Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
అమ్మాయిల మాదిరిగానే అబ్బాయిలకు కూడా పీరియడ్స్ ఉంటాయట.. ఎలా గుర్తించాలంటే?
అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి నెల వారి జీవితంలో సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. ఈ సమయంలో వారు ఎంతో నీరసానికి గురవుతారు. అలాగే వారికి మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా బలహీనంగా తయారవుతారు. దీంతో పాటు ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వారికి ఉండదు. కోపం, చిరాకు కూడా ఎక్కువగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలూ ఎక్కువగా అనుభవించే సమస్యలు ఇవి. అయితే అబ్బాయిలకు కూడా ఈ విధమైన సమస్యలు ప్రతి నెలా వస్తాయట.
అయితే అవి పీరియడ్స్ కాదు. అబ్బాయిల్లో ప్రతినెలా హార్మోన్ల చేంజెస్ జరుగుతుంటాయట. ఇలా జరిగినప్పుడు అబ్బాయిలు కూడా వివిధ రకాల అనుభావాలను అనుభవిస్తారని చెప్పుకుంటారు. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అనుభవించే ప్రతీది కూడా అబ్బాయిలు అనుభవిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ల చేంజెస్ జరిగినప్పుడు అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఇలాంటి సమయంలో వారు చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి అనే దానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హార్మోన్ల చేంజెస్ సమయంలో కనిపించే లక్షణాలు:
మూడ్ స్వింగ్స్: అకస్మాత్తుగా కోపం రావడం, చిరాకు పడడం, బాధ పడడం వంటివి జరుగుతాయి.
నీరసం: ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది.
ఏకాగ్రత లేకపోవడం: ఒక పని మీద ధ్యాస పెట్టలేకపోవడం.
నిద్రలేమి: సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువసేపు నిద్రపోవడం.
ఆకలిలో మార్పులు: ఆకలి ఎక్కువగా వేయడం లేదా పూర్తిగా తగ్గిపోవడం.
మానసిక ఆందోళన: ఒత్తిడికి గురవడం, భయపడడం.
శారీరక నొప్పులు: తలనొప్పి, కండరాల నొప్పులు వంటివి వస్తాయి.
దీనికి కారణాలు:
టెస్టోస్టెరాన్ స్థాయిల్లో మార్పులు: అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్థాయిలు మారుతూ ఉంటాయి. దీనివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి.
ఒత్తిడి: పని ఒత్తిడి, చదువు ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు వంటివి IMSకి దారితీస్తాయి.
నిద్రలేమి: సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఆహారపు అలవాట్లు: అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
ఈ సమయంలో ఏం చేయాలి?
ఆరోగ్యకరమైన జీవనశైలి: సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, తగినంత నిద్ర పోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడం: యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
సరైన విశ్రాంతి: పని నుండి విరామం తీసుకోవడం, మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
సమస్యలను పంచుకోవడం: మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది.
వైద్యుడిని సంప్రదించడం: లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
ఈ సమయంలో ఏం చేయకూడదు?
ఆల్కహాల్, ధూమపానం: ఈ అలవాట్లు IMS లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
జంక్ ఫుడ్: అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
ఒంటరిగా ఉండడం: ఒంటరిగా ఉండడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది.
స్వీయ వైద్యం: వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా మందులు వాడకూడదు.



Click it and Unblock the Notifications
