Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
సంభోగ సమయంలో ఎక్కువ గ్యాప్? ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
దంపతుల మధ్య శారీరక కలయిక అనేది కేవలం క్షణికానందమో లేక శారీరక సుఖమో మాత్రమే కాదు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి సంబంధించిన ఒక కీలకమైన అంశం. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిలో పౌష్టికాహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో..సంతృప్తికరమైన లైంగిక జీవితం కూడా అంతే ముఖ్యం.
అయితే కొన్ని కారణాల వల్ల ఎక్కువ కాలం పాటు శృంగారానికి దూరంగా ఉంటే ఏమవుతుంది? దీని ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది? అన్న విషయాలపై నిపుణులు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. మీరు ఎక్కువ కాలం పాటు శారీరక సంబంధాలకు దూరంగా ఉంటే మీ శరీరం, మనస్సులో జరిగే 5 ప్రధాన మార్పులు ఏంటో ఇక్కడ చూడండి.

లైంగిక శక్తి సన్నగిల్లడం
ఏదైనా మెషీన్ అయినా లేదా వస్తువు అయినా వాడుకలో లేకపోతే పనితనం తగ్గుతుంది అనే సామెతను మన పెద్దలు తరచూ చెబుతుంటారు. ఈ విషయంలో కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. మీరు చాలా కాలం పాటు శృంగారానికి దూరంగా ఉంటే మీ శరీరంలో లైంగిక కోరికలు వాటంతటవే తగ్గిపోతాయి.
మెదడు శృంగారపరమైన ఉద్దీపనలకు స్పందించడం నెమ్మదిస్తుంది. ఫలితంగా మళ్ళీ ఆసక్తి కలగడం కష్టంగా మారుతుంది. భాగస్వామితో సాన్నిహిత్యం లేకపోవడం వల్ల క్రమంగా ఆ ఆకర్షణ కూడా తగ్గుముఖం పడుతుంది.
పురుషులలో పనితీరు ఆందోళన
శృంగారానికి గ్యాప్ రావడం అనేది పురుషుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ఎఫెక్ట్ చూపుతుంది. దీర్ఘకాలిక విరామం తర్వాత కలిసినప్పుడు నేను సరిగ్గా చేయగలనా? అనే ఆందోళన వారిని వెంటాడుతుంది. దీనినే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు.
ఈ ఒత్తిడి కారణంగా అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శారీరక దూరం వల్ల కలిగే అభద్రతాభావం పురుషుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
స్త్రీలలో పొడిబారే సమస్యలు
మహిళల ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం చాలా ముఖ్యం. ఎక్కువ కాలం దూరంగా ఉండటం వల్ల యోని వాల్స్ బలహీనపడటంతో పాటు, సహజమైన తేమను కోల్పోతాయి.
ఈ పొడిబారడం వల్ల భవిష్యత్తులో సంభోగం సమయంలో తీవ్రమైన నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుంది. తరుచుగా శృంగారం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, సహజ లూబ్రికేషన్ ప్రక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
కటి కండరాల బలహీనత
శృంగారం అనేది ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్ సైజ్. ఇది పొత్తికడుపు, కటి ప్రాంతంలోని కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ కండరాలే మూత్రాశయాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
శృంగారానికి దూరంగా ఉంటే ఈ కండరాలు బలహీనపడి వయసు పెరిగే కొద్దీ మూత్ర నియంత్రణ సమస్యలు రావొచ్చు. అంతేకాకుండా బలమైన పెల్విక్ కండరాలు ఉంటేనే లైంగిక సంతృప్తి ఎక్కువగా ఉంటుంది.
బంధంపై ప్రభావం
శారీరక సాన్నిహిత్యం జంటల మధ్య భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. సంభోగ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ భాగస్వాముల మధ్య నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది. శారీరక దూరం పెరిగేకొద్దీ, జంటల మధ్య మానసిక దూరం కూడా పెరుగుతుంది. ఇది చిన్న చిన్న గొడవలకు, అసహనానికి, చివరకు నిరాశకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications