Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
'తర్వాత చేద్దాంలే..' ఇలా చాలా మంది పనులను ఎందుకు వాయిదా వేస్తారో తెలుసా?
చాలా మంది తమ పనులను వాయిదా వేస్తుంటారు. తర్వాత చేయొచ్చులే, తర్వాత చేద్దాంలే అంటుంటారు. ఏదైనా ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి వస్తే ఆఖరి రోజు వరకు తర్వాత చేద్దాం, తర్వాత చేద్దామంటూ వాయిదా వేసి ఆఖరి రోజు వరకు ఆగుతుంటారు. చాలా త
చాలా మంది తమ పనులను వాయిదా వేస్తుంటారు. తర్వాత చేయొచ్చులే, తర్వాత చేద్దాంలే అంటుంటారు. ఏదైనా ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి వస్తే ఆఖరి రోజు వరకు తర్వాత చేద్దాం, తర్వాత చేద్దామంటూ వాయిదా వేసి ఆఖరి రోజు వరకు ఆగుతుంటారు. చాలా తేలికైనా పనులను, కష్టమైన పనులను, ఇష్టం లేని పనులను, ఆందోళన తెప్పించే పనులు ఇలా వాయిదా వేస్తూ ఉంటారు. వాయిదా వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది.

పనులను వాయిదా వేసే వారు పలు రకాలు :
* సవాలు గురించి భయపడి కంఫర్ట్ జోన్‌ల నుండి బయటకు రావడానికి ఇష్టపడరు. దీని వల్ల పనులు వాయిదా వేస్తుంటారు.
* ఇచ్చిన సమయంలో చాలా టాస్క్‌లను నిర్వహించడం సాధ్యం కాదు. కానీ ఓవర్ డువర్స్ ఈ తప్పు చేస్తూ పనులు వాయిదా పడేలా చేస్తుంటారు.
* ఒక పనిని చేయగలమా లేదా అనే అనుమానంతో సతమతం అవుతుంటారు. దాని వల్ల కూడా పనులు వాయిదా పడుతుంటాయి.
* కొంత మంది గడువు దగ్గర పడ్డ తర్వాత పని మొదలు పెడుతుంటారు.

పనులు వాయిదా వేయకుండా ఎలా నివారించాలి:
1. చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి
ఒక పెద్ద ప్రాజెక్టును తీసుకుంటే దానిని సరళమైన, చిన్న దశలుగా విభజించుకోవాలి. తర్వాత ఒక్కో పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న లక్ష్యాలను చేరుకోవడం చాలా సులభం. ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటుంటే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. చేయాల్సిన పని కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది.

2. పనులను ఆర్గనైజ్ చేసుకోవాలి
ప్రతి పని పూర్తి చేయడానికి నిర్దిష్ట సమయాన్ని, లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. చిన్న లక్ష్యాలను చేరుకోవడం చివరి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారం, నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి.

3. సులభమైన విషయాలపై దృష్టి పెట్టాలి
త్వరగా, సులభంగా పూర్తి చేయగలిగే పనులపై మొదటి దృష్టి పెట్టాలి. చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవడం పనులను నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీని కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

4. దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి
మీరు ఒక పనిని శ్రద్ధగా చేస్తున్నప్పుడు మీ దృష్టి మరల్చే వాటిని తగ్గించుకోవాలి. సంగీతం, ఇంట్లో ఇతరులు చేసే శబ్దాలు, మాటలు, రణగొణధ్వనులు మీ దృష్టిని మరల్చవచ్చు. అలాంటి వాటి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
కొందరికి చదువుతున్నప్పుడు ఏదైనా మ్యూజిక్ లైట్ సౌండ్‌తో ప్లే చేసుకోవడం ఇష్టం ఉంటుంది. మరికొందరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అది వ్యక్తిని వ్యక్తిని బట్టి మారుతుంది.



Click it and Unblock the Notifications