట్టిగా ఉండాలి. నువ్వు నా పార్ట్ నర్ తో ప్రవర్తించే తీరు నన్ను బాధిస్తోంది. అర్ధరాత్రి కాల్స్ లేదా ప్రైవేట్ చాట్స్ వంటివి మన స్నేహానికి, నా బంధానికి మంచిది కాదు అని స్పష్టంగా చెప్పండి. ఒక నిజమైన ఫ్రెండ్ మీ బాధను అర్థం చేసుకుని, తమ ప్రవర్తనను మార్చుకుంటారు. కానీ వారు మీ మాటలను కొట్టిపారేసినా, మీదే తప్పన్నట్టు మాట్లాడినా ఆ స్నేహం ఆరోగ్యకరమైనది కాదని మీరు గుర్తుంచుకోవాలి.

నమ్మకమే పునాది
మీ భాగస్వామిపై మీకు పూర్తి నమ్మకం ఉంటే స్నేహితుడి ప్రవర్తన మిమ్మల్ని అంతగా కదిలించదు. అదే సమయంలో మీ బంధంలో నమ్మకం లోపించినప్పుడు, ప్రతి చిన్న విషయం కూడా అనుమానాలకు దారితీస్తుంది. అందుకే మీ ఇద్దరి మధ్య పారదర్శకత, గౌరవం ఉన్నప్పుడు, ఏ బయటి శక్తీ దాన్ని బలహీనపరచలేదు. బలమైన బంధం ఎలాంటి తుఫానునైనా తట్టుకుని నిలబడగలదని గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications