Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సైకాలజీ ప్రకారం పురుషులు ఎలాంటి అమ్మాయిలను కోరుకుంటున్నారో తెలుసా?
ప్రతి ఒక్కరికీ మంచి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అందంలో గుణంలో అందరికంటే మిన్నగా ఉన్న అమ్మాయినే తన జీవితంలో రావాలనే ఆశ ఉంటుంది. తమను అర్ధం చేసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావాలని అనుకుంటారు. ఇలానే అబ్బాయిలు తాము పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఏ విధమైన అమ్మాయిలను వారు కోరుకుంటున్నారు అనేది ఈ స్టోరీలో వివరించాము. సైకాలజీ ప్రకారం అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో పూర్తిగా చదవండి..
తెలివితేటలున్న అమ్మాయిలు..
సాధారణంగా అబ్బాయిలు ఎక్కువ తెలివితేటలు, వ్యక్తితంలో ఉన్నతంగా ఉంటూ.. సమస్యలను పరిక్షరించేందుకు నైపుణ్యం ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడుతున్నారట. వారివైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తేలింది. తెలివితేటలు ఉన్న అమ్మాయిలు ప్రయోజకురాలు అవుతారని, అందుకే వారివైపు ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు.

దయ ఉన్న అమ్మాయిలు..
ఎవరైతే అమ్మాయిలు దయతో, ప్రేమతో సమాజం పట్ల బాధ్యతతో ఉంటారో వారినే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని సైకాలజీ ప్రముఖులు చెబుతున్నారు. దీని కారణంగా వారి వల్ల మనశ్శాంతితో పాటు ప్రేమ, దయ అన్నీ దొరుకుతాయని అబ్బాయిలు అనుకుంటున్నారట.
నిజాయితీ
ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే కచ్చితంగా నిజాయితీ అనేది చాలా ముఖ్యం. దంపతులిద్దరూ నిజాయితీగా ఉంటేనే వారి బంధం కలకాలం ఉంటుంది. అందుకే అబ్బాయిలు నిజాయితీగా ఉండే అమ్మాయిలనే కోరుకుంటున్నారట. వారితో తమ బంధం నూరేళ్లు ఉంటుందని చెబుతున్నారు.
స్నేహభావం
ప్రతి ఒక్కరిలో స్నేహభావం అనేది కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలకు ఉండాలి. ఎందుకంటే పెళ్లి తరువాత భర్త వైపు ఉండే వారితో కూడా వారు స్నేహంగా మెలగాలి. అప్పుడే వారి బంధంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకే ఎవరైతే అమ్మాయిలు స్నేహభావంతో ఉంటారో వారినే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
మెచ్యూరిటీ..
అమ్మాయిలు తెలివిగా, నిజాయితీగా ఉండడం మాత్రమే కాదు మెచూరిటీగా కూడా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటున్నారట. పరిస్థితులను తగ్గట్లుగా విషయాలను హ్యాండిల్ చేయగల అమ్మాయిలను కోరుకుంటున్నారు. వారైతే క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమను వదలరని, తమకు సహాయంగా ఉంటారని చెబుతున్నారు.
హాస్యం..
జీవితంలో నవ్వు అనేది చాలా ముఖ్యం. నవ్వితే మనిషి జీవించే కాలం పెరుగుతుందని అందరూ చెబుతుంటారు. అయితే కేవలం కోపంగా, మూడీగా ఉండే అమ్మాయిల కంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మాయిలనే అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్నారు. అలాంటి అమ్మాయిలు తమ జీవితంలో నవ్వును, ఆనందాన్ని తెప్పిస్తారని, వారుంటేనే జీవితం కష్టసమయంలో కూడా బాగుంటుందని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications