Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Extra Marital Affairs: భారీగా బయటపడుతున్న వివాహేతర సంబంధాలు..కారణం ఇదే!
గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధాలు భారీగా పెరిగిపోతున్నాయి. మన చుట్టు పక్కన ఉన్న వ్యక్తులను గమనించడం ద్వారా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. వివాహేతర సంబంధాలకు అనేక రకాల కారణాలు ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్ ఎఫెక్ట్, లైంగికంగా భాగస్వామి సుఖపెట్టడం లేదని కొందరు ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతున్నారు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది.
వివాహేతర సంబంధాల కారణంగా కాపురాలు నాశనమడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. భారతదేశంలో నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం.

శారీరక,మానసిక అవసరాలు
దాంపత్య జీవితంలో శారీరక,మానసిక అవసరాలు తీరకపోవడం కూడా వివాహేతర సంబంధాలకు కారణమవుతున్నాయి. భావోద్వేగ మద్దతు లేకపోవడం, శారీరక సంతృప్తి కోసం వ్యక్తులు కొందరు వివాహేతర సంబంధాలను ఆశ్రయిస్తారు. ఇది వివాహేతర సంబంధానికి ఒక కారణంగా ఉంది.
కొత్తదనం
ఒకే వ్యక్తితో సుదీర్ఘంగా ఉండటం వలన కొత్తదనం కోసం ఆరాటపడ్డం ద్వారా వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. దాంపత్యంలో ప్రేమ తగ్గి కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వివాహేతర సంబంధాలను పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.
అభిరుచులు, ఆసక్తులు
భార్యాభర్తల మధ్య అభిరుచులు, ఆసక్తులు విభిన్నంగా ఉండటం వలన విభేదాలు, దూరం పెరుగుతుంది. ఈ విభేదాలు ఇతర వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగడానికి కారణం అవుతాయి.
సోషల్ మీడియా
సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వాడకం పెరగడం కారణంగా కొత్త పరిచయాలు ఈజీగా ఏర్పడుతున్నాయి. ఆన్‌లైన్ లో పరిచయాలు, చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా వ్యక్తులు సులభంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం చేస్తున్నారు. తమ డేటాను గోప్యంగా ఉండే సోషల్ మీడియా యాప్ లను వాడుతూ వాటి ద్వారా కొత్త పరిచయాలు పెంచుకొని కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధాలుగా మార్చుకుంటున్నారు చాలామంది.
ఆర్థిక కారణాలు
ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది దాంపత్య జీవితం ఒత్తిడికి గురవుతుంది. ఆర్థిక భారంతో మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలామంది దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఆర్థికంగా ఆందోళనలతో ఉన్న వ్యక్తులు బయట ఆనందం కోసం వివాహేతర సంబంధాలను వెతుక్కుంటున్నారు
సంస్కృతి ఛేంజ్
సాంస్కృతిక మార్పులతో వ్యక్తుల ఆలోచన విధానాలు, అభిరుచులు మారుతున్నాయి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం, సమాజంలో స్వేచ్ఛా భావం పెరగడం వలన వివాహేతర సంబంధాలను కొంతమంది సాధారణంగా తీసుకుంటున్నారు. సాంప్రదాయక ఆంక్షలు తగ్గి, వ్యక్తులు స్వేచ్ఛగా ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డం వల్ల వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications