Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పెళ్లైన మగాళ్లపై అమ్మాయిల మోజు..ఆకర్షణ వెనుక అసలు కారణాలు ఇవే!
ప్రేమలో ప్రతిదీ న్యాయమే..లవ్ కి కులం,మతం,వయస్సు, హోదా,ప్రాంతంతో సంబంధం లేదని అంటుంటారు. అయితే పెళ్లయిన ఒక మగాడితో ఓ అమ్మాయి ప్రేమలో పడటం అనేది సమాజంలో ఎప్పుడూ ఒక సున్నితమైన, చర్చనీయాంశమైన విషయం. ఇలాంటి సంబంధాలు మన చుట్టూ ఉన్న సమాజంలోనూ తరచూ కనిపిస్తూ, ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంటాయి. అసలు యువతులు తమకంటే వయసులో పెద్దవారైన, ఇప్పటికే వివాహ బంధంలో ఉన్న పురుషుల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? ఇది కేవలం భావోద్వేగాలకు సంబంధించిన విషయమేనా? లేక దీని వెనుక బలమైన మానసిక, సామాజిక కారణాలు ఉన్నాయా? ఐదు ప్రధాన కారణాలను ఇక్కడ చూడండి.
అనుభవం, పరిపక్వత అనే అయస్కాంతం
యుక్తవయసులో ఉండే చాలామంది అమ్మాయిలకు జీవితంపై పూర్తి అవగాహన ఉండదు. వారి ఆలోచనలు, నిర్ణయాలు అపరిపక్వంగా ఉంటాయి. మరోవైపు వివాహిత పురుషులు జీవితంలోని ఒడిదొడుకులను చూసిన అనుభవజ్ఞులు. వారిలోని ఈ పరిపక్వత, సమస్యలను ఎదుర్కొనే విధానం ప్రశాంతమైన స్వభావం యువతులకు ఒకరకమైన ధైర్యాన్ని, ఆకర్షణను కలిగిస్తాయి. వారి అనుభవం అమ్మాయిల దృష్టిలో వారిని మరింత తెలివైన వారిగా, ఆరాధించదగిన వారిగా నిలబెడుతుంది.

భద్రత, స్థిరత్వం కోసం అన్వేషణ
కెరీర్ ప్రారంభంలో లేదా ఇంకా జీవితంలో స్థిరపడని యువతులు భవిష్యత్తుపై ఒకరకమైన అభద్రతాభావంతో ఉంటారు. పెళ్లయిన మగాళ్లు సాధారణంగా ఆర్థికంగా, వృత్తిపరంగా ఒక స్థిరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఈ స్థిరత్వం యువతులకు బలమైన భద్రతాభావాన్ని అందిస్తుంది. తమను జాగ్రత్తగా చూసుకోగలరనే నమ్మకం వారిని ఆ బంధం వైపు లాగుతుంది.
అమూల్యమైన అనుభూతిని కలిగించడం
పెళ్లయిన మగవాళ్లు తమ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని అనుభవాల వల్ల ఎదుటివారి భావాలను ఓపికగా వినగలుగుతారు. వారు యువతుల మాటలకు, భావోద్వేగాలకు విలువ ఇస్తారు. తమ వయసు వారితో పోల్చినప్పుడు ఈ రకమైన శ్రద్ధ, గౌరవం యువతులకు ఒక ప్రత్యేకమైన, అమూల్యమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ మానసిక బంధమే వారి ఆకర్షణకు పునాది వేస్తుంది.
సాహసం, ఉత్కంఠ అనే మత్తు
కొంతమంది యువతులకు సమాజం వద్దంటున్న పని చేయడంలో ఒకరకమైన థ్రిల్, సాహసం కనిపిస్తాయి. వివాహితుడితో రహస్య సంబంధం వారి జీవితానికి ఉత్కంఠను జోడిస్తుందని భావిస్తారు. ఈ కోరిక, సాహసం చేయాలనే తపన వారిని ప్రమాదకరమైన హెచ్చరికలను కూడా పక్కన పెట్టేలా చేస్తాయి.
సోషల్ మీడియా సృష్టించే భ్రమ
ప్రజెంట్ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ. విజయవంతమైన, ఆత్మవిశ్వాసంతో, ఆకర్షణీయంగా కనిపించే వివాహిత పురుషుల ప్రొఫైల్స్ యువతులను సులభంగా ఆకట్టుకుంటాయి. వారి ఆన్ లైన్ వ్యక్తిత్వం చూసి భ్రమపడి, వారి నిజ జీవితం కూడా అలాగే ఉంటుందని ఊహించుకుంటారు. ఇది వారిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.
వివాహిత పురుషుడితో బంధం మొదట్లో ఎంతో శృంగారభరితంగా, ఉత్తేజకరంగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి, సామాజిక సవాళ్లకు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి ఏ బంధంలోకి అడుగుపెట్టే ముందైనా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ, వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications