Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ కే ఎందుకు ఆకర్షితులవుతారో తెలుసా?..ఇది మామూలు యవ్వారం కాదు గురూ
అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని తరుచుగా కొందరు మాట్లాడుతుండటం మనం చూస్తుంటాం. వియ్ లవ్ బ్యాడ్ బాయ్స్ అంటూ అమ్మాయి చెప్తున్నట్లు ఉండేలా అనేక పాటలు కూడా వచ్చాయి. అయితే అసలు అమ్మాయిలు మంచి అబ్బాయిలను కాదని బ్యాడ్ బాయ్స్ ని ఎందుకు లైక్ చేస్తారు అనే ప్రశ్నకు చాలాకాలంగా కొందరిలో ఉండిపోయింది. సాధారణంగా బ్యాడ్ బాయ్స్ అనే పదం వినగానే.. నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి,దేనిని గౌరవించని,చట్టాలను ఖాతరు చేయని మనస్తత్వం, ధిక్కార స్వభావం కలిగిన వ్యక్తి చిత్రం కళ్ళముందు కదలాడుతుంటది.
సమాజంలో చాలామంది బ్యాడ్ బాయ్స్ ను తప్పుగా చూస్తారు. అయితే అమ్మాయిలు ఎందుకు బ్యాడ్ బాయ్స్ ను ఇష్టపడతారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. బ్యాడ్ బాయ్స్‌లో కనిపించే ఆత్మవిశ్వాసం, సాహసం, రహస్య స్వభావం వంటి లక్షణాలు అమ్మాయిలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు.

ఆత్మవిశ్వాసం
సాధారణంగా మిగతావాళ్లతో పోల్చితే బ్యాడ్ బాయ్స్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. బ్యాడ్ బాయ్స్ లోని ఈ గుణమే అమ్మాయిలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది ఒక వ్యక్తి సామర్థ్యాలను,నిర్ణయాలను నమ్మే ఒక లక్షణం. బ్యాడ్ బాయ్స్‌కు తమ గురించి ఒక బలమైన అభిప్రాయం ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు వీరు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇది అమ్మాయిలకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ బ్యాడ్ బాయ్స్ మాత్రం అలా ఉండరు.
థ్రిల్ కోరుకోవడం
రెండో కారణం ఏంటంటే బ్యాడ్ బాయ్స్ సాధారణంగా బాగా ఎనర్జిటిక్ గా,సాహసోపేతంగా ఉంటారు. కొత్త విషయాలను ప్రయత్నించడానికి, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. జీవితంలో ఒక వైవిధ్యం కోరుకునే అమ్మాయిలకు ఇది చాలా నచ్చుతుంది. చాలామంది అమ్మాయిలు తమ జీవితంలో ఏదో ఒక థ్రిల్ కోరుకుంటారు. బ్యాడ్ బాయ్స్‌తో ఉంటే ఆ థ్రిల్‌ను అనుభవించవచ్చు అని అమ్మాయిలు భావిస్తారు. బ్యాడ్ బాయ్స్ ని అమ్మాయిలు కోరుకోడానికి ఇదొక ముఖ్య కారణం.
రహస్య స్వభావం
మూడో కారణం ఏంటంటే బ్యాడ్ బాయ్స్ సాధారణంగా రహస్యంగా ఉంటారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం అంత సులభం కాదు. వారి ప్రవర్తన ఊహించలేని విధంగా ఉంటుంది. ఇది అమ్మాయిలలో ఒక విధమైన ఉత్సుకతను రేకెత్తిస్తుంది. వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది. అమ్మాయిలు వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ప్రేమకు దూరమైనోళ్లు
నాలుగో కారణం ఏంటంటే కొన్నిసార్లు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ ను ఎంచుకోవడానికి కారణం వారి గత అనుభవాలు కావచ్చు. చిన్నతనంలో తండ్రి ప్రేమకు దూరమైన అమ్మాయిలు లేదా గతంలో ప్రేమలో మోసపోయిన అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ కు ఆకర్షితులు కావడానికి అవకాశం ఉంది. ఇలాంటి అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ లో తమ తండ్రిలో వెతుక్కునే లక్షణాలను లేదా తమను మోసం చేసిన వ్యక్తిలో ఉన్న లక్షణాలను చూసుకుంటారు.
బ్యాడ్ బాయ్స్‌ను ఇష్టపడటం అనేది ఒక తాత్కాలిక ఆకర్షణ మాత్రమే కావచ్చు. చాలామంది అమ్మాయిలు చివరికి స్థిరమైన,నమ్మకమైన సంబంధాన్ని కోరుకుంటారు. అటువంటి సంబంధాన్ని బ్యాడ్ బాయ్స్ ఇవ్వలేరు.



Click it and Unblock the Notifications