Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ దేశాల్లో విడాకులకు నో ఛాన్స్..పెళ్లయితే ఇక అంతే!
ప్రేమగా మొదలైన వైవాహిక జీవితం కొన్నిసార్లు కలహాల మయం అవుతుంది. జీవిత భాగస్వాములు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, న్యాయబద్ధంగా ఆ బంధాన్ని తెంచుకోవడానికి విడాకులు అనేది ఒక పరిష్కారం. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో విడాకులు తీసుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్న పని, ఏకంగా చట్టవిరుద్ధం కూడా. ఆ పవిత్ర బంధానికి అంత సులువుగా ముగింపు పలకని ఆ దేశాల గురించి ఇక్కడ చూడండి
ఫిలిప్పీన్స్..విడాకులు చట్టవిరుద్ధం
ఆసియాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన విడాకుల చట్టాలు ఉన్న దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి. ఇక్కడ ముస్లిం మతస్తులకు తప్ప ఇతరులకు విడాకులు చట్టవిరుద్ధం. అత్యధికంగా రోమన్ కాథలిక్ జనాభా కలిగి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కాథలిక్ చర్చి ప్రభావం ఇక్కడి చట్టాలపై బలంగా ఉంది. విడాకులకు బదులుగా ఫిలిప్పీన్స్ పౌరులు అన్నల్మెంట్ (వివాహ రద్దు) లేదా లీగల్ సెపరేషన్(చట్టపరమైన విభజన) మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్నల్మెంట్ ప్రక్రియ చాలా ఖరీదైనది, సుదీర్ఘమైనది . వివాహ రద్దుకు బలమైన కారణాలు, మానసిక అనారోగ్యం వంటి రుజువులు చూపాల్సి ఉంటుంది. లీగల్ సెపరేషన్ ద్వారా విడిగా జీవించవచ్చు కానీ చట్ట ప్రకారం వారికి వేరొకరిని వివాహం చేసుకునే అవకాశం ఉండదు.

వాటికన్ సిటీ
ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశమైన వాటికన్ సిటీలో విడాకులు చట్టవిరుద్ధం. వాటికన్ సిటీ రోమన్ కాథలిక్ చర్చి కేంద్రంగా ఉంది, ఇది కాథలిక్ చట్టాల (కెనాన్ లా) ప్రకారం నడుస్తుంది. మతపరమైన కట్టుబాట్లు అత్యంత బలంగా ఉండే ఈ దేశంలో వివాహ బంధాన్ని జీవితకాల ఒప్పందంగా భావిస్తారు. విడాకుల కోసం ఇక్కడ ప్రత్యేక చట్టపరమైన ప్రక్రియ అంటూ ఏదీ లేదు. కాథలిక్ మతంలో అన్నల్మెంట్ కు అవకాశం ఉన్నప్పటికీ ఇది కూడా సంక్లిష్టమైన, అరుదైన ప్రక్రియ.
జపాన్
ఇక్కడ విడాకులు సులభమే అయినా, కొన్ని ఆంక్షలు ఉన్నాయి. విడాకులు తీసుకున్న మహిళలు, కొన్ని ప్రత్యేక కేసులలో తప్ప 100 రోజులు గడిచే వరకు మళ్లీ వివాహం చేసుకోకూడదు అనే చట్టం ఉండేది. ఇటీవల ఇందులో మార్పులు వచ్చినా తల్లిదండ్రుల హక్కుల విషయంలో సంక్లిష్టతలు ఉన్నాయి.
సౌదీ అరేబియా,ఈజిప్ట్
ముస్లిం దేశాలలో షరియా చట్టాల ప్రభావం వల్ల పురుషులు తమ ఇష్టానుసారం తలాక్ చెప్పి విడాకులు పొందడం సులువుగా ఉంటుంది. కానీ మహిళలు విడాకులు తీసుకోవాలంటే న్యాయస్థానంలో భర్త తప్పిదాలను నిరూపించాలి లేదా ఇతర కఠిన నిబంధనలకు లోబడి ఉండాలి. భార్య విడాకులు కోరితే ఆమె తన హక్కులను, కన్యాశుల్కాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. విడాకులపై ఉన్న ఈ కఠిన నిబంధనలు లేదా నిషేధాలు ఆయా దేశాల మత విశ్వాసాలు, సాంస్కృతిక విలువలు, సామాజిక కట్టుబాట్లను ప్రతిబింబిస్తాయి. ఈ చట్టాలు కొన్నిసార్లు, అసంతోషకరమైన వైవాహిక జీవితంలో చిక్కుకున్న వ్యక్తులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంటాయి.



Click it and Unblock the Notifications